sattenepalli tdp activists oppose kodela candidature సత్తెనపల్లి టీడీపీలో అసమ్మతి సెగ.. కోడెల వద్దంటున్న తమ్ముళ్లు..

Sattenepalli tdp activists oppose kodela candidature

Andhra Pradesh Speaker, Kodela ShivaPrasad, sattenapalli, TDP activists, General Elections 2019, TDP, YSRCP, Chandrababu, YS Jagan, Congress, Assembly Elections, Bheemili assembly constituency, vishakapatnam, Andhra Pradesh, Politics

Andhra Pradesh Speaker and senior TDP Leader Kodela Shiva Prasad is facing the heat of his own party activists. Activists opposing kodela candidature meet at sattenapalli and pass on the same to party Cheif Chandrababu.

సత్తెనపల్లి టీడీపీలో అసమ్మతి సెగ.. కోడెల వద్దంటున్న తమ్ముళ్లు..

Posted: 03/13/2019 12:30 PM IST
Sattenepalli tdp activists oppose kodela candidature

ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఎంతటి మహా నేతలకైనా అక్కడక్కాడా తిరస్కారాలు, చిత్కారాలు తప్పవు. అయితే ప్రజలపై పరోక్ష భారాలు వేసే నేతలకు మాత్రం వారి నియోజకవర్గాల్లో వ్యతిరేకత కూడా రావడం పరిపాటే. ఆయా నియోజకవర్గాల ప్రజలు ఆ నేతలకు తమ ఓటుతో బుద్ది చెప్పడం కూడా జరుగుతుంది. అయినా తమ పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు,  కార్యకర్తలు, తన అనుయాయువులతో వ్యవహరాలను చక్కబెట్టి ఎన్నికలకు వెళ్తుంటారు నేతలు.

అయితే మాకు ఈ నేత వద్దు.. మరో నేతకు టిక్కెట్ ఇవ్వండీ అంటూపార్టీల అధిష్టానం ముందు అభ్యర్ధనలు కూడా వస్తాయి. అయితే ఇది ఆ నియోజకవర్గంలో టిక్కెట్ అశించే మరో నేత కార్యకర్తలు, అనుచరులు చేసే డ్రామాగా కొందరు కొట్టిపారేస్తుంటారు. ఈ విషయాన్ని కూడా పక్కనబెడితే.. ఆ నియోజకవర్గంలో వున్న సీనియర్ నేత. ఇక ఆ ఇలాకాలో ఆయన కాకుండా మరోకరు ఆ స్థానంపై కూడా కన్నువేయలేరు. అలాంటి స్థానం నుంచి ఈ సీనియర్ నేత మాకు వద్దు అంటూ పార్టీ నేతలు, ద్వీతీయ శ్రేణి నాయకగణం ఒక్కటై సమావేశం ఏర్పాటు చేశారంటే అది అభ్యర్థిపై పూర్తి వ్యతిరేకత.

సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ స్పీకర్ కొడెల శివప్రసాద్ ఎదుర్కొంటున్నారు. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిక్కెట్ ను ఆశించే స్థాయిలో టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు లేకపోయినా.. వారు కోడెల శివప్రసాద్ అభ్యర్థిత్వాన్ని మాత్రం వ్యతరేకిస్తున్నారు. కొడెలకు సత్తెనపల్లి టిక్కెట్ కేటాయించవద్దని వారు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తున్నారు. ఈ మేరకు టీడీపీ నేతలు సమావేశమై కొడెల అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా నినదిస్తున్నారు. ‘‘కొడెల వద్దు.. చంద్రబాబు ముద్దు..’’ అంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు సొంత పార్టీవారి నుంచే గట్టి పోటీ ఎదుర్కోంటున్న కొడెలను టీడీపీ బరిలో నిలుపుతుందా.? అన్న సస్పెన్స్ కొనసాగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles