Will do away with exam fee for govt posts: Rahul యువతకు గుడ్ న్యూస్ చెప్పిన రాహుల్.. అరోగ్యభారత్ హామీ..

Will do away with exam fee for government posts says rahul gandhi

Rahul Gandhi on unemployment, Rahul Gandhi on Health, Rahul Gandhi on right to health, Rahul Gandhi on health budger, Rahul Gandhi on jobs, Rahul Gandhi on health care, Rahul Gandhi, congress, congress manifesto, Exam Fee, healthcare, Lok Sabha elections 2019, Rahul Gandhi Facebook

Congress president Rahul Gandhi said if his party was voted to power in the upcoming Lok Sabha polls, the application fees for examinations for government posts would be done away with.

యువతకు గుడ్ న్యూస్ చెప్పిన రాహుల్.. అరోగ్యభారత్ హామీ..

Posted: 04/08/2019 11:16 PM IST
Will do away with exam fee for government posts says rahul gandhi

తొలిదశ ఎన్నికలకు సరిగ్గా రెండు రోజుల ముందు.. బీజేపి పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన రోజున కాంగ్రెస్ పార్టీ కూడా రెండు కీలక ప్రకటనలు చేసింది. ఈ ప్రకటనల్లో నిరుద్యోగులతో పాటు అరోగ్యభారత నిర్మాణానికి పాటుపడతామంటూ ఎన్నికల వాగ్ధానాలను చేశారు. దేశంలోని నిరుద్యోగ యువతీ యువకులకు నిరుద్యోగ భృతి కల్పించే అంశాన్ని తెలుగు రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న క్రమంలో దేశవ్యాప్తంగా వున్న నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ఫేస్‌బుక్ పేజీ ద్వారా కీలక ప్రకటన చేశారు.

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే అన్ని రకాల పరీక్షలకు ఫీజులు మాఫీ చేసేలా ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించారు. దీంతో ఇకపై నిరుద్యోగ యువతీ యువకులు పలు పరీక్షల నిమిత్తం వేల రూపాయలను ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండాపోతుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. నిరుద్యోగ యువతీ యువకుల నుంచి పరీక్షఫీజుల పేరుతో డబ్బు వసూలు చేయడం వారితో పాటు వారి తల్లిదండ్రులను కూడా కష్టపెట్టమేనన్న భావన కాంగ్రెస్ వర్గాల్లో నెలకోంది.

ఇక దీంతో పాటు యావత్ భారత దేశం అరోగ్యంగా వుండేందుకు ‘రైట్ టు హెల్త్’ అనే కొత్త పథకాన్ని తీసుకువస్తామని కూడా రాహుల్ గాంధీ తన సోషల్ మీడియా ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా వెలువరించారు. భారత్ లోని పేద వర్గాల అరోగ్యమే పరమావధిగా భావించి దానికోసం బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయిస్తామని రాహుల్ పోస్టులో పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో లోక్‌సభ తొలి విడత ఎన్నికలు జరగనుండగా రాహుల్ తాజాగా చేసిన ప్రకటన ఏ మేరకు ప్రభావాన్ని చూపిస్తుందో వేచి చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Facebook  congress  congress manifesto  Exam Fee  healthcare  Lok Sabha elections 2019  

Other Articles