ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ‘బాహుబలి మేకింగ్ వీడియో’కి అద్భుతమైన స్పందన వచ్చింది. అనుష్క పుట్టిన రోజును పురస్కరించుకొని ‘బిహైండ్ ది సీన్స్’ వీడియోను విడుదల చేశాం. అనుష్క గెటప్, ఆమెకు మేకప్ చేస్తున్న దృశ్యాలు, అనుష్క కాస్ట్యూమ్స్ కోసం డిజైనర్లు వేసిన డ్రాయింగ్స్ ఈ వీడియోలో పొందుపరిచాం. ఈ వీడియోకు నేపథ్య సంగీతం అద్భుతంగా కుదిరింది. ఆర్ఎఫ్సీలో నిర్మించిన అయిదు భారీ సెట్స్‌లో ఓ భారీ షెడ్యూల్ పూర్తి చేశాం. మూడు వారాల పాటు కేరళలో మరో షెడ్యూల్ చేయబోతున్నాం. చరిత్రలో నిలిచిపోయే సినిమా ‘బాహుబలి’ అవుతుంది’’ అని తెలిపారు.
భారీ జానపద చిత్రం ‘బాహుబలి’. మహాభారత కథను పోలి ఉండే కథాంశంతో దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తుండగా, రానా ప్రతినాయకునిగా నటిస్తున్నారు. అనుష్కది ఇందులో కథకు కేంద్ర బిందువులాంటి పాత్ర. అందుకే అనుష్క పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన రెండవ మేకింగ్ వీడియోని నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని విడుదల చేశారు.
అనుష్క మాట్లాడుతూ- ‘‘రాజమౌళితో రెండోసారి పనిచేయడం ఆనందంగా ఉంది. సన్నివేశాలు అనుకున్నట్లు రావడానికి ఎంతైనా శ్రమిస్తారాయన. ఈ సినిమా కోసం 60 రోజులు షూటింగ్ చేశామంటే నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే ఈ సినిమాకు పనిచేస్తుంటే టైమ్ తెలియడం లేదు’’
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more