pawan kalyan says JSP is at par with caste, region and religion గేర్ మార్చిన పవన్.. బీజేపిని ఏకిపారేసిన జనసేనాని..

Pawan kalyan says jsp is at par with caste region and religion

pawan kalyan, janasena, JanaSena Porata Yatra, Ambedkar Centre, Narsapuram, west godavari, Pawan Kalyan bus Yatra, gangavaram, pawan kalyan porata yatra, pawan kalyan press meet, pawan kalyan srikakulam yatra, pawan kalyan ichhapuram yatra, Pawan Kalyan uttatandhra yatra, Pawan Kalyan gangapooja, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan who is in west godavari conducted a public meetina at Ambedkar Centre, Narsapuram as a part of JanaSena Porata Yatra had critised BJP.

ITEMVIDEOS: గేర్ మార్చిన పవన్.. బీజేపిని ఏకిపారేసిన జనసేనాని..

Posted: 08/10/2018 08:19 PM IST
Pawan kalyan says jsp is at par with caste region and religion

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ప్రచార గేర్ మార్చారు. ఇన్నాళ్లు కేవలం టీడీపీని మాత్రమే విమర్శించిన ఆయన ఇవాళ బీజేపిని కూడా తొలిసారిగా తన పోరాటయాత్రలో భాగంగా విమర్శించారు. బీజేపితో జనసేన అంటకాగుతుందన్న వార్తలకు చెక్ పెడుతూ.. తాను ఎవరికి అమ్ముడుపోయే వ్యక్తిని కాదని, ప్రజల హితం కోసం, సంక్షేమం కోసం, సమస్యల పరిష్కారం కోసం మాత్రమే వచ్చానని పవన్ చెప్పారు. తాను ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరిగా తనను మరోసారి ముఖ్యమంత్రిని చేయమనో.. లేక తన కుమారుడ్ని ముఖ్యమంత్రిని చేయాలనో అడగటానికి రాలేదన్నారు. అదే విధంగా అధికారంలోకి వస్తేనే సమస్యలను పరిష్కరిస్తానని అంటున్న వైసీపీ నేతను కాదని అన్నారు.

ఎవరు కష్టాల్లో వున్నా.. ఎవరికి కన్నీళ్లు వచ్చినా.. తన వద్దకు రావచ్చని.. తాను వారికి అండగా నిలబడతానని అన్నారు. తనకు అధికారమే పరమావది కాదని.. ప్రజల పక్షాన నిలచి.. ప్రజల గొంతునై ప్రభుత్వాలను ప్రశ్నించేందుకు పుట్టిన పార్టీయే జనసేన అని అన్నారు. అయితే ప్రశ్నించడమన్నది తొలి అంకం మాత్రమే కానీ తుది అంకం కాదని, ప్రజలకు ఆ కష్టాలను, నష్టాలను, కన్నీళ్లను లేకుండా చేయడమే తమ పార్టీ ప్రధమ కర్తవ్యమని అందుకు తగిన అవకాశం మాత్రం ప్రజలే ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. కోస్తాంధ్ర పోరాట యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురంలో బహిరంగ సభలో మాట్లాడిన ఆయన అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలోని అధికార పార్టీలను తూర్పారబట్టారు. విపక్ష వైసీపిని కూడా పవన్ టార్గెట్ చశారు.

మోదీతోనో లేక కేంద్రంలోని బీజేపితోనే తాను ఒప్పందం కుదుర్చుకున్నానని ప్రచారం చేస్తున్నారని.. తనకు మోడీ ఏమీ చుట్టం కాదని పవన్ అన్నారు. నలబైఏళ్ల అనుభవం వుందని తనకు తాను చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం.. పశ్చిమ గోదావరి జిల్లాలో దేనీకి అవసరం రాకుండా పోయిందని పవన్ ఎద్దేవా చేశారు. పగోలో కట్టాల్సిన వశిష్ట వారధిని కూడా కట్టేలకపోయారని, కనీసం పగో జిల్లాలో మరిముఖ్యంగా నర్షాపురం పట్టణంలోని రోడ్ల దుస్థితి చంద్రబాబు పాలనకు దర్పణం పడుతుందని దుయ్యబట్టారు.

స్వచ్చా భారత్ అనే కార్యక్రమానికి వేల కోట్లు వెచ్చిస్తున్న కేంద్రం ప్రభుత్వం.. 2014లో ఇచ్చిన పిలుపుతో.. పశ్చిమ గోదావరి జిల్లా వాసులు ఏకంగా 32 టన్నుల చెత్తను సేకరించి ఇస్తే.. వారు దానిని  మనం తల్లిలా కొలిచి పవిత్రంగా చూసే వశిష్ట గోదావరి నదిలో పారేసారని, అయినా అప్పుడు ఈ విషయం తెలిసినా మైత్రిబంధం కొనసాగుతన్న కారణంగా టీడీపీ వారిని ఒక్క మాట కూడా అనలేకపోయిందని విమర్శించారు. 13 జిల్లాలో ఏ జిల్లాలో లేనట్లుగా పగో నుంచి ఏకంగా 15 అసెంబ్లీ స్థానాలకు 15 గెలిపించి ఇస్తే.. మాకు 32 టన్నుల చెత్తను ప్రతిగా ఇస్తారా.? అంటూ మండిపడ్డారు. మరోమారు టీడీపిని అధికారంలో తీసుకువస్తే పగో జిల్లావాసులకు జరిగేది మాత్రం ద్రోహమేనని విమర్శించారు.

ఎన్టీరామారావు శంఖుస్తాపన చేసిన వశిష్ట వారధిని ఎందుకు నిర్మించలేకపోయారు.? పగోలో 15 స్థానాలు మీకు వచ్చివుండకపోతే మీరు ముఖ్యమంత్రి అయ్యేవారా.? మీ అబ్బాయి ఐటీ మంత్రి అయ్యేవాడా అని ప్రశ్నించారు. మీకు కానీ మీ పార్టీకి కానీ మళ్లీ ఇంకోసారి ఎందుకు ఓటు వేయాలని ఆయన నిలదీశారు. చంద్రబాబు నుంచి అశించింది అనుభవం కలిగిన పాలన కావాలని మాత్రమే.. అందుకే గత ఎన్నికలలో ఆయనకు మద్దతు పలికానన్నారు. కానీ అధికారం అందుకోగానే మహిళా అధికారులపై టీడీపీ ఎమ్మెల్యేలు దాడులు చేస్తే.. వారిని ఏమీ చేయకుండా రాజీకుదర్చడానికి అనుభవాన్ని వాడుతున్నారని ఎద్దేవా చేశారు.

తాను మాత్రం కులాలను విభజించి రాజకీయం చేయాలన్న ఉద్దేశ్యం లేదని, కులాల మధ్య చిచ్చు పెట్టే వ్యక్తిని కాదని అన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ సమ న్యాయం చేయాలని ప్రతీ ఒక్కర్ని నమ్ముకుని  రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం కులాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయం చేస్తూ అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారని అర్థమవుతుందన్ని విమర్శించారు. తాను కులాన్ని నమ్ముకున్నవాడినైతే.. బుద్ది వున్నావాడెవ్వడూ టీడీపీకి మద్దతు ఇవ్వరని అన్నారు. కుల రాజకీయాలను తెరపైకి తీసుకువస్తున్న పార్టీలు కనీసం కులాలను ఉద్దరిస్తున్నాయా అంటే.. అదీ లేదని, కేవలం రాష్ట్రంలో రెండు కుటుంబాలు మాత్రమే బాగుపడుతున్నాయని ఆయన మండిపడ్డారు.

గోదావరి జిల్లాలకు ద్రిష్టి తగిలిందని.. ఎవరైనా ఈ ప్రాంతవాసులం అని చెప్పగానే మీకే 365 రోజులు 24 గంటలు గోదావరి గలగలు పారుతూ వుంటాయ్ అంటున్నారే కానీ.. ఇవాళ గోదావరి జిల్లావాసులు తల్లి గంగమను పక్కన బెట్టుకుని కూడా నీళ్లు కొనుక్కోవాల్సి వస్తున్న దుస్థితి వచ్చిందని అన్నారు. అక్వా పరిశ్రమల వల్ల జిల్లాకు 15 వేల కోట్ల రూపాయలను ఎలా సంపాదిస్తున్నామో అదే స్థాయిలో అంతకంటే అధికంగా నష్టాలు కూడా వున్నాయని పవన్ అన్నారు. పగో జిల్లాల్లోని లంక గ్రామాల్లో కనీసం రక్షణ గోడలు కూడా కట్టించలేకపోతున్నారని ఇది బాధకరమని ఆయన అవేదన వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles