Director puri jagannath mother satyavathi is contesting in sarpanch elections in visakhapatnam district

director Puri Jagannath, Puri Jagannath mother Satyavathi, Sarpanch elections in Visakhapatnam district,

director Puri Jagannath mother Satyavathi is contesting in Sarpanch elections in Visakhapatnam district

దర్శకుడు పూరి ఇంట్లో సర్పంచ్ ఎన్నికల పోరు ?

Posted: 07/15/2013 12:58 PM IST
Director puri jagannath mother satyavathi is contesting in sarpanch elections in visakhapatnam district

అసలే సినిమా షూటింగులతో బిజీగా ఉండే ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కు మరో టెన్షన్ వచ్చిపడింది. ఆయన గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ కుటుంబానికి దర్శకుడి పూరీ జగన్నాధ్ కుటుంబానికి సన్నిహిత సంబందాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన కుటుంబం వైసీపీ మద్దతు ఇవ్వటం జరిగింది. అయితే జరుగుతున్న సర్పంచ్ ఎన్నకల పోరు ఇప్పుడు పూరి ఇంట్లో మొదలైంది. పూరి జగన్నాథ్ తల్లి పెట్ల సత్యవతి విశాఖపట్నం జిల్లా కోటవురట్ల మండలం బికె పల్లి సర్పంచ్ అభ్యర్థిగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్నారు. తన రెండవ కుమారుడు, నర్సీపట్నం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ గణేష్‌తో కలిసి వచ్చిన ఆమె శనివారం నామినేషన్ దాఖలు చేశారు. అమెకు వరుసకు కోడలు అయిన పెట్ల చిట్టి అనంతలక్ష్మి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా ఇక్కడ పోటీలో ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా, కాంగ్రెస్ అభ్యర్థి చిట్టి అనంతలక్ష్మికి మద్దతు ఇస్తోంది. అత్తాకోడళ్ల మధ్య జరిగే ముఖాముఖి పోటీ ఆసక్తికరంగా మారనుంది. ఈరసవత్తమైన పోరులో పూరి దర్శకుడి పాత్ర పోషిస్తాడో, లేక ప్రేక్షుడి పాత్ర పోషిస్తాడో చూడాలి. అత్తా కోడళ్ల మద్య జరిగే పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more