muntaz ahmed khan elected as protem speaker ప్రోటెం స్పీకర్ గా ముంతాజ్ అహ్మద్ ఖాన్

Mim mla muntaz ahmed khan elected as protem speaker for telangana assembly

KCR, TRS, MIM, Asaduddin Owaisi, CM KCR, Telangana assembly, protem speaker, assembly speaker Telangana Election 2018, Telangana, politics

KCR announces MIM Member of legislative assembly mumtaz ahmed khan as protem speaker of telangana assembly as the assembly sessions are yet to take place.

తెలంగాణ అసెంబ్లీ ప్రోటెం స్పీకర్ గా ముంతాజ్ అహ్మద్ ఖాన్

Posted: 01/05/2019 04:59 PM IST
Mim mla muntaz ahmed khan elected as protem speaker for telangana assembly

తెలంగాణ ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం కొలువుదీరినా.. పూర్తిస్థాయిలో మంత్రివర్గం విస్తరించబడలేదు. దీంతో ఎవరెవరికి మంత్రి బెర్తులు దక్కుతాయా? అనే అంశంలో తీవ్ర సందిగ్ధత ఏర్పడింది. అయితే, మంత్రివర్గ కూర్పునకు మరింత సమయం పట్టే అవకాశం ఉండడంతో.. ఆలోపే కొత్త సభ్యులు అసెంబ్లీలో కొలువుదీర్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రొటెం స్పీకర్ పేరును కూడా ఖరారు చేసింది. ఎంఐఎం పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను ప్రొటెం స్పీకరుగా ప్రకటించింది.

రెండు దశాబ్దాలకుపైగా ఎంఐఎం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న అహ్మద్ ఖాన్.. 1994 నుంచి గత ఎన్నికల వరకు యాకుత్‌పురా నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. తాజా ఎన్నికల్లో మాత్రం ఆయన చార్మినార్‌ నుంచి గెలుపొందారు. అయితే, సాధారణంగా ప్రొటెం స్పీకర్ ఎంపికకు ఒక స్పష్టమైన విధానం ఉంటుంది. అసెంబ్లీలో సభానాయకుణ్ని మినహాయించి.. మిగితా సభ్యుల్లో ఎవరు ఎక్కువసార్లు, వరుసగా అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించి ఉంటారో.. వారికే ప్రొటెం స్పీకర్‌గా అవకాశం లభిస్తుంది.

ప్రస్తుత అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ను మినహాయిస్తే వరుసగా ఆరుసార్లు గెలిచిన ఎమ్మెల్యేగా, సీనియర్‌గా అహ్మద్ ఖాన్ ఉన్నారు. అందుకే ఆయనకు ఈ అవకాశం లభించినట్టు తెలుస్తోంది. కాగా, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేసినందుకు.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రొటెం స్పీకర్‌గా అవకాశం ఇచ్చినందుకు అహ్మద్ ఖాన్ కూడా సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.

ఇక, ప్రొటెం స్పీకర్ ఎన్నిక ముగిసిన నేపథ్యంలో.. తెలంగాణ అసెంబ్లీకి కాబోయే కొత్త స్పీకర్ ఎవరనే విషయంలో ఆసక్తి నెలకొంది. మొదట, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. ఆ తంతు ముగిసిన వెంటనే స్పీకర్ ఎన్నిక షెడ్యూల్ విడుదలవుతుంది. కాబట్టి, ఇప్పటికే స్పీకర్ ఎంపికను కూడా కేసీఆర్ పూర్తి చేసి ఉంటారనే ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వంలో స్పీకర్‌గా పనిచేసిన మధుసూదనాచారి తాజా ఎన్నికల్లో ఓడిపోయారు. మరి ఈసారి కేసీఆర్ ఎవరిని స్పీకర్‌గా ఎంపిక చేశారనేది సస్పెన్స్‌గా మారింది. అయితే, జనవరి 16 నుంచి అసెంబ్లీ మొదలవుతున్నందున.. త్వరలోనే స్పీకర్ ఎవరనే విషయం కూడా తెలిసే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles