Police searches in nagam janardhan house

Police Searches In Nagam House, Nagam Janardhan HousePolice House Arrested, Fight Betweeen Police, Nagam, Nagam Janardhan Followers,

Tension prevailed at independent candidate of Nagar Kurnool, Nagam Janardhan Reddy's residence, as police entered into his house

nagam janardhan reddy.gif

Posted: 03/17/2012 11:45 AM IST
Police searches in nagam janardhan house

Nagam-Janardan-reddyజిల్లా నాగర్ కర్నూలు స్వతంత్ర అభ్యర్థి , మాజీ తెలుగు దేశం నాయకుడు తెలంగాణపై చంద్రబాబు వైఖరిని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయడంతో నాగర్ కర్నూలు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ ఉప ఎన్నికలో నాగం జనార్దన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసేందే. ఈ ఉప ఎన్నికల ప్రచారం కూడా నిన్నటితో ముగిసింది. అభ్యర్థులు ఎవరి గెలుపు పై వారు ధీమా గా ఉన్నారు.

రేపు ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ రోజు నాగం జనార్థన్ రెడ్డి ఇంట్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మఫ్టీలో ఉన్న ముగ్గురు పోలీసులు నాగం ఇంట్లోకి అకస్మాత్తుగా వచ్చి మేం రైడింగ్ కోసం వచ్చామని చెప్పారు. వారి చర్యలతో ఆగ్రహించిన నాగం జనార్థన్ రెడ్డి పోలీసుల పై తన ఉగ్రరూపం చూపించారు. ఏకంగా ఓ పోలీసు కానిస్టేబుల్ ని నిర్భందించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నాగం ఇంటిని మోహరించారు. మరో ఇద్దరు కానిస్టేబుల్స్ పారిపోయారు.
పోలీసులు చేసిన ఈ చర్యకు నాగం వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు నాగం వర్గీయులకు తోపులాట జరిగింది. నిర్బందించిన కానిస్టేబుల్ కోసం జనార్థన్ రెడ్డి దగ్గరికి ఏఎస్పీ వచ్చారు. నాగం మద్దతు దారులు రాస్తారోకోకు దిగడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

రేపే ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో నాగం ఇంటిలో భారీగా డబ్బులు ఉన్నాయనే అనుమానంతో ఈ రైడ్ జరిగినట్లు అక్కడి వారి అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Karunanidhi threatens to immolate self if anna library is converted to hospital
Ttd senior employee murdered1  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles