modi government bold step says janasena మోడీ సాహసోపేత నిర్ణయమన్న పవన్.. విలీనం వుండదు..

Modi government bold step says janasenani pawan kalyan

article 35A, Article 370, pawan Kalyan, janasena, BJP, modi sarkar, narendra modi, amit shan, Nazir Ahmad Laway, MM Fayaz, PDP, Congress, JK, Ladakh, indian armed forces, Jammu and Kashmir, Kashmiri terrorists, mehbooba mufti, Modi Government 2.0, omar abdullah, Operation Kashmir, Pak sponsored terrorism, PM Narendra Modi

Jana Sena president Pawan Kalyan said scrapping of Articles 370 and 35-A was a courageous decision and expressed confidence that it would foster peace between India and Pakistan.

మోడీ సర్కార్ సాహసోపేత నిర్ణయమన్న పవన్.. విలీనం వుండదు..

Posted: 08/06/2019 12:10 PM IST
Modi government bold step says janasenani pawan kalyan

రాజ్యసభలో ఆమోదం లభించిన జమ్మూకాశ్మీర్ పునర్విభజన బిల్లు, ఆర్టికల్ 370 రద్దుపై దేశవ్యాప్తంగా పలు రాజకీయ పక్షాల నుంచి మద్దతు లభిస్తున్న తరుణంలో జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా తమ పార్టీ తరపున స్పందించారు. ఈ ఆర్టికల్ ను రద్దు చేయడం సాహసోపేతమైన నిర్ణయమని, ఈ సందర్భంగా ప్రధాని మోదీని అభినందిస్తున్నానని అన్నారు. జమ్మూకాశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం కూడా స్వాగతించాల్సిన పరిణామేనని అన్నారు.

అసెంబ్లీ కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూకాశ్మీర్, చట్టసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ లను పునర్విభజన చేస్తూ తీసుకున్న నిర్ణయంతో భారత్, పాక్ దేశాల మధ్య, కశ్మీర్ లో శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నానని, దేశ సమగ్రత ఎంతో ముఖ్యమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. దేశ యువత మాదిరగానే కాశ్మీర్ యువత కూడా తమ భవిష్యత్తు, ఎదుగుదలపై దృష్టిసారిస్తుందని ఆయన అకాంక్షించారు.

నా ఊపిరి ఉన్నంతవరకు జనసేన ఉంటుంది: పవన్ కల్యాణ్

జనసేన విలీనంపై గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలను పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. తన ప్రాణం పోయినా జనసేనను ఏ పార్టీలోనూ విలీనం చేయబోనని స్పష్టం చేశారు. బీజేపీలో జనసేనను విలీనం చేస్తారంటూ కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని కార్యకర్తలు, అభిమానులను కోరారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

తనను ఓడించిన ఈ నేల నుంచే తనపై నమ్మకంతో ఓటేసిన ప్రతి ఒక్కరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నానని, జనసేనను ఏ పార్టీలోనూ విలీనం చేయబోనని పవన్ పునరుద్ఘాటించారు. టీడీపీతో జనసేన లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుందని ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారం చేశారని పవన్ అన్నారు. తాను ఎవరితోనూ లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకోనని, ఏదైనా ఉంటే అందరికీ చెప్పే చేస్తానని పేర్కొన్నారు. పార్టీని నడపడానికి వేల కోట్ల రూపాయలు అవసరం లేదని, టన్నుల కొద్దీ ఆశయం ఉంటే చాలని పవన్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : article 35A  Article 370  pawan Kalyan  janasena  BJP  modi sarkar  narendra modi  amit shan  JK  Ladakh  politics  

Other Articles