SBI Home Loans Get Cheaper From Today గృహ, వాహన వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్బీఐ

Psu banks likely to cut home car loan rates on govt push

Car Loan, markets, Shaktikanta Das, rate cut transmission, home loan, state bank of india, Monetary Policy, market news

Come next week, car and home loans could become even cheaper, especially at public-sector banks. With North Block more than nudging them to help revive flagging consumption demand, state-run lenders.

ఎస్బీఐ గుడ్ న్యూస్: ఖాతాదారులూ మంచి తరుణం మించిన దొరకదు

Posted: 08/10/2019 12:00 PM IST
Psu banks likely to cut home car loan rates on govt push

ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందించింది. బెంచ్ మార్క్ లెండింగ్ రేట్లను 0.15 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది నేటి నుంచి అమలులోకి వచ్చింది. స్టే్ట్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటు తగ్గించడం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది వరుసగా నాలుగోసారి కావడం గమనార్హం. దీంతో ఇప్పటి నుంచి ఎస్‌‌బీఐ ఎంసీఎల్ఆర్‌ రేటు 8.25 శాతం నుంచి ప్రారంభమౌతోంది.

ఏడాది కాలపు రుణాలకు ఇది వర్తిస్తుంది. ఇదివరకు ఎంసీఎల్ఆర్ 8.4 శాతంగా ఉంది. ఎస్‌బీఐ ఎంసీఎల్ఆర్ రేటు కోతతో హోమ్ లోన్ రేట్లు 35 బేసిస్ పాయింట్ల మేర దిగొచ్చాయి. ఇది గృహ రుణం తీసుకున్న వారికి శుభవార్త. వీరికి ఈఎంఐ భారం దిగొస్తుంది. అలాగే కొత్తగా రుణం తీసుకోవాలని భావిస్తున్న వారు కూడా తక్కువ వడ్డీకే లోన్ పొందొచ్చు.

ఎస్‌బీఐ ఎంసీఎల్ఆర్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం..

భారతీయ స్టేట్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ తగ్గింపుతో క్యాష్ క్రెడిట్/ఓవర్‌డ్రాఫ్ట్ కస్టమర్లకు రెపో లింక్‌డ్ లెండింగ్ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) 7.65 శాతంగా ఉంటుంది. సెప్టెంబర్ 1 నుంచి ఇది అమలులోకి వస్తుంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) రెపో రేటును 35 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన విషయం తెలిసిందే.

భారతీయ రిజర్వు బ్యాంకు.. బ్యాంకులకు రుణాలు ఇస్తూ ఉంటుంది. ఈ రుణాలపై వడ్డీ వసూలు చేస్తుంది. దీన్నే రెపో రేటు అంటారు. ఆర్‌బీఐ రెపో రేటు కోతతో ఎస్‌బీఐ కూడా ఎంసీఎల్ఆర్‌ను తగ్గించింది. దీంతో ఇక గృహ. వాహన రుణాల వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టనున్నాయి. మంచి తరుణం మించిన దొరకదని అన్నట్లు ఇక ఆలస్యమేలా.. రుణాలు కావాలా.. బ్యాంకు అధికారులను సంప్రదించండీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles