హిందూ సంస్కృతిలో జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి ఒకటి. పురాతనకాలం నుండి ఈ పండుగను ఎంతో విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైందిగా భావిస్తారు. మహాశివరాత్రిని ప్రతిఏటా బహుళ చతర్ధశినాడు జరుపుకుంటారు.
శివరాత్రిరోజు ఉపవాసం వుండి, ఆరోజు జాగారం చేస్తే.. మనం చేసిన పాపాలన్నీ నశించి, పుణ్యం వస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఇక ఆలయాల సంగతి అయితే చెప్పనవసరం లేదు.
చాలామంది భక్తులు ఈ దినంనాడు శివుని గుడికి వెళ్లి అభిషేకాలు, పూజలు వంటి కార్యక్రమాలను చేపబడతారు. అదేవిధంగా శివుడికి సంబంధించిన జ్యోతిర్లింగాలలో ఏదో ఒక చోటికి వెళ్లి, అక్కడ పూజలు జరుపుకుని నమస్కారం చేస్తే జీవితంలో ఏదో ఒక లాభం లభిస్తుందని, పుణ్యం వస్తుందని భక్తులు నమ్ముతారు.
సాధారణంగా మనం మనద్వారా జరిగిన పాపాలను తుడుచుకోవడానికి, వాటినుండి విముక్తి పొందడానికి అనేక రకాల వ్రతాలను నిర్వహిస్తాం. అలాగే శివునికి సంబంధించిన వ్రతాలు పదివున్నాయి.
ఈ శివరాత్రి పర్వదినంనాడు ఒక ప్రత్యేకంగా వ్రతవిధానం వుంటుంది. సాక్షాత్తూ శివుడే ఈ వ్రతవిధానం గురించి బ్రహ్మాది దేవతలకు వివరించి చెప్పాడని శివమహాపురాణంలో పేర్కొనబడింది.
ప్రతి అష్టమినాడు రాత్రిపూట భోజనాలు చేస్తూ, ఉపవాసాలు వుండాలి. కానీ కాలాష్టమినాడు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోకుండా పూర్తి ఉపవాసం వుండాలి. అలాగే ప్రతి మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినాడు భోజనం చేయకూడదు. అదే శుక్లపక్షంలో త్రయోదశినాడు పగటిపూట ఉపవాసం వుండి రాత్రి సమయంలో భోజనం చేయాలి.
కృష్ణపక్షంలో ఏకాదశినాడు రాత్రివేళ శివుడిని ఆరాధించి భోజనం చేయాలి. కానీ అదే కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశినాడు రాత్రి భోజనం చేయడం నిషిద్ధం.
ఈ రెండు పక్షాలలో వచ్చే ప్రతిసోమవారంనాడు కేవలం రాత్రిపూజ మాత్రమే భోజనాలు చేయాలి. అదేవిధంగా ముక్తిమార్గాలకు సంబంధించి రుద్రజపం, శివాలయంలో ఉపవాసం, శివపూజ, వారణాసిలో మరణం వంటి నాలుగు పూజావిధానాలు కూడా వున్నాయి. అష్టమీ తథితో కూడిన సోమవారం, కృష్ణపక్ష చతుర్దశి అంటే శివుడికి ఎంతో ప్రీతికరమైంది.
అయితే ఈ వ్రతాలన్నింటికి మించి శివవ్రతం ఎంతో ఉత్తమమైనంది. మానవులకు హితాన్ని కలిగించటంలో దీనికి మించిన వ్రతం మరొకటి లేదు. ఏ కులమత భేదాలు, చిన్నాపెద్దా, ఆడవాళ్లు-మగవాళ్లు వంటి తేడాలు లేకుండా అందరూ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వ్రతాన్ని మాఘమాస కృష్ణపక్ష చతుర్దశినాడు ప్రత్యేకంగా ఆచరిస్తారు. ఈ పర్వదినంనాడు శివునికి పూజలు నిర్వహించడం వల్ల మనం చేసిన పాపాలన్నీ నశిస్తాయి.
మన రోజువారి కార్యక్రమాలను ముగించుకున్న తరువాత శివుని ఆలయానికి వెళ్లి అక్కడ పూజా కార్యక్రమాలను నిర్వహించుకోవాలి. ఆ తర్వాత పూజాద్రవ్యాలను తీసుకొని, ఇంట్లో పవిత్రమైన స్థలంలో ఒకచోట శివలింగాన్ని వుంచుకొని, పూజను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే పూజకు ముందు తలస్నానం చేసి, పూజకు కావాల్సిన ద్రవ్యాలను, ఇతరత్ర సామాగ్రిని తయారుచేసుకుని పూజా కార్యక్రమాన్ని మొదలుపెట్టుకోవాలి.
ఒకవేళ పూజావిధానం, మంత్రాలు తెలియకపోతే.. ఒక మంచి పండితుడిని పిలిచి పూజ చేయించుకోవాలి. ఈ శివరాత్రిపూజ నాలుగు జాములలో నాలుగు రకాలుగా వుంటుంది. మొదటి జాములో పార్ధివలింగ పూజతోపాటు శివనామస్మరణ చేస్తూ ఎర్రగన్నేరు, పద్మంలాంటి పుష్పాలను శంకరుడికి సమర్పించాలి. రకరకాల చందనం, నూకలులేని బియ్యం, నల్లని నువ్వులతో శివుడిని పూజించాలి. అలాగే శివుడి నామాలైన భవుడు, శర్వుడ, రుద్రుడు, పశుపతి, ఉగ్రుడు, మహాన్, భీముడు, ఈశానుడుని నామావళిగా జపిస్తుండాలి.
పూజను జరిపిస్తున్న గురువు లేదా పండితుడి సూచనలను అనుసరించి, శివుడికి ధేనుముద్రను చూపించి, పవత్రిజలంతో తర్పణమివ్వాలి. యధాశక్తిగా ఐదుగురికి భోజనం పెట్టాలి. ఇదంతా అయిన తరువాత, నృత్యగీతవాద్యాలతో ఉత్సవాన్ని జరిపించి, ఆ ఫలాన్ని పరమేశ్వరుడికి సమర్పించి, పూజలో పెట్టిన శివలింగానికి ఉద్వాసన చెప్పాలి.
మొదటిజాము పూజ అయిన తర్వాత రెండవజాములో పూజను ప్రారంభించాలి. మొదటిజాములో ఉపయోగించినటువంటి ద్రవ్యాలనే రెండవ జాములో ఉపయోగించుకోవచ్చు. నువ్వులు, యవలు, కమలపుష్పాలు, బిల్వదళాలతో పూజచేసి నిమ్మపండుతో అర్ఘ్యం ఇవ్వాలి. పాయాసాన్ని నివేదించి జపం చేయాలి. తరువాత శివభక్తులకు భోజనం పెట్టాలి.
మూడవజాములో కూడా ఇదేవిధంగా పూజను నిర్వహించుకోవాలి. అయితే ఇందులో యవలకు బదులుగా గోధుమలను వాడాలి. జిల్లేడు పూలతో పూజ చేస్తూ శ్రీమహావిష్ణువును ధ్యానించడం ఇందులో వున్న ప్రాముఖ్యత.
ఇక నాలుగో జాములో కూడా పూజ విధానాన్ని యథాతథంగా నిర్వహించుకోవాలి. మూడోజాములో ఏర్పాటు చేసిన శివలింగాన్ని నాలుగో జాములో పూజకు ఉపక్రమించాలి. ఈ జాములో కొన్ని ధాన్యాలను, పధార్థాలను ఉపయోగించి, పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. ఇలాగే పూజావిధానాన్ని ఉదయం తెల్లవారే వరకు ఉత్సవం చేయాలి. తెల్లవారిన తరువాత స్నానాలు చేసుకుని, శివుడికి ద్రవ్యాలతో పూజ చేయాలి.
పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత వేదపండితలకు, యతులకు భోజనం పెట్టి వారికి దానాలు ఇవ్వడం ఆచారం. తరువాత శివుడిని నమస్కరించి, పుష్పాంజలిని ఇచ్చి మంత్రపుష్పం సమర్పించుకోవాలి. ఈ కార్యక్రమాలు ముగిసిన తరువాత మనం తెలిసీ, తెలియక చేసిన పాపాలను నాశనం చేయమని వేడుకొని, ఉపవాసాన్ని విరమించుకోవాలి. ఈ విధంగా వ్రతాన్ని నిర్వహించుకోవాలి.
(And get your daily news straight to your inbox)
Sep 11 | శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో... Read more
Sep 07 | త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా | మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా || రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది " నువ్వు మాయా మృగాన్ని... Read more
Sep 06 | అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని,... Read more
Sep 03 | రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు... Read more
Aug 27 | అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర... Read more