Prince mahesh babu at businessman success meet

Mahesh Babu Businessman Success Meet Photo Gallery, Mahesh Babu Latest Pictures, Mahesh Babu New Images, Mahesh Babu Latest Wallpapers

Mahesh Babu Businessman Success Meet Photo Gallery, Mahesh Babu Latest Pictures, Mahesh Babu New Images, Mahesh Babu Latest Wallpapers

South Prince Mahesh Babu.gif

Posted: 01/28/2012 05:35 PM IST
Prince mahesh babu at businessman success meet

Mashesh-babu-interview-Imag

Masheshఅమితాబ్ కంటే మహేశ్ గొప్ప నటుడు' అంటూ ఇటీవల రాంగోపాల్‌వర్మ చేసిన కామెంట్‌ను మంచి కాంప్లిమెంట్ గానే భావిస్తానే కానీ, దాన్ని నిజమనుకోననీ, దాన్ని నమ్మితే తనంత ఫూలిష్ మరొకరు ఉండరనీ అన్నారు హీరో మహేశ్. అమితాబ్ లెజండ్ అనీ, ఆయనతో తనకు పోలికే లేదనీ అన్నారు. 'దూకుడు', 'బిజినెస్‌మేన్' వంటి వరుస హిట్లతో జోరుమీదున్న ఆయన చెప్పిన కొన్ని కబుర్లు.

'దూకుడు' లాంటి పెద్ద హిట్ తర్వాత 'బిజినెస్‌మేన్' రూపంలో మరో బ్లాక్‌బస్టర్ రావడం చాలా హేపీ. అదే సమయంలో బాధ్యత కూడా పెరిగింది. 'పోకిరి' అంత పెద్ద హిట్టయిన తర్వాత కొంత కన్‌ఫ్యూజన్‌లో పడ్డా. దాని మేజిక్‌ని రిపీట్ చెయ్యాలని కొన్ని తప్పులు చేశా. దాన్నుంచి బయటకు రావడానికి కొంత గ్యాప్ తీసుకున్నా. యాక్టర్‌గా 'ఖలేజా' డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది. ఆ తర్వాత 'దూకుడు', ఇప్పుడు 'బిజినెస్‌మేన్' వంటి బ్లాక్‌బస్టర్స్ వచ్చాయి.

అరుదుగా వచ్చే పాత్ర.

'బిజినెస్‌మేన్' కొత్త ఫార్మట్లో వచ్చిన చిత్రం పెద్దగా పేడింగ్ వంటివి లేకుండా ఒక కేరక్టర్ దృష్టికోణం నుంచే నడిచే సినిమా. ఇది నాకు ఛాలెంజింగ్ కేరక్టర్. చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి పాత్రలు వస్తాయి. ఆ కేరక్టర్‌తో నేను బాగా కనెక్టయ్యా. అందులో చాలా ఫైర్ ఉంది. కెమెరా క్లోజప్‌ల మీదే ఎక్కువగా నడుస్తుంది. అది చెయ్యడం కష్టం. చేసి మెప్పించినందుకు హేపీ. డైలాగులు కానీ, కంటెంట్ కానీ కాంట్రవర్సీ అవుతాయనుకుంటే అసలు ఈ సినిమా చేసే వాళ్లమే కాదు. చాలా నిజాయితీగా ఈ సినిమా చేశాం. 'బిజినెస్‌మేన్' ఇంత హిట్టవడానికి కారణం నిర్మాత వెంకట్ గారి ప్లానింగ్. రెండు వేల థియేటర్లలో ఆయన రిలీజ్ చేయడం వల్ల తొలి వారం వచ్చిన కలెక్షన్లకు మతిపోయింది.

ఫెంటాస్టిక్ స్క్రిప్ట్....
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో చేస్తున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' పూర్తిగా భిన్నమైన చిత్రం. అది నాకు తొలి సినిమా వంటింది. శ్రీకాంత్ చెప్పిన స్క్రిప్ట్ వినగానే ఎగ్జయిటయ్యా. ఫెంటాస్టిక్ స్క్రిప్ట్. వెంకటేశ్‌గారితో కలిసి నటిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఇది వచ్చే దసరాకు విడుదలవుతుంది. అలాగే సుకుమార్ డైరెక్షన్‌లో చేయబోతున్నది కూడా వేరియేషన్ ఉన్న సినిమా. ఇది 2013 సంక్రాంతికి వస్తుంది.

రీమేక్స్ ఇష్టం లేదు....
మణిరత్నం దర్శకత్వంలో చెయ్యాలనేది నా కల. ఆయనతో ఓ తమిళ సినిమా చేసే అవకాశమొచ్చి మిస్సయింది. వ్యక్తిగతంగా నాకు రీమేక్స్ చెయ్యడం ఇష్టంలేదు. అప్పటికే మరొకరు చేసిన పాత్రను చెయ్యడం నాకిష్టం ఉండదు. '3 ఇడియట్స్' రీమేక్‌ని శంకర్ కోసమే చేద్దామనుకున్నా. కానీ 'దూకుడు' కాల్షీట్లకు అడ్డం వస్తుండటంతో వదులుకున్నా. అలాగే నాన్నగారు చేసిన సినిమాల్ని కూడా రీమేక్ చెయ్యాలనే ఉద్దేశం లేదు.అవి గొప్ప సినిమాలు.

అది చదివి పోగతాగడం మానేశా.....
నేను చాలా సింపుల్ పర్సన్. షూటింగుంటే వెళ్లడం, లేదంటే ఇంట్లో గడపడం. ఎప్పుడో కానీ బయటకు వెళ్లను. నా ఫేవరేట్ హాలీడే స్పాట్స్ గోవా, న్యూజిలాండ్. 'ద ఈజీ వే టు స్టాప్ స్మోకింగ్' అనే పుస్తకం చదివి, పొగతాగడం మానేశా. టాప్ యాక్టర్లు పోగ తాగడాన్ని ప్రోత్సహించకూడదనేది నా అభిప్రాయం. అభిమానులు వాళ్లని అనుకరిస్తారు కాబట్టి అలాంటి వాటికి హీరోలు దూరంగా ఉండాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ileana hot at snehitudu audio launch
Tamil actor ravi prakash filmography  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more