The Cost Of Amaravathi Invitation Card Which Is Given To PM Narendra Modi | Amaravathi Inauguration | Chandrababu Naidu

Cost of narendra modis amaravathi invitation card chandrababu naidu

narendra modi news, narendra modi updates, narendra modi controversies, amaravathi inauguration, chandrababu naidu, amaravathi invitation card, amaravathi inauguration function, amaravathi master plan

Cost Of Narendra Modis Amaravathi Invitation Card chandrababu naidu : The Cost Of Amaravathi Invitation Card Which Is Given To PM Narendra Modi To Attend Inauguration Programme.

మోదీకిచ్చిన ఆహ్వానపత్రిక ఖరీదు ఎంతో తెలుసా?

Posted: 10/16/2015 10:41 AM IST
Cost of narendra modis amaravathi invitation card chandrababu naidu

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రాజధాని ‘అమరావతి’ శంఖుస్థాపన కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఓ చారత్రాత్మక ఘట్టంగా నిలిచిపోయేలా బ్రహ్మాండంగా నిర్వహిస్తోంది. జపాన్, సింగపూర్ లతోపాటు దేశ ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, ఇతర నాయకులే కాకుండా దాదాపు 2 లక్షలకుపైగా ప్రజలు హాజరుకానున్న ఈ శంఖుస్థాపనలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల నృత్యాలను ఏర్పాటు చేస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేయిస్తోంది. దీంతో.. విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేయడం మొదలుపెట్టేశారు. కేవలం శంఖుస్థాపన కోసం ప్రభుత్వం వందలకోట్ల ప్రజాధనాన్ని ఖర్చూ చేస్తే దుబారా మంత్రాన్ని పఠిస్తోందని ఆరోపణలు చేయడం మొదలుపెట్టేశాయి. ఈ నేపథ్యంలోనే స్పందించిన ఏపీ మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులు.. రాజధాని శంఖుస్థాపన కోసం కేవలం 10 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే వారు మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

మొన్నటి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి... ‘అమరావతి’ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆ ఆహ్వాన పత్రిక ఖరీదు కనీసం లక్షల్లో వుంటుందని ఊహాగానాలు బయటికొచ్చాయి. అటు విపక్షాలు కూడా ఆ విధంగా ఆరోపణలు చేస్తుండడంతో.. మోదీకిచ్చిన ఆహ్వాన పత్రిక ఖరీదు ఎక్కువగానే వుంటుందని భావించారు. కానీ.. అందులో ఏమాత్రం వాస్తవం లేదని ఏపీ మంత్రులు తేల్చేశారు. మోదీకి ఇచ్చిన ఆహ్వాన పత్రిక కోసం కేవలం రూ.70 మాత్రమే ఖర్చు చేసినట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. అలాగే.. శంకుస్థాపన కోసం కేటాయించిన నిధుల్లో గుంటూరు కలెక్టర్ కు రూ.7 కోట్లు, విజయవాడ కలెక్టర్ కు రూ.2 కోట్లు మాత్రమే విడుదల చేశామని కూడా వారు తెలిపారు. కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపార దిగ్గజాలు కూడా వస్తున్నందున వారి కోసం ప్రత్యేకంగా హెలిప్యాడ్ లు ఏర్పాటు మినహా ఎక్కడా దుబారా లేదని వారు పేర్కొన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amaravathi inauguration  narendra modi invitation card  chandrababu naidu  

Other Articles