Nandyal MP SPY Reddy passes away ఎస్పీవై రెడ్డి మరణంపై రాజకీయ ప్రముఖుల సంతాపం..

Senior andhra politician and three time mp spy reddy passes away

pawan kalyan, janasena, Pawan Kalyan SPY Reddy condolence, chandrababu condolence on spy reddy, YS jagan condolence on spy reddy, Pawan Kalyan SPY Reddy nandyal, SPY Reddy JanaSena, SPY Reddy nandyal, SPY Reddy dead, spy reddy no more, spy reddy passes away, nandyal parliamentary constituency, andhra pradesh, politics

Sitting MP from Nandyal constituency in Andhra Pradesh S P Y Reddy died after prolonged illness at a private hospital in Hyderabad on Tuesday night. He was 68. Reddy was hospitalised early this month.

ఎస్పీవై రెడ్డి మరణంపై రాజకీయ ప్రముఖుల సంతాపం..

Posted: 05/01/2019 12:35 PM IST
Senior andhra politician and three time mp spy reddy passes away

రాజకీయా కురువృద్ద నేత ఎస్పీవై రెడ్డి (69) ఇకలేరు. ఆయన మరణవార్త రాజకీయవర్గాల్లో విషాదాన్ని నింపింది. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు. గుండె, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూడుసార్లు ఎంపీగా గెలిచిన ఆయన విశేష సేవలు అందించారు. ఈ సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేనలో చేరిన ఎస్పీవై రెడ్డి నంద్యాల నుంచి బరిలో ఉన్నారు.

గత నెలలో జనసేన చీఫ్ పవన్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎస్పీవై రెడ్డి వడదెబ్బకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను ఏప్రిల్ 3న బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి పదిగంటల సమయంలో మృతి చెందారు. ఆయన మరణవార్త కర్నూలు జిల్లాలో విషాధం నిండుకుంది. ఎస్పీవై రెడ్డి మృతి వార్త తెలిసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు. తమ పార్టీకి చెందిన సీనియర్ నేతను కోల్పోవడం తీరనిలోటని అన్నారు.

రాజకీయాల్లో హుందాతనం పాటించిన గొప్ప వ్యక్తి ఎస్పీవై రెడ్డి అని ప్రశంసించారు. రాజకీయాల్లో ఆయన అనుభవం, సేవాగుణం పార్టీకి ఎంతగానో ఉపయోగపడతాయనే జనసేనలోకి ఆయనను ఆహ్వానించినట్టు చెప్పారు.  ఆయన మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రగాఢ సంతాపం తెలిపారు. నంది గ్రూపు సంస్థలు స్థాపించి ఎంతోమందికి ఉపాధి కల్పించిన గొప్ప మనిషి ఎస్పీవై అని కొనియాడారు. ఆయన మృతి కర్నూలు జిల్లాకు, నంద్యాల ప్రాంతానికి తీరని లోటన్నారు. ఎంపీగా ఆయన విశేష సేవలు ప్రశంసనీయమన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  SPY Reddy  chandrababu  YS jagan  nandyal lok sabha  andhra pradesh  politics  

Other Articles