Ravi teja power movie song shoot in bulgaria

Ravi teja Power movie shooting, Power movie song shooting in Bulgaria, Mass Raja Ravi Teja, Hansika, Ravi Teja Power Movie

Ravi teja Power movie song shoot in Bulgaria

మాస్ రాజా పవర్ ‘బల్గేరియా’ లో చూపిస్తున్నాడు

Posted: 07/09/2014 03:52 PM IST
Ravi teja power movie song shoot in bulgaria

టాలీవుడ్ లో మాస్ రాజాగా పేరు తెచ్చుకున్న రవితేజ పేరు గానీ, ఆయన సినిమా విషయాలు గానీ ఎవరూ రాసిన పాపాన పోలేదు. ఆయన ఏం చేస్తున్నాడు ఆయన సినిమా ఎంత వరకు వచ్చిందనే దాని పై సమాచారం లేదు. గత సంవత్సరం ‘బలుపు ’ సినిమాతో ప్రేక్షకులకు కనువిందు చేసిన రవితేజ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘పవర్ ’ సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఎప్పుడో విడుదల చేసినా ఇఫ్పటికీ ఆడియో, సినిమా విడుదల తేదీని ఇంత వరకు ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బల్గేరియాలో జరుగుతుంది. ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న హన్సిక పై అక్కడ బ్యూయెట్ సాంగ్స్ చిత్రీకరిస్తున్నారు. మరో వారం రోజుల్లో అక్కడ ఈ సినిమా షెడ్యూలును పూర్తి చేసుకొని వచ్చేస్తారట. ఇప్పటికే చాలా లేట్ అయిన ఈ సినిమాను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేస్తేనే ఈ సినిమా ఉందని గుర్తుకుంచుకుంటారు. లేకుంటే జనాల నోళ్ళలో మరుగున పడటం ఖాయం.

ఈ సినిమాలో రవితే పవర్ ఫుల్ పోలీస్ ఇన్ స్పెక్టర్ పాత్రలో నటిస్తుండగా, హన్సిక మొదటి హీరోయిన్ గా, రెజీనా రెండో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటి వరకు తన తదుపరి సినిమాను ప్రకటించని రవితేజ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. ఇప్పటికే సంతోష్ తన సినిమాకు ‘తిక్కరేగితే ’ టైటిల్ ని కూడా ఖరారు చేసుకున్నాడు. దీనికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more