Sms hero sudheer babu interview

sudheer babu interview, sms hero sudheer babu, mahesh babu brother in law sudheer babu, sms hero mahesh brother in law super star krishna son in law sudheers profile, sms hero sudheers profile, sudheer profile, mahesh brother in law sudheer profile , krishna son in law sudheer profile

sudheer babu interview, sms hero sudheer babu, mahesh babu brother in law sudheer babu, sms hero mahesh brother in law super star krishna son in law sudheers profile, sms hero sudheers profile, sudheer profile, mahesh brother in law sudheer profile , krishna son in law sudheer profile

sms hero sudheer babu interview.gif

Posted: 02/09/2012 04:14 PM IST
Sms hero sudheer babu interview

interview-image

sms_hero_sudheer_babu_interviewసూపర్ స్టార్ క్రిష్ణమేనల్లుడిగా ఎస్.ఎం.ఎస్సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతూ దూసుకువస్తున్న మరో వారసుడు సుధీర్ బాబు. ప్రిన్స్ మహేష్ బాబుకి సొంత బావ. ఎంత స్టార్ డమ్ ఉన్న హీరోల అండ ఉన్నా... తనదైన ప్రతిభతోనే ఇక్కడ రాణిస్తానని నిక్కచ్చిగా చెబుతున్నాడీ కుర్రాడు. మరి ఆయన చెప్పిన విషయాలు.

సూపర్ స్టార్ల కుటుంబంలోని హీరోవి. గ్రాండ్ లాంచ్ కావచ్చు కదా ?

క్రిష్ణ – మహేష్ లాంటి సూపర్ స్టార్ల కుటుంబం నుండి వచ్చినా... నన్ను నేను స్వయంగా నిరూపించుకోవాలనుకుంటున్నా. అందుకే ఏ హంగూ, ఆర్భాటం లేకుండా వస్తున్నా. మామయ్య క్రిష్ణ, బావ మహేష్ ల సూచనలు ఉపయోగ పడుతున్నాయి. డాన్సులు, ఫైట్స్ సహా అభినయం, హావ భావాలపై రెండేళ్ళ పాటు శిక్షణ తీసుకున్నాను. ఇక నేనేమిటో నిరూపించుకోవడమే మిగిలింది.

ఎస్ఎంఎస్గురించి ?

ఎస్ఎంఎస్’ (శివ మనసులో శ్రుతి) అనేది ఉప శీర్షిక. శివ పాత్రలో నేను నటించాను. శ్రుతిగా రెజీన నటించారు. సూపర్ గుడ్ ఫిలిం స్థంస్థ వేగ ఎంటర్ ప్రైజెస్ పతాకంలో విక్రమ్ రాజ్ నిర్మించారు. అంతకు ముందే గౌతమ్ మీనన్ ఏమాయ చేసావెసినిమాలో కెమెరా ముందు నటించాను. అది కెమెరా రిహార్సల్స్ కోసమే.

సిక్స్ ప్యాక్ చేయరా ?

అల్రెడీ ఉంది. అయినా నేను స్వతహాగా బ్యాడ్మింటన్ ప్లేయర్ ని. క్రీడాకారుడు ఎప్పుడు ఫిట్ గానే ఉంటాడు. 6 ప్యాక్ ఉన్నా సినిమాల్లో కథాంశం ప్రకారం అవసరం అనుకుంటేనే చూపిస్తా.

పుల్లేల జీవితం ప్రేరణ...

నా స్నేహితుడు పుల్లెల గోపీచంద్ జీవితం నాకు ప్రేరణ. చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి ఎదిగిన వ్యక్తి. తనతో కలిసి బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా వెలుగొందాను. రాష్ట్రస్టాయి క్రీడాకారుడిగా, జూనియర్ ప్రపంచ కల్ లో పాల్గొన్నా. తన జీవిత కథలో నటించాలని ఉంది.

దూకుడుఆడియోలో క్రిష్ణ గారు మిమ్మల్ని పరిచయం చేశారు కదా ?

దూకుడు ఆడియో వేడుకు నా స్వస్థలం విజయవాడలో జరిగింది. అక్కడే అభిమానులందరికి మామయ్య పరిచయం చేశాడు.

సినిమాల్లోకి వస్తానంటే మొదట్లో మీవారు ఏమన్నారు ?

సినిమా కష్టాలు చెప్పారు. ఇక్కడ సక్సెస్ రేటు తక్కువ. అపజయాలే ఎక్కువ. జయం- అపజయం రెండింటినీ సమానంగా తీసుకో. ఫెయిలయినప్పుడు కుంగిపోకూడదు. తిండి, నిద్రహారాలు నీ చేతిలో ఉండాలి. ఇలా చాలా చెప్పారు తప్ప ఎక్కడా నిరాశపర్చలేదు.

సూపర్ స్టార్ల సలహాలు ?

ముందు బాగా శిక్షణ పొందమన్నారు. అందుకే డ్యాన్సులు, ఫైట్స్ లో రెండేళ్ళ పాటు సుధీర్ఘంగా శిక్షణ తీసుకున్నాను. ఆ తరువాతే హీరోనయ్యాను.

క్రిష్ణ, మహేష్ ల స్పందన ?
డాన్సులు, ఫైట్స్ బాగా చేశావన్నారు.

నమ్రత నుండి స్పందన ?

నమ్రత నా ఫెర్ఫామెన్స్ చూసి బాగా చేశాడటచూడండి అని మహేష్ కి కూడా చెప్పారట.

పెళ్ళెప్పుడైంది ?

2006లో

విద్యార్హత ?

బీఈ కెమికల్ ఇంజనీరింగ్ .

స్పోర్ట్స్ ... సినిమా ఏది కష్టం ?

రెండూ బాధ్యాతాయుతమైనవే

క్రిష్ణ, మహేష్ తో కలిసి నటించరా ?

అందుకు అర్హత కావాలి.

తుది వాక్యం....

ఓ మంచి నటుడిగా నిరూపించుకోవాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chit chat with pula rangadu heroine isha chawla
N shankar fim maker and movie director interview  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more