Nandamuri kalyan ram director surendra reddy kick 2 movie updates tollywood news

kalyan ram latest news, kalyan ram news, kalyan ram new movie news, kalyan ram latest updates, kick 2 movie updates, kick 2 movie news, kick 2 movie gossips, director surendar reddy news, surendar reddy updates, raviteja news, raviteja kick 2 news

nandamuri kalyan ram director surendra reddy kick 2 movie updates tollywood news : Nandamuri kalyan ram to do movie another time with director surendar reddy after kick 2 movie shooting completed.

నందమూరి కళ్యాణ్ రామ్

Posted: 03/03/2015 02:44 PM IST
Nandamuri kalyan ram director surendra reddy kick 2 movie updates tollywood news

చాలాకాలం నుంచి ఒక్క హిట్ కోసం పరితపించిన కల్యాణ్ రామ్ కు ‘పటాస్’ ద్వారా ఆ లోటు తీరిన విషయం తెలిసిందే! ఆ చిత్రం మంచి విజయం సాధించడంతోపాటు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. దీంతో ఫుల్ జోష్ మీదున్న కళ్యాణ్.. మరో సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ హీరోగా ‘కిక్-2’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే! ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్ మీద కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత కళ్యాణ్ రామ్ తో కలిసి మరో సినిమా చేసేందుకు దర్శకుడు సురేందర్ రెడ్డి అంగీకరించాడట! అయితే.. ఆ చిత్రంలో హీరోగా కళ్యాణ్ రామ్ నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు అధికారికంగా వెలువడి కానున్నాయని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.

ఇదిలావుండగా.. సురేందర్ రెడ్డిని దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు కళ్యాణ్ రామ్! వీరిద్దరి కాంబోలో ‘అతనొక్కడే’ చిత్రం వచ్చింది. ఆ చిత్రంలో కళ్యాణ్ హీరోగా నటించడమే కాకుండా స్వయంగా నిర్మించాడు కూడా! అలా తనకు తొలి అవకాశమిచ్చిన కళ్యాణ్ రామ్ ను సూపర్ స్టార్ గా నిలబెట్టడానికి ఓ చిత్రం చేస్తానని సురేందర్ రెడ్డి చెప్పాడట! అందుకు కళ్యాణ్ కూడా ఓకే చేశాడని సమాచారం! అంటే.. త్వరలోనే వీరి కాంబోలో మరో మూవీ తెరకెక్కనుందన్నమాట!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more