The Importance of saptashloki gita | bhagavad gita | Lord krishna | Arjuna | Mahabharat

Saptashloki gita importance bhagavad gita lord krishna arjuna mahabharat

saptashloki gita, saptashloki gita in telugu, saptashloki gita importance, saptashloki gita telugu, bhagavad gita, lord krishna, arjuna, kurukshetra war, pandavas history, kauravas history, krishna arjuna photos

saptashloki gita importance bhagavad gita Lord krishna Arjuna Mahabharat : The Importance of saptashloki gita which is presented by lord krishna to arjun in kurukshetra war.

సప్తశ్లోకాలు దాగిన సమస్త గీతాసారం

Posted: 05/12/2015 08:54 PM IST
Saptashloki gita importance bhagavad gita lord krishna arjuna mahabharat

కురుక్షేత్ర మహాయుద్ధం సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించిన ‘భగవద్గీత’లోని ప్రతీ శ్లోకం ఒక మహామంత్రం. నిత్య జీవితంలో మనకి ఎదురయ్యే ప్రతి ప్రశ్నకి, సమస్యకి అందులో సమాధానాలు దొరుకుతాయి. అది కేవలం కైవల్య ప్రాప్తికి మాత్రమే అనుకుంటే మాత్రం పొరపాటే! అనుక్షణం మన ఆలోచనని, ఆచరణని ప్రభావితం చేయగల ఒక మహత్తర సాధనం భగవద్గీత. గీతాసారాన్ని మనసులో నింపుకోగలిగితే.. జీవితంలో సంతోషాన్ని నింపుకోవడం ఎలాగో సులభంగా తెలిసిపోతుంది.

అయితే.. ప్రతిఒక్కరు పూర్తి భగవద్గీతను మొత్తం చదవలేరు. అటువంటివారి కోసం ‘సప్తశ్లోకీ గీత’ని అయినా నిత్యం ఒక్కసారి పఠిస్తే చాలు. సమస్తల కోరికలు తీరతాయని ప్రతీతి. ‘మార్గశిర శుద్ధ ఏకాదశి’ నాడు ఆ శ్లోకాన్ని పఠిస్తే.. ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. పైగా ప్రతిఒక్కరూ ఈరోజు ఒక్క భగవద్గీత శ్లోకం అయినా చదివి తీరాలి అంటారు. ఎందుకంటే.. ఆరోజే శ్రీకృష్ణుడు భవద్గీతను అర్జునుడికి ఉపదేశించాడు. అందుకే.. ఆ రోజు గీతను చదివితే మంచి జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతుంటారు.

సప్తశ్లోకీ గీత :

ఓం మిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ |
యఃప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిమ్ ||

స్థానే హృషీకేశ! తవ ప్రకీర్త్యా, జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ |
రక్షాంసి భీతాని దిశో ద్రవంతి, సర్వే సమస్యంతి చ సిద్ధసంఘాః ||

సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖమ్ |
సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి ||

కవిం పురాణమనుశాసితారమణోరణీయాంసమనుస్మరేద్యః |
సర్వస్య ధాతారమచింత్యరూపం, ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ||

ఊర్ధ్వమూలమధశ్శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయమ్ |
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ||

సర్వస్య చాహం హృది సన్నివిష్టో, మత్తః స్మృతిర్‌జ్ఞానమపోహనంచ |
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో, వేదాంతకృద్వేదవిదేవ చాహమ్ ||

మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు |
మామేవైష్యసి యుక్వై మాత్మానం మత్పరాయణః ||

ఇతి శ్రీ మద్భగవద్గీతానూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం
యోగశస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే సప్తశ్లోకీ గీతా ||

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saptashloki gita  Bhagavad gita  lord Krishna Arjuna  Kurukshetra War  

Other Articles

  • Nitya paathana slokas in telugu

    రాహువు గ్రహ శాంతికై మంత్రం

    Jan 14 | గ్రహాలన్నిటిలోనూ, రాహు - కేతువులు ఇద్దరూ కూడా, మనమీద తీవ్ర ప్రభావాన్ని కలిగింపజేస్తూ ఉంటారు. ఎప్పుడూ, రాహువునీ, కేతువునీ శాంతింపజేయడమే మన ధర్మం. మనకర్ధంయ్యే రీతిలో చెప్పుకోవాలంటే, ఒక సమస్య ఒచ్చినప్పుడు, దాన్ని అశ్రద్ధ... Read more

  • Every day chanting slokas

    నిత్య పాఠణ శ్లోకం

    Jan 11 | "శివ శివ" అని మనస్పూర్తిగా ఒక్కసారి అంటే చాలు, ఇట్టే కరిగిపోయే సృష్టి కర్త, భోళా శంకరుడు... ఆయనెంత అమాయాకుడంటే, ఇంతా సృష్టి చేసి కూడా, ఆయనకంటూ ఎటువంటి భోగభాగ్యాలు అనుభవించడం తెలియనంత... అటువంటి... Read more

  • Guru matra is very special and spiritual mantra

    అమృత తుల్యం... గురు మంత్రం

    Jan 09 | మనకొచ్చే ఒక్కో ఆరోగ్యపరమైన సమస్యకు ఒక్కో ఔషధం మాత్రమే పని చేస్తుంది. అలాగే, నిత్య జీవితం లో మనం ఎదురుకునే ఒక్కో సమస్యకు, ఒక్కో మంత్రం మాత్రమే సంజీవినిలా, ఆ  సమస్యను ఎదురుకునేంతటి ఆత్మ... Read more

  • Chant this slokas for reciprocating marital

    అన్యోన్య దాంపత్యం కోసం

    Jan 07 | అన్యోన్యత స్థానంలో అసహనం... ఆత్మసంతృప్తి స్థానంలో ఆద్యంతం ఒకరి మీద ఇంకొకరికి అసంతృప్తి... ఎందుకు పెళ్లి చేసుకున్నామా అన్న చిరాకు... అయితే విడిపోవడం లేదా "చచ్చినట్టు" కలిసి ఉండటం... "వివాహం" పవిత్రత , ఈ... Read more

  • Chant these slokas for health and children

    నిత్య పఠణ శ్లోకాలు

    Jan 05 | ఆరోగ్యమైన సంతానం ప్రాప్తి కొరకు...సంతాన భాగ్యం కోసం తపించే దంపతుల సంఖ్య, గడిచిన అయిదు సంవత్సరాల్లో, గణనీయంగా పెరిగిపోయింది... ఎన్ని భాగ్యాలు ఉన్నా, సంతాన ప్రాప్తి కలుగకపోతే, ఆ వెలతి వర్ణాతీతం... మరోవైపు, సంతానం... Read more