Ap ngo leader ashok babu mounts scathing attack on kcr

ashok babu fire on kcr , AP NGO leader Ashok Babu mounts scathing attack on KCR, AP NGOs President Ashok Babu, TRS chief K Chandrasekhar Rao, Telangana agitation

AP NGO leader Ashok Babu mounts scathing attack on KCR, ashok babu fire on kcr

పోరాటం చేసింది కేసిఆరే :అశోక్‌బాబు

Posted: 08/21/2013 07:30 PM IST
Ap ngo leader ashok babu mounts scathing attack on kcr

సమైక్యం కోసమే మా ఉద్యమమని, ఉద్యమం ద్వారానే సమైక్యాంధ్రను సాధించుకుంటామని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు పేర్కొన్నారు. ఈరోజు విశాఖలో సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక బహిరంగ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఉద్యమం ద్వారానే అప్పుడు ప్రజలు స్వాతంత్య్రం సాధించారని, ఇప్పుడు సమైక్యం కోసం ఉద్యమం చేస్తున్నామని, సమైక్యాంధ్ర సాధిస్తామని, అప్పుడు స్వాతంత్య్ర ఉద్యమమం, ఇప్పుడు సమైక్య ఉద్యమమని ఆయన అన్నారు.

రాష్ట్ర విభజన పోరాటం చేసింది తెలంగాణ ప్రజలు కాదని, విజయనగరం జిల్లాలో పుట్టిన కేసీఆర్ తన స్వార్థం కోసం విభజన పోరాటం చేశారని అశోక్‌బాబు విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం సీమాంధ్రలు రక్తం ధారపోశారని అశోక్‌బాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని విభజన చేస్తే సీమాంధ్రలో కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామని అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా హైదరాబాద్‌లో 10 లక్షల మందితో మహాసభ నిర్వహించనున్నట్టు తెలిపారు. తెలంగాణవాదులు రవాణాను అడ్డుకుంటే కాలినడకనైనా వస్తారని చెప్పారు. హైదరాబాద్‌లో రక్షణ కల్పించాల్సింది సీమాంధ్రులకు కాదని, స్వార్థపూరిత ఆలోచనలున్న తెలంగాణా రాజకీయ నిరుద్యోగులకు మాత్రమేనని చెప్పారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more