న్యూ ఇయర్ వేడుకలకు వైజాగ్ సిద్ధమైంది. అందమైన సముద్ర తీరంలో వెన్నెల వెలుగులను ఆస్వాదించుకుంటూ యువత ఎంజాయ్ చేయడానికి బాగా ఇష్టపడతారు. ఈ సంబరాలు జరుపుకోవటానికి సాగరనగరానికి జనం భారీగా క్యూకట్టారు. రిసార్ట్‌లన్నీ సెలబ్రిటీ ప్రోగ్రామ్స్‌తో రెడీ అయిపోయాయి. హోటళ్లన్నీ నో రూమ్స్ అన్న బోర్టులతో దర్శనమిస్తున్నాయ్.నూతన సంవత్సర వేడుకల్లో విశాఖది ప్రత్యేక స్థానం. సాగరనగరం కావడంతో న్యూఇయర్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి రాష్ట్రం నలుమూలలనుంచి విశాఖకు క్యూకడుతున్నారు. దానికి తగ్గట్లే హోటళ్లు, రిసార్టులన్నీ వినూత్న ప్రోగ్రామ్స్‌తో రారమ్మంటున్నాయి. ఇక ఆర్కే బీచ్ సంగతి వేరే చెప్పనక్కర్లేదు. గతేడాది వేడుకలకు లక్షన్నరమంది హాజరయ్యంటే.. పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ సారి ఆ సంఖ్య రెండు లక్షలు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్న నిర్వాహకులు అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేస్తున్నారు.ఇక వేడుకలకు విశాఖకు వచ్చే పర్యాటకులతో హోటళ్లన్నీ కిటకిటలాడుతున్నాయ్. రిసార్టులు, హోటళ్లు ఏర్పాటు చేసే ప్రోగ్రామ్స్‌లో పాల్గొనే యువత రాత్రి 12 కాగానే బీచ్‌కు చేరుకుని కేరింతలు కొడతారు. దీంతో సాగర పరిసర హోలళ్లకు గిరాకీ పెరిగిపోయింది. నగరంలో ఏ హోటల్ చూసినా నో రూమ్స్ అన్న బోర్టులతో దర్శనమిస్తున్నాయి.న్యూఇయర్ వేడుకలను క్యాష్ చేసుకోవడానికి హోటళ్లు రేట్లను అమాంతంగా పెంచేశాయ్. దీంతో రూమ్‌లు దొరక్క... దొరికినా అంత రేటు పెట్టలేక పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more
Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more