కోయిలకొండ కోట
తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన దుర్గాలలో ఈ గిరిదుర్గం ఒకటి. గచ్చుగాని, మట్టిగాని వాడకుండా కోట గోడలను నిర్మించిన వైనం నిజంగానే ఆశ్చర్యకరం. అశ్వశాలలు, గజశాలలు, ధాన్యాగారాలు, నివాస గృహాలు అన్ని కూడా కొండమీదే నిర్మించారు. కోటలోని రెండతస్తుల రాణిమహల్, రాజు నీటి వినియోగానికి ఉపయోగించే గదితో పాటుగా కోటపై భాగంలో ఆలయ దుర్గాలను చూడొచ్చు.