నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన సెన్సేషనల్ చిత్రం ‘లెజెండ్’లో ఆయన యుక్తవయస్సు పాత్రధారిగా మెప్పించిన ఓ యువకుడు అందరికీ గుర్తుండే వుంటుంది. ఆ సినిమాలో బాలయ్యకు తగ్గట్టుగానే తన ఎనర్జిటిక్ లెవెల్స్ ని ప్రెజెంట్ చేసి అభిమానుల ఆదరణ పొందిన ఆ నటుడు పేరు ‘దీపక్ సరోజ్’. అలాగే మహేష్ బాబు నటించిన ‘అతడు’లో బ్రహ్మానందం వద్దకు ఓ అబ్బాయి వచ్చి ‘నాన్నా నాకు ట్రైనేది’ అంటూ ఎంట్రీ ఇచ్చింది దీపకే.
ఇలా బాలనటుడిగా దాదాపు 40 సినిమాల్లో నటించిన దీపక్.. ఇటీవల అస్కార్ అవార్డ్ కు ఎంపికైన ‘మిణుగురులు’చిత్రంలోనూ లీడ్ రోల్ నటించాడు. అలాగే ’టామీ‘ చిత్రంలో రాజేంద్రప్రసాద్ సరసన ఆయన అల్లుడు పాత్రలో కూడా మెప్పించాడు. శర్వానంద్, గౌతమ్, సాయిరాంశంకర్ వంటి హీరోల బ్యాచ్ తో పాటు ప్రముఖ సినిమా ట్రైనర్ సత్యానంద్ వద్ద చిన్నప్పట్నుంచి ట్రైనింగ్ తీసుకున్న తొలి విద్యార్థి కూడా దీపక్ సరోజ్ కావడం విశేషం. అప్పటి నుండి నేటి వరకు చాలా చిత్రాల్లో డిఫరెంట్ పాత్రల్లో దీపక్ మెప్పిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఈ కుర్ర నటుడు హీరోగా గ్రాండ్ ఇవ్వబోతున్నాడు.
తాజాగా ‘వందనం’ చిత్రంతో యువ కథానాయకుడుగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు దీపక్. డిఫరెంట్ సబ్జెక్ట్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో యువకథానాయకుడుగా సైతం రాణిస్తానని దీపక్ సరోజ్ విశ్వాస్వాన్ని వ్యక్తం చేస్తున్నాడు. త్వరలో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు. ఈ చిత్రం దీపక్ కెరీర్ ని ఓ మలుపు తిప్పుతుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. మరి.. బాలనటుడిగా మంచి క్రేజ్ సంపాదించిన దీపక్.. హీరోగా ప్రేక్షకుల్ని మెప్పిస్తాడో లేదో వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more