అసలే నిధుల్లేక నీరసిస్తున్న గ్రామ పంచాయతీ విభాగానికి ప్రభుత్వం షాక్‌నిచ్చింది. ఆర్థిక సంఘ నిధులపై పెత్తనాన్ని జిల్లా పరిషత్‌కు అప్పగించింది. నిధుల పంపిణీ అధికారాన్ని కూడా కట్టబెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మాజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.గ్రామ పంచాయతీ పాలక వర్గాల గడువు ఏడాది క్రితం ముగిసిపోయింది. ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో 13వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం నిలుపుదల చేసింది.మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించి స్థానిక సంస్థల పగ్గాలు పాలకులకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. అయినప్పటికీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేయలేదు. దీంతో ప్రత్యేక అధికారుల పాలనలోనే గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం, నిధులు విడుదల కాకపోవడానికి తోడు కొత్తగా నిధులను జెడ్పీకి అప్పగించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
13వ ఆర్థిక సంఘం కింద సుమారు మూడు కోట్ల రూపాయలను జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం విడుదల చేసింది. 2012-13 సంవత్సరానికి 1.16 కోట్ల రూపాయాలను జెడ్పీ ఖాతాలో జమ చేసింది. జనాభా లెక్కల ప్రకారం గ్రామ పంచాయతీల్లోని సుమారు 22 లక్షల మందికి ఈ నిధులను సర్దుబాటు చేయాల్సి ఉంది. ఈ నిధులను కేటాయించే బాధ్యతను జిల్లా పరిషత్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పైగా ఈ నిధులను కేవలం తాగునీటి సరఫరా కోసం ఖర్చు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి అనుగుణంగా, సీపీడబ్ల్యూ పథకాల నిధులను ఖర్చు చేయడానికి జిల్లా పరిషత్ నిర్ణయించింది. దీంతో గ్రామ పంచాయతీల మాజీ పాలక వర్గాలు కంగుతిన్నాయి. ఇప్పటికే జిల్లా పరిషత్ నుంచి నిధులు సర్దుబాటులో తీవ్రమైన జాప్యం జరుగుతున్నదని, తాజాగా పంచాయతీ నిధుల సర్దుబాటు పెత్తనం కూడా జడ్పీకే అప్పగించడం తగదని మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ మాజీ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు స్తంభించిపోతాయని వారు ఆందోళన చెందుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more
Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more