Land flat layout in vizag

property in vishakhapatnam, residential land in visakhapatnam, venture, farm house lands and residential flats / plots, chodavaram land,

layout in vizag

చోడవరంలో ఊపందుకున్న రియల్ ఎస్టేట్?

Posted: 04/08/2013 09:57 PM IST
Land flat layout in vizag

ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ ఊపందుకోవడంతో ఎక్కడ కొద్ది జాగాఉంటే అక్కడ ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. చోడవరం పంచాయతీతోపాటు పరిసర పంచాయతీల్లోని స్థలాల్లో ఇష్టారాజ్యంగా లేఅవుట్లు వెలుస్తున్నాయి. చోడవరం పరిసర ప్రాంతాల్లో లే అవుట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండానే పచ్చని పంట పొలాలను ఇష్టారాజ్యంగా లేఅవుట్లు వేసేస్తున్నా అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు.  ఇక వ్యవసాయభూములను కూడా ఎటువంటి అనుమతుల్లేకుండా రియల్ ఎస్టేట్లుగా మార్చేస్తున్నారు. పంటభూములను వ్యవ సాయేతర అవసరాలకు వినియోగించేటపుడు ప్రభుత్వానికి చెల్లించవలసిన నాలా పన్ను పూర్తిగా ఎగ్గొడుతున్నా, అధికార యంత్రాంగం మాత్రం ప్రేక్షకపాత్రకే పరిమితం అయ్యింది. చోడవరం పరిసర పంచాయతీల్లో ఇటు చోడవరం నుంచి అటు చీడికాడ వరకు వెలసిన లేఅవుట్లలో ఎక్కువ శాతం వ్యవసాయ పంటభూములే. కానీ వీటినుంచి ప్రభుత్వానికి వసూలు చెల్లించాల్సిన నాలా పన్ను మాత్రం ఎక్కడా వసూలైనదాఖలాలు లేవు. ఈ లేఅవుట్లకు ప్రభుత్వపరంగా ఎటువంటి అనుమతులు లేకపోవడం గమనార్హం. వాస్తవానికి లేఅవుట్ నిబంధనల ప్రకారం మధ్యలో రహదారులు వేసి, కొంతమేర స్థలాన్ని కమ్యూనిటీ అవసరాల మేరకు విడచిపెట్టి మిగిలిన స్థలంలో ప్లాట్లు వేసి ప్రభుత్వ అనుమతి పొందిన మీదట విక్రయించాలి. కానీ క్షేత్రస్థాయిలో ఇవేవీ అమలుకావడంలేదు. ఖాళీ స్థలం తీసుకుని మధ్యలో రోడ్డు వేసి అటూ ఇటూ ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. ఇదే కాకుండా గతంలో వేరొకరికి విక్రయించిన స్థలాలనే, కొన్ని రోజుల తర్వాత మరొకరికి అమ్మేస్తున్న ఘటనలు ఎక్కువయ్యాయి. ఇటువంటి ఘటనలపై వివాదాలు రేగడం బాధితులు పోలీసులను ఆశ్రయిస్తుండడం ఎక్కువగా జరుగుతున్నాయి. చోడవరం ప్రాంతంలో చిన్నవీ పెద్దవీ కలిపి దాదాపుగా వంద వరకూ లేఅవుట్లు ఉన్నాయి. వీటిలో ఒకటి రెండు తప్ప మిగిలిన వాటికి అనుమతుల్లేకపోవడం గమనార్హం. 

 

 

 

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more