ఉద్రిక్తంగా మారిన ఉద్యమం
సిరిపురం రాష్ట్రం విభజనకు వ్యతిరేకంగా ఆంద్రవిశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఉద్యమం ఉద్రిక్తంగా మారింది. యూనివర్సీటికీ చెందిన అన్ని కళాశాలల విద్యార్థులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని సీమాంద్ర ప్రజాప్రతినిధులు, కేంద్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సాయంత్రం లోపు సీమాంద్ర ప్రజాప్రతినిధులు వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు రాజీనామా చేయని పక్షంలో వారి ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఏయూ అద్యాపక, అధ్యాపకేతర ఉద్యోగ సంఘాల నుంచి వారికి మద్దతు లభించింది.
కోటలో ఉద్రిక్తత
విశాఖ జిల్లాలో కసింకోటలో పోలింగ్ సిబ్బంది వైకాపాకు సహకరిస్తున్నారంటూ గ్రామాస్తులు ఆందోళనకు దిగారు. ఆందోళన సమయంలో యువకుడిపై ఎస్.ఐ చేయి చేసుకోవడంతో పోలీసులు, గ్రామస్థులు మధ్య వాగ్వాదం నెలకొంది. గ్రామంలో ఉద్రికత్త నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు.
అగ్ని ప్రమాదం
పరవాడ జవవార్ లాల్ నెహ్రూ ఫార్మాసిటిలో గల గ్లాండ్ ఔషద పరిశ్రమల అగ్నిప్రమాదం సంభవించింది. ఔవషద ఉత్పత్రి ప్రక్రియలో బాగంగా డీజిల్ ట్యాంకు నుంచి బాయిలర్ కు పంపు చేస్తున్న సమయంలో సాంకేతిక లోపంతో డీజిల్ ట్యాంకు పేలింది. దీంతో కార్మికులు భయాందోళనతో పరిశ్రమ నుంచి బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న రాంకీ అగ్నిమాపక శకటం సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. సంస్థ యాజమాన్యం ఆస్తి నష్ట్రాన్ని అంచాన వేస్తోంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
రాస్తారోకో
పెందుర్తి లో తెలంగాణ విభజనకు వ్యతిరేకిస్తూ పెందుర్తి నాలుగు రోడ్ల కూడలిలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. ఈధర్నాలో శ్రీ గురు జూనియర్ కళాశాల శ్రీ విద్యా టెక్నో స్కూల్ విద్యార్థులు , ఉపాద్యాయులు పాల్గొన్నారు.
చైర్మన్ రాజీనామా
తెలంగాణ విభజనను వ్యతిరేకిస్తూ విశాఖ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జేడి. దివాకర్ రావు పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పంపారు.
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 25 | అండమాన్లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more
Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more