శ్రీరాముడు, రావణుడి మధ్య యుద్ధం జరగడం.. చివరికి రావణాసురుడు హతం కావడం.. ఈ రామాయణం మొత్తం జరగడానికి అసలు కారణమైన ‘శూర్ఫనఖ’. ‘సీతారామాకల్యాణం’తో ముగిసిన రామాయణాన్ని శూర్పనఖ తన పగ తీర్చుకోవడం కోసం ఆ తర్వాత మొత్తం కథను నడిపింది. ఆ మొత్తం కథనం ఏంటో ఓసారి తెలుసుకుందాం..
విశ్రవోబ్రహ్మకు, బాక అనే స్త్రీ యందు కలిగిన కుమార్తె శూర్పనఖ. ఖర, దూషణులు అనే ఇద్దరు సొంత సోదరులున్న ఈమె రావణునికి సవతి చెల్లెలు. అయినప్పటికీ రావణుడు ఏనాడూ శూర్పనఖను సవతి చెల్లెలులా చూడలేదు. ఎంతో ప్రేమగా, గారంగా చూసుకునేవాడు. శూర్పనఖ కూడా రావణుని అలాగే అభిమానించేది. శూర్పనఖ వివాహం గురించి రావణుడు ఎన్నో కలలు కనేవాడు. జగదేకవీరుడైన దానవ యువకునితో శూర్పనఖ వివాహం చెయ్యాలని ఆరాటపడేవాడు. అయితే.. శూర్పనఖ మాత్రం విద్యుజిహ్వుడనే ఓ దానవ యువకుని ప్రేమించింది. ఈ విషయం తెలిసి రావణుడు కోపాద్రిక్తుడై.. వారి ప్రేమను నిరాకరిస్తాడు. అతనితో దూరంగా వుండాల్సిందిగా శూర్పనఖను హెచ్చరించి.. ఆమెకు పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు. అయితే.. శూర్పనఖ సరైన సమయం చూసి విద్యుజిహ్వునితో పారిపోయి పెళ్లి చేసుకుంది. మొదట ఈ విషయం తెలుసుకుని రావణుడు చాలా ఉగ్రుడవుతాడు కానీ.. శూర్పనఖ మీదున్న మమకారాన్ని చంపుకోలేక వారిద్దరికి ఘనంగా వివాహం జరిపించాడు. ఆ తర్వాత సుఖంగా జీవితం కొనసాగించిన ఆ ఇద్దరి దంపతులకు ‘జంబుకాసురుడు' అనే కుమారుడు పుట్టాడు.
ఇదిలావుండగా.. ఒకసారి రావణుడు కాలకేయుల మీదకు యుద్ధానికి వెళుతూ... విద్యుజిహ్వుని తనకు తోడుగా తీసుకెళ్ళాడు. భీకరంగా సాగిన ఆ యుద్ధంలో.. విద్యుజిహ్వుని శత్రుపక్ష వీరుడని తలచి... రావణుడు పొరపాటున అతని తల నరికి చంపాడు. తర్వాత నిజం తెలిసి అతడు చాలా బాధ పడ్డాడు. కానీ.. తన భర్తను రావణుడు కావాలనే చంపాడని నమ్మిన శూర్పనఖ.. అతనిని దూషంచింది. రావణుడు మౌనంగా అన్నీ భరించి.., శూర్పనఖను ఓదార్చి... దండకారణ్యాన్ని ఆమెకి అరణంగా ఇచ్చి స్వేచ్ఛగా బతకమన్నాడు. శూర్పనఖ తన కుమారుడు జంబుకాసురుని తీసుకుని దండకారణ్యానికి వెళ్లింది కానీ.. రావణుడి మీద తన కోపాన్ని తగ్గించుకోలేదు. తను అనాధగా మిగలడానికి రావణుడే అని తలచి అతనిమీద పగ పెంచుకుంది. రావణుని సంహరించే వీరుని కోసం ఎదురుచూస్తూ కాలం గడుపింది. అలాంటి సమయంలో శ్రీరాముడు ఆమె కళ్ళబడ్డాడు. రాముని సౌందర్యం చూసి అతనిపై మనసు పారేసుకున్న ఈమె.. అతని దగ్గరికెళ్లి దగ్గరకు వచ్చి తన కోరిక తీర్చమని అర్థించింది. కానీ.. రాముడు అందుకు ఒప్పుకోలేదు. తర్వాత రాముని సలహా మేరకు లక్ష్మణుని వెంటబడింది. కానీ అక్కడ ఈమెకు భంగమే ఏర్పడింది.
తన కామతృష్ణ తీరకపోవడానికి కారణం సీత అని తెలుసుకుని, ఆమెను చంపడానికి ప్రయత్నిస్తుంది. అయితే.. అప్పుడు లక్ష్మణుడు సీతను కాపాడి.. శూర్పనఖ ముక్కు, చెవులు కోసేస్తాడు. ఆ అవమానభారాన్ని తట్టుకోలేకపోయిన శూర్పనఖ.. తన సోదరుడు ఖరుని ముందు కన్నీళ్లతో నిలబడింది. శూర్పనఖకు జరిగిన పరాభవానికి ఖరుడు ఉగ్రుడై ‘సోదరీ.. నువ్వు బాధపడకు.. నేనే దగ్గరుండి నీ కోరిక నెరవేరేలా చేస్తాను’ అని తన రాక్షస సైన్యంతో బయలుదేరాడు. అయితే రాముడు ఒక్కడే యుద్ధరంగంలో నిలిచి ఆ రాక్షస సైన్యాన్ని మొత్తం సంహరించాడు. అది చూసి శూర్పనఖ ఆశ్చర్యపోయింది. అప్పుడామె.. ఇన్నాళ్ళకు రావణుని ఎదిరించి తన పగ తీర్చగల మగాడు కనిపించాడని సంతోషించింది. అప్పుడు ఆమె ఓ పథకం రచించి.. రావణుడి దగ్గరికి వెళ్లింది. అతడు సభలో వుండగా అతని నిలబడింది. విరూపగా ఉన్న శూర్పనఖను చూసి ‘ఎవరీ దారుణం చేసింది?’ అని ప్రశ్నించాడు.
అప్పుడు శూర్పనఖ ప్రేమగా నటిస్తూ.. ‘అన్నా నా ఈ విరూపానికి కారణం రాముడనే నరుడు. వాడి భార్య సీత అతిలోక సౌందర్యవతి. ఆ సీతను నీకు భార్యగా చేద్దామని ప్రయత్నించి ఈ గతి తెచ్చుకున్నాను’ అంది. అప్పుడు రావణుడు రక్తలోచనుడై.. ‘బాధపడకు సోదరీ.. ఆ సీతను నా భార్యగా కాదు.. బానిసగా తెచ్చి పడేస్తాను’ అని బయలుదేరాడు. ఆ తర్వాత అతడు సీతను అపహరించడం.. రాముడు ఆమెకోసం లంకకు వెళ్లడం.. రావణుడిని చంపడం.. అంతా తెలిసిందే! ఈ విధంగా శూర్పనఖ తన పగను తీర్చుకుంది.
(And get your daily news straight to your inbox)
Sep 11 | శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో... Read more
Sep 07 | త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా | మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా || రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది " నువ్వు మాయా మృగాన్ని... Read more
Sep 06 | అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని,... Read more
Sep 03 | రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు... Read more
Aug 27 | అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర... Read more