Panic incidents in andhrapradesh today

panic incidents in andhrapradesh today

panic incidents in andhrapradesh today

7.gif

Posted: 08/15/2012 04:44 PM IST
Panic incidents in andhrapradesh today

       panic_1జెండాపండుగనాడూ.. రాష్ట్రంలో పలు అవాంఛనీయ సంఘటనలు సంభవించాయి. రాజధాని నగరంలోని శంషాబాద్‌లో దారుణం జరిగింది. గగన్‌పహాడ్‌లో ఓ తండ్రి తన ఇద్దరి కూతుళ్లపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఏడాది చిన్నారి మీనాక్షి అక్కడికక్కడే మృతి చెందగా, మరో చిన్నారి తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.
        హైదరాబాద్ జీడిమెట్లలోని భారత్‌ హాల్‌వెంచర్స్‌ గోదాంలో ఈ ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఎగిసి పడడంతో అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదపులోకి panic_2తెచ్చేందుకు చాలా శ్రమించారు. దీంతో నర్సాపూర్‌ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. బాలానగర్‌ నుంచి గండిమైసమ్మ వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
       శ్రీకాకుళం జిల్లాలోని లావేరు మండలం అల్లినగరం జంక్షన్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. లారీ - బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
         విశాఖపట్నం జిల్లాలోని నాతవరం మండలం ఎర్రవరం దగ్గర ఈ ఉదయం ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 18 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Scholor ships apply date closeed
More pesion for freedom fighters  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles