Satyanarayana swamy vratham

satyanarayana swamy vratham, satyanarayana swamy pooja,

satyanarayana swamy vratham, satyanarayana swamy pooja,

చిలుకూరు బాలాజీ టెంపుల్

Posted: 12/31/2013 10:05 AM IST
Satyanarayana swamy vratham

ఈ వ్రతము ప్రజల కష్టములను విచారములను పోగొట్టును. ధనధాన్యములు వృద్ధి నొందించును. సంతానమును, స్త్రీలకు సౌభాగ్యమును ఇచ్చును. సమస్త కార్యములందును విజయమును సమకూర్చును.

మాఘమాసమున గాని, వైశాఖమాసమున గాని, కార్తీకమాసమున గాని మరియు ఏ శుభదినమునందైనా గాని యీ వ్రతము చేయవలెను. యుద్ద ప్రారంభము లందును, కష్టములు కలిగినప్పుడును, దారిద్ర్యము గలిగినప్పుడును అవి తొలగిపోవుటకు కూడ ఈ వ్రతమాచరించవచ్చును. నారదా ! భక్తుని శక్తిబట్టి ప్రతి మాసమందుగాని ప్రతి సంవత్సరమున గాని యీ వ్రతము నాచరించవలెను. ఏకాదశినాడు గాని, పూర్ణిమనాడుగాని, సూర్యసంక్రమణ దినమున గాని యీ సత్యనారాయణ వ్రతము చేయవలెను.
వ్రతమురోజు విధిగా చేయవలిసిన పనులు

ప్రొద్దుట లేచి దంతధావనాది కాలకృత్యాలు, స్నానాది నిత్యకర్మములు ఆచరించి, భక్తుడు ఇట్లు వ్రతసంకల్పము చేసి దేవుని ప్రార్థింపవలెను. ఓ స్వామీ ! నీకు ప్రీతి కలుగుటకై సత్యనారాయణ వ్రతము చేయబోవుచున్నాను. నన్ననుగ్రహింపుము. ఇట్లు సంకల్పించి, మద్యాహ్న సంద్యావందనాదులొనర్చి సాయంకాలము మరల స్నానము చేసి ప్రదోషకాలము దాటిన తరువాత స్వామికి పూజ చేయవలెను. పూజాగృహములో ప్రవేశించి స్థలశుద్దికై ఆ చోట గోమయముతో అలికి పంచవర్ణముల మ్రుగ్గులు పెట్టవలెను. ఆ మ్రుగ్గులపై అంచులున్న క్రొత్తబట్టలను పరచి, బియ్యము పోసి మధ్య, వెండిది కాని, రాగిదికాని, ఇత్తడి కాని, కలశమునుంచవలెను. బొత్తిగా పేదవారైనచో మట్టి పాత్రనైనా ఉంచవచ్చును. కాని శక్తి యుండి కూడ లోపము చేయరాదు. కలశముపై మరల అంచులున్న క్రొత్త వస్త్రము నుంచి, ఆపై స్వామిని నిలిపి పూజించవలెను. ఎనుబది గురిగింజల యెత్తు బంగారముతోగాని, అందులో సగముతో గాని, ఇరువది గురుగింజల ఎత్తు బంగారముతోగాని సత్యనారాయణ స్వామి ప్రతిమను జేయించి, పంచామృతములతో శుద్దిచేసి మండపములో నుంచవలెను.
పూజాక్రమము:

గణపతి, బ్రహ్మ, విష్ణువు, శివుడు, పార్వతి అను పంచలోకపాలకులను, ఆదిత్యాది నవగ్రహములను, ఇంద్రాద్యష్టదిక్పాలకులను ఇక్కడ పరివార దేవతులుగా చెప్పబడిరి. కావున వారిని ముందుగా ఆవాహనము చేసి పూజించవలెను. మొదట, కలశలో వరుణదేవు నావాహనము చేసి విడిగా పూజించవలెను. గణేశాదులను కలశకు ఉత్తరమున ఉత్తర దిక్సమాప్తిగా ఆవాహన చేసి, సూర్యాది గ్రహములను, దిక్పాలకులను ఆయా స్థానములలో ఆవాహన చేసి పూజించవలెను. ఆ పిమ్మాట సత్యదేవుని కలశమందు ప్రతిష్ఠించి పూజచేయవలెను.
నాలుగు వర్ణముల వారికి పూజావిధానము

బ్రాహ్మణ - క్షత్రియ, వైశ్య, శూద్రులనెడి నాలుగు వర్ణాలవారును, స్త్రీలును గూడ ఈ వ్రతము చేయవచ్చును. బ్రాహ్మణాది ద్విజులు కల్పోక్త ప్రకారముగా వైదిక - పురాణ మంత్రములతోను, శూద్రులైనచో కేవలము పురాణ మంత్రముల తోను స్వామిని పూజించవలెను. మనుజుడు, భక్తిశ్రద్ధలు గలవాడై ఏ రోజునైనను, పగలు ఉపవాసముండి సాయంకాలమున సత్యనారాయణ స్వామిని పూజింపవలెను.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ramayanam forty seven story

    రామాయణం-47వ-భాగం

    Sep 11 | శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో... Read more

  • Ramayanam forty six story

    రామాయణం-46వ-భాగం

    Sep 07 | త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా | మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా || రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది " నువ్వు మాయా మృగాన్ని... Read more

  • Ramayanam forty five story

    రామాయణం-45వ-భాగం

    Sep 06 | అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని,... Read more

  • Ramayanam forty four story

    రామాయణం-44వ-భాగం

    Sep 03 | రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు... Read more

  • Ramayanam forty three story

    రామాయణం-43వ-భాగం

    Aug 27 | అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర... Read more