ఓఎల్ ఎక్స్ యాడ్ ఎంత పనిచేసింది | noida man find his stolen car in olx

Noida man find his stolen car in olx

noida man, find his stolen car in olx, olx ad, ఓఎల్ ఎక్స్, నోయిడా, మిస్సయిన కారు, national news, latest news, entertainment

Almost 10 months after a Honda City car was stolen from Kulwant Singh, a resident of Noida, he found his sedan up for sale on the e-commerce website OLX.in. Singh had gone for a walk on August 4, 2015, only to find that his car was missing when he returned. Following this he lodged a complaint with the police. However, the police failed to make any progress in retrieving the car. Many months later, when Singh was browsing through the OLX website, he found an advertisement for the car on the website.

ఓఎల్ ఎక్స్ యాడ్ ఎంత పనిచేసింది

Posted: 05/30/2016 12:48 PM IST
Noida man find his stolen car in olx

అమ్మెయండి బాస్... అంటూ నటుడు అల్లు అర్జున్ టీవీలో ఇస్తున్న ఓఎల్ ఎక్స్ యాడ్ చూస్తున్నారు కదా. సెకండ్ హ్యాండ్ వస్తువులను అక్కడ మనకు నచ్చిన రేటుకు అమ్మకానికి పెట్టేస్తే నచ్చిన వారు దానిని ఆ రేటు చెల్లించి కొనుగొలు చేయటం దాని ఉద్దేశం. ఇంతకాలం అమ్మకాలకు, కొనుగోలుకు సంబంధించిందే ఈ ఈ-కామర్స్ సంస్థ ఇప్పుడు పొగొట్టుకున్న వస్తువులను కూడా కనిపెట్టే పని కూడా చేస్తుందా? ఈ వార్త చదివితే మీరే అవునంటారు.

నోయిడా కు చెందిన కుల్వంత్ సింగ్ అనే వ్యక్తి డీఎల్ 4సీఆర్ 0757  హోండా సిటి కారు పది నెలల క్రితం చోరికి గురైంది. వెంటనే అతను పోలీసులకు ఫిర్యాదు చేయటం, వారు విచారణ పేరిట హడావుడి చేయటం అన్ని జరిగిపోయాయి. కానీ, కారును మాత్రం కనిపెట్టలేకపోయారు. ఇక విసిగి వేసారిన కుల్వంత్ సెకండ్ హ్యాండ్ కారు కొనేందుకు సిద్ధపడ్డాడు. అందుకోసం ఓఎల్ ఎక్స్ ను సంప్రదించగా, షాక్ కి గురయ్యాడు. ఎందుకంటే తాను పొగొట్టుకున్న కారును ఎవరో ఆ సైట్లో అమ్మకానికి పెట్టారు. అప్రమత్తమైన కుల్వంత్  కారు తాను కొంటానంటు సదరు యాడ్ ఇచ్చిన వ్యక్తి ఫోన్ చేశాడు. ఫ్లాన్ ప్రకారం అతన్ని రమ్మని పోలీసులను వెంటపెట్టకుని వెళ్లాడు. అయితే తనకేం తెలీదని జుల్ఫికర్ అనే వ్యక్తి తనకు ఈ కారు అమ్మాడని ఆ వ్యక్తి చెప్పాడు. ప్రధాన నిందితుడు జుల్ఫికర్ ప్రముఖ కార్ల దొంగ అని నిర్థారించుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అలా ఓఎల్ ఎక్స్ తో కుల్వంత్ కు మరో కారు కొనాల్సిన అవసరం లేకుండా పోయింది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : noida man  OLX ad  stolen car in olx  

Other Articles