ఆధార్.. ఇది భారత పౌరులకు సంబంధించిన వ్యక్తిగత గోప్యత. ఈ ప్రాథమిక హక్కును తమ తమ మొబైల్ ఫోన్ సిమ్ కార్డులతో సంబంధిత టెలికాం సర్విసెస్ సంస్థతో అనుసంధానం చేయాల్సిందే. లేనిపక్షంలో మీ మొబైల్ ఫోన్ సేవలు నిలిపివేయబడతాయి. వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన తీర్పును వెలువరించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టే.. ప్రతి మొబైల్ ఫోన్ నంబర్ ను ఆధార్ నెంబర్ తో జతపర్చాలని అదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ప్రతి సిమ్ కార్డును ‘ఆధార్’ తో అనుసంధానం చేయాలని, 2018 ఫిబ్రవరి నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కూడా గత ఏడాది కేంద్ర ప్రభుత్వం.. టెలికాం సంస్థలకు అదేశాలను జారీ చేసింది. నిర్ణీత గడువులోగా సిమ్ కార్డులను అధార్ తో అనుసంధానించని పక్షంలో సదరు సిమ్ కార్డులకు టెలికాం సంస్థలు సేవలను నిలిపేస్తాయని కూడా అదేశించింది. తప్పుడు చిరునామాలతో నకిలీ సిమ్ కార్డులు తీసుకుని ఉపయోగిస్తున్న నేరస్థులు, మోసగాళ్లు, ఉగ్రవాదులకు చెక్ పెట్టేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
గతేడాది నుంచి జరగుతున్న ఈ ప్రక్రియలో దేశవ్యప్తంగా 128 కోట్ల సిమ్ కార్డు విక్రయాలు వుండగా, వాటిలో కేవలం 33.8 కోట్ల మొబైల్ సిమ్ కార్డులు మాత్రమే ఇప్పటి వరకు అధార్ తో అనుసంధానం చేసుకున్నాయని ఉడాయ్ సంస్థ తెలిపింది. ఫిబ్రవరిలోగా అనుసంధానం చేయాలని కేంద్రం మరోమారు దేశప్రజలకు స్పష్టం చేిసంది. అనుసంధానంలో కూడా అవకతవకలను అరికట్టేందుకు కేవలం అఫ్ లైన్ మార్గంలో మాత్రమే ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. వినియోగదారుడి ఫింగర్ ప్రింట్ ను బయోమెట్రిక్ విధానంలో తీసుకోవడం ద్వారా ‘ఆధార్’ తో సరిపోల్చడంతో ఈ అనుసంధాన ప్రక్రియ పూర్తవుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more