రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖలో సమైక్యవాదుల నిరసనలు కొనసాగుతున్నాయి. మద్దిలపాలెం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ ఎన్ఎంయూ నాయకులు అర్థనగ్నంగా మోకాళ్లపై నిలబడుతూ నిరసన తెలిపారు. ఏయూలో సోషల్ వర్క్ విద్యార్థులు ప్రదర్శన చేపట్టారు. వాల్తేరు రోడ్డులో ఆర్అండ్ బీ ఉద్యోగులు ద్విచక్రవాహణ ర్యాలీ నిర్వహించారు. మద్దిలపాలెం కూడలీ లో ఆర్టీసీ ఉద్యోగులు మానవహారం చేపట్టారు. విభజన నిర్ణయన్ని వెనక్కి తీసుకునేంతవరకు పోరు ఆపేది లేదని ఉద్యమకారులు స్పష్టం చేశారు.
నడిరోడ్డుపై విద్యాబ్యాసం
రాష్ట్రం విడిపోతే విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, దీనికి నిరసనగా విద్యార్థులంతా రోడ్డుపై భైఠాయించి విద్యాబ్యాసం చేస్తూ తమ నిరసన తెలియజేయాలని సమైక్యాంద్ర విద్యార్థి ఐకాస అధ్యక్షుడు ఎ. సుమంత్ పిలుపునిచ్చారు. ఈ మేరకు అక్టోబర్ 4న జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద విద్యాబ్యాసం చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కేవలం నగరంలోని విద్యార్థులే కాకుండా మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులు కూడా ఇదే తరహాలో నిరసన తెలియజేయాలన్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 25 | అండమాన్లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more
Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more