Indias' Woman FM: Nirmala After Indira అన్నదాతను కరుణించిన కేంద్రం.. రికార్డుపుట్టల్లోకి నిర్మల.!

Nirmala sitharaman first full time woman finance minister is no stranger to gst

PM Modi, Nirmala Sitharaman, Narendra Modi, fighter aircraft, Dassault Rafale, Arun Jaitley, Amit Shah, sushma swaraj, S Jaishanker, Rajnath singh, farmers, cabinet meet, crop investment, pension to farmers, unemployment crisis, employment, jobs, agricultural distress, Politics

Nirmala Sitharaman’s advantage in negotiating ministerial assignments and will be a key attribute in handling the finance ministry she takes over from Arun Jaitley.

అన్నదాతను కరుణించిన కేంద్రం.. రికార్డుపుట్టల్లోకి నిర్మల.!

Posted: 06/01/2019 12:12 PM IST
Nirmala sitharaman first full time woman finance minister is no stranger to gst

కేంద్రంలో రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం.. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో భేటీ అయిన నూతన క్యాబినెట్ తొలిభేటీలో అన్నదాతను కరుణించింది. గత పర్యాయం దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా.. అన్నదాతలను అదుకునేందుకు ముందుకురాని ప్రభుత్వం ఈ సారి అధికారంలోకి వచ్చిరాగానే వరాలను కురిపించింది. నూతన క్యాబినెట్ తొలిభేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అదనపు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.

ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద ఏటా 14.5 కోట్ల మంది రైతులకు రూ.6 వేల చొప్పున ఇవ్వనున్నారు. దేశంలోని ప్రతి రైతుకు కిసాన్ యోజన వర్తింప చేయాలని తీర్మానించారు. ఈ సందర్భంగా చిన్న, సన్నకారు రైతుల పెన్షన్ పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇదిలావుంటే నూతన క్యాబినెట్ లో పదవులు దక్కిన వారిలో గుజరాత్ మార్క్ కూర్పు కనబడింది. బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు కేంద్ర హోంశాఖ పదవి లభించిన నేపథ్యంలో ఇలాంటి వార్తలు తెరపైకి వస్తున్నాయి.

దీంతో గతంలో అదే శాఖ నిర్వహించిన రాజ్‌నాథ్‌ సింగ్‌కు రక్షణ శాఖ కేటాయించగా, ఇప్పటి వరకు రక్షణ మంత్రిగా వ్యవహరించిన తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్‌కు ఆర్థిక శాఖను మోదీ అప్పగించారు. అయితే దేశ చరిత్రలో ఆర్థిక శాఖ చేపట్టబోతున్న నిర్మలా సీతారామన్ రికార్డు పుటల్లోకి ఎక్కారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించనున్న రెండో మహిళాగా చరిత్ర సృష్టించారు. గతంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1970లో ఏడాదిపాటు ఈ బాధ్యతలు చేపట్టారు. కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి ప్రధాని నరేంద్రమోదీ సూచన మేరకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శాఖలు కేటాయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Modi  Nirmala Sitharaman  Narendra Modi  fighter aircraft  Dassault Rafale  Arun Jaitley  Politics  

Other Articles