Visakhapatnam people in uttarkashi rains

visakhapatnam people, uttarkashi rains, Rains lashed Uttarakhand, kasibabu, andhra pradesh, breaking news, ap politics, political news, andhra news

visakhapatnam people in uttarkashi rains

ఉత్తర కాశీలో చిక్కుకున్న విశాఖ వాసులు

Posted: 06/18/2013 01:42 PM IST
Visakhapatnam people in uttarkashi rains

ఉత్తరాఖండ్ కు కాశీయాత్రకు మన రాష్ట్రం నుంచి 2వేల మంది భక్తులు బయులుదేరి వెళ్లినట్లు సమాచారం. అయితే ఉత్తరాఖండ్ వరదల కారణంగా రోడ్లలన్నీ జలమయం తో నిండిపోయాయి. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పాడటంతో అనేక మంది భక్తలు మార్గ మద్యలోనే చిక్కుకున్నారు. ఉత్తర కాశీలో చిక్కుకున్న తమ బంధువుల క్షేమ సమాచారాల కోసం విశాఖవాసులు ఎదురుచూస్తున్నారు. నగరంలోని ప్రముఖ పర్యాటక క్షేత్రమైన కైలాసగిరి ప్రధాన అర్చకుడు కాశీబాబు శర్మ దంపతులు, బంధువులు ఉత్తర కాశీకి 15 కిలోమీటర్ల వద్ద కొండ ప్రాంతంలో చిక్కుకున్నారు. తన తండ్రి నుంచి చివరిసారిగా సోమవారం సాయంత్రం 6 గంటలకు ఫోన్ కాల్ వచ్చిందని, ఆ తర్వాత వారి సమాచారం తెలియలేదని కాశీబాబు కుమారుడు కొత్త లంక అవినాస్ శర్మ తెలిపారు. తమ తల్లి దండ్రులతో పాటు, పిన్ని బాబాయ్ , అత్తయ్య, మామయ్య కూడా ఈ యాత్రకు వెళ్లారని చెప్పారు. ఈ నెల 4న విశాఖ నుంచి రైల్లో బయలుదేరి, అక్కడి నుంచి ట్రావెల్స్ బస్ లో ఛారదమ్ యాత్రకు వెళ్లారు. కేదార్ నాత్, బదరీనాథ్ , గంగోత్రీలలో యాత్రను పూర్తి చేసుకొని , యమునోత్రికి వెళ్తుండగా.. ఉత్తర కాశీకి 15 కిలో మీటర్ల దూరంలో భారీ వర్షాల కారణంగా కొండ ప్రాంతంలో చిక్కుకుపోయారు. తమవారికి తాగునీరు తిండి సదుపాయం గత మూడు రోజులుగా అందలేదని , ప్రభుత్వం ఇప్పటికైన తమ వారిని ఆదుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని బంధువులు కోరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more