Kejriwal did not get modi appointment

Kejriwal did not get Modi appointment, Arvind Kejriwal Gujarat tour, Narendra Modi, BJP Prime Ministerial candidate, AAP Convener Arvind Kejriwal

Kejriwal did not get Modi appointment, Arvind Kejriwal Gujarat tour

కేజ్రీవాల్ కి అపాయింట్ మెంట్ ఇవ్వలేని మోదీ

Posted: 03/07/2014 04:54 PM IST
Kejriwal did not get modi appointment

గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ని కలవటానికి సమయాన్ని కేటాయించలేకపోయారు.  దానితో కేజ్రీవాల్ వెనుదిరిగి తన పర్యటనను కొనసాగిస్తూ జైపూర్ వైపుగా వెళ్తున్నారు. 

నాలుగు రోజులుగా గుజరాత్ లో పర్యటిస్తూ, నరేంద్ర మోదీ దేశ పర్యటన చేస్తూ చెప్తున్నవన్నీ అతిశయోక్తులని, అంతటి ప్రగతి గుజరాత్ లో కనిపించలేదని చెప్పిన కేజ్రీవాల్ కి అడుగడుగునా భాజపా కార్యకర్తలు, గుజరాత్ పోలీసుల అడ్డు తగుల్తూనేవున్నారు.  కానీ మీడియా వెంటనే ఉంది కాబట్టి వచ్చే అడ్డంకులన్నీ తనకు ప్రయోజనకరంగానే ఉంటాయని తెలుసు కాబట్టి కేజ్రీవాల్ ఈరోజు ముఖ్యమంత్రి కార్యాలయంలో నరేంద్ర మోదీని కలవటానికి మందీ మార్బలంతో వెళ్తుండగా గుజరాత్ పోలీసులు అడ్డుకుని అందుకు అప్పాయింట్ మెంటు ఉందా అని అడిగారు.  లేదని చెప్పేటప్పటికి ఆయనను ముందుకు వెళ్ళనివ్వలేదు.  అప్పుడు కేజ్రీవాల్ తో పాటు ఉన్న ఆఆపా నాయకుడు శిసోడియా మోదీ దగ్గర సమయం తీసుకోవటానికి వెళ్ళారు.

ఈ లోపులో కేజ్రీవాల్ తను ముఖ్యమంత్రిని కలిసి ఏమేం అడగదలచుకున్నదీ మీడియాకు వివరించారు.  16 ప్రశ్నలను తయారు చేసానని వాటిని అడగటానికే మోదీతో సమయాన్ని కోరుతున్నానని ఆయన మీడియాలో ప్రకటించారు.  దానితో ఆయన అనుకున్నది సాధించినట్లే నిజానికి. 

ఇవన్నీ చూస్తున్న మోదీ తన బిజీ షెడ్యూల్ లో సమయాన్ని కేటాయించలేనని అన్నారు.  పోనీ రెండు మూడు రోజుల తర్వాతైనా సమయాన్నివ్వమని అడిగానని, అదీ కుదరలేదని శిసోడియా తిరిగి వచ్చారు చెప్పారు.  చేసేది లేక కేజ్రీవాల్ అక్కడి నుండి బయలుదేరి తన పర్యటనను కొనసాగిస్తున్నారు.

కేజ్రీవాల్ పద్ధతి చికాకు పెడుతున్న మాట వాస్తవమే, భాజపా వ్యూహాలకు అడ్డు తగులుతున్న మాటా వాస్తవమే కానీ ఎంత పని ఉన్నా గుమ్మంలోకి వచ్చిన ఒక మాజీ ముఖ్యమంత్రిని కలవలేకపోవటమనేది సరైనది కాదు.  మాట్లాడే సమయం లేకపోయినా చూసి పలకరించవచ్చు, సమయం లేదని తనే స్వయంగా చెప్పవచ్చు కానీ కేజ్రీవాల్ ని కలవటానికే తిరస్కరించటంతో కేజ్రీవాల్ చర్యలు మోదీని ఎంత కలవరపెడుతున్నాయో మనస్తాపం కలిగిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. 

సమయం అనేది ఎవరికైనా సమానమే.  సమయం లేదు అంటే అర్థం, నీతో మాట్లాడేదానికన్నా నాకు ఇంకా ఎక్కువ ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయని చెప్పటం.  ఎంత బిజీగా ఉండే మనిషైనా తన సొంత పనులలో అవసరం పడ్డా, లేక తనకి అవసరమైన వాళ్ళని కలవాలన్నా, ఏదైనా అత్యవసర పరిస్థతి ఏర్పడ్డా, తప్పకుండా తమ కార్యకలాపాలలో మార్పులు చేసుకుంటారు.  అలా చేసుకోలేదూ అంటే ఆ సందర్భానికి ప్రాధాన్యతనివ్వటం లేదన్న మాట.  అయితే తను అనుకున్నది సాధించిన విజయోత్సాహం కేజ్రీవాల్ లోనూ కలిగుంటుంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles