కట్నం కోసం 25వ భార్యను వేధించిన భర్తకు.. Bangladesh man jailed after ‘25th wife’ files complaint

Bangladesh man with 28 marriages jailed after 25th wife files complaint

Bangladesh, Multiple marriages, 28 marriages, Dowry, Bangladesh police, Marriage, dowry harrassment, crime

A 45-year-old man in Bangladesh accused of secretly marrying 28 times has been arrested and sent to jail over dowry harassment complaint filed by his 25th wife, a media report said.

కట్నం కోసం 25వ భార్యను వేధించిన భర్తకు..

Posted: 01/28/2017 06:24 PM IST
Bangladesh man with 28 marriages jailed after 25th wife files complaint

ఒకరు కాదు ఇద్దరు కాదు...ఏకంగా 28 మంది యువతులను పెళ్లాడిన నిత్య పెళ్లికొడుకు బాగోతం బంగ్లాదేశ్ లో వెలుగుచూసింది. తన భర్త వరకట్నం కోసం వేధిస్తున్నాడని 25వ భార్య తానియా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నిత్య పెళ్లికొడుకు నిర్వాకం బయటపడింది. బంగ్లాదేశ్ లోని బర్గుణ జిల్లా తాల్కలి పట్టణానికి చెందిన యాసిన్ బైపారి అనే 45 ఏళ్ల వ్యక్తి తనను కట్నం కోసం వేధిస్తున్నాడని 25వ భార్య అయిన తానియా పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

దీంతో పోలీసులు 27వ భార్య ఇంట్లో ఉన్న యాసీన్ ను అరెస్టు చేసి జైలుకు రిమాండుకు తరలించారు. తనకు గతంలో రెండే పెళ్లిళ్లు జరిగాయని అబద్ధం చెప్పి 2011లో తనను పెళ్లాడాడని, తనకు కూతురు పుట్టాక కట్నం కోసం వేధించాడని పోలీసులకు తానియా సమర్పించిన ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త పెళ్లాడిన 17 మంది యువతుల జాబితాను సేకరించిన తానియా ఆ వివరాలు పోలీసులకు అందజేసింది.

యాసీన్ రెండో భార్యకు ఇద్దరు కూతుళ్లు, మూడవ భార్యకు ఓ కుమారుడు, ఏడవ భార్యకు ఓ కొడుకు, 24వ భార్యకు ఓ కూతురు పుట్టారని తానియా పోలీసులకు సమాచారం అందించింది. యాసీన్ పెళ్లి చేసుకొని కొన్నాళ్లు కాపురం చేశాక కట్నం కోసం వేధిస్తుంటాడని తానియా చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు ఫిర్యాదు చేసింది. యాసీన్ మటిభంగా, చిట్టగాంగ్ ప్రాంతాల యువతులను పెళ్లాడాడని తానియా పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు ఈ నిత్య పెళ్లికొడుకు నిర్వాకంపై దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bangladesh  Multiple marriages  28 marriages  Dowry  Bangladesh police  Marriage  dowry harrassment  crime  

Other Articles