Film Jokes
అనుకున్నదొకటి.. అయినదొక్కటి!

ఒక అబ్బాయి సినిమా ఇండస్ట్రీలో వెళ్లడానికి ఉర్రూతలూగుతుంటే.. అతని తండ్రి సినీ జీవితానికి, నిజ జీవితానికి గల మధ్య తేడాను వివరించాలని అనుకుంటాడు.

ఆ నేపథ్యంలోనే ఒక గ్లాసులో మంచి నీళ్లను, ఇంకొక గ్లాసులో మద్యం తీసుకున్నాడు. అలాగే రెండు పురుగులను తీసుకున్నాడు.

వీటన్నింటిని తీసుకుని తన కొడుకు దగ్గరకు తీసుకుపోతాడు ఆ తండ్రి.

తన కొడుకుకు చూపిస్తూ.. మంచినీరున్న గ్లాసులో ఒక పురుగును... మద్యం వున్న గ్లాసులో ఇంకొక పురుగును వేశాడు.

కొద్దిసేపు తరువాత మద్యం గ్లాసులో వున్న పురుగు చనిపోగా.. మంచినీరు గ్లాసులో వున్న పురుగు బ్రతికేవుండి తేలాడుతోంది.

అప్పుడు తండ్రి తన కొడుకుతో.. ‘‘సినిమా జీవితం అంటే ఈ మద్యం లాంటిది.. నిజ జీవితం అంటే ఈ మంచినీరు లాంటిది’’ అని చెబుతాడు.

చివరగా ఆ తండ్రి తన కొడుకుతో.. ‘‘దీనిని చూసి నీకేం అర్థమయ్యింది’’ అని అడుగుతాడు.

అప్పుడు కొడుకు.. ‘‘మందు తాగితే మనక్కూడా పురుగులు అంటుకోవన్నమాట! అంటే సినిమా ఇండస్ట్రీలో మనకూ ఎవరూ పోటీరారు’’

అనుకున్నదొకటి.. అయినదొక్కటి!

మందు షాపు ఎప్పుడు ఓపెన్ చేస్తారు?

ఒకరోజు తాగుబోతు రమేష్ రాత్రి 12 గంటల సమయంలో మందు షాపు ఓనర్ కి ఫోన్ చేసి ఇలా అంటాడు...
తాగుబోతు రమేష్ : నువ్వు మందు షాపు ఎప్పుడు ఓపెన్ చేస్తావ్?
మందుషాపు ఓనర్ : ఉదయం 9 గంటలకు ఓపెన్ చేస్తాను!
మరికొద్దిసేపు తరువాత తాగుబోతు రమేష్ మందుషాపు ఓనర్ కి ఫోన్ చేస్తాడు.
తాగుబోతు రమేష్ : నువ్వు మందు షాపు ఎప్పుడు ఓపెన్ చేస్తావ్?
మందుషాపు ఓనర్ : అరె చెప్పానుగా ఉదయం 9 గంటలకు అని!
మరికొద్దిసేపు తరువాత తాగుబోతు రమేష్ మళ్లీ షాపు ఓనర్ కి ఫోన్ చేస్తాడు.
తాగుబోతు రమేష్ : అన్నయ్యగారు.. మీరు మీ షాప్ ని ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు?
మందుషాపు ఓనర్ : నీయబ్బా.. నీకెన్నిసార్లు చెప్పాలిరా. ముందు చెప్పానుగా ఉదయం 9 గంటలకు ఓపెన్ చేస్తానని. ఎందుకు నస పెడుతున్నావు. ఉదయం 9 గంటలకు షాప్ కి వచ్చి.. నీకు కావాల్సిన బ్రాండ్ ని తీసుకెళ్లు!
తాగుబోతు రమేష్ : ఒరేయ్ వెధవ సన్నాసి... నేను నీ షాప్ లోపలే వుండి ఫోన్ చేస్తున్నానురా తింగరోడా!

నీయబ్బా.. ఇందులో ఏముంటాయ్ రా!

ఒకరోజు ఒక హీరో కథలు చదవడానికని ఒక గ్రంథాలయానికి వెళతాడు. 

అక్కడున్న చాలా పుస్తకాలను చూసి.. కొద్దిసేపు ఆలోచిస్తాడు. తరువాత అందులో నుంచి ఒక పుస్తకాన్ని తీసుకుంటాడు. 

అందులో కథ ఎలా వుంటుందా అని పుస్తకం మొత్తం అయిపోయేంతవరకు చదివాడు. 

అయిపోయిన తరువాత హీరో ఆ గ్రంథాలయంలో వున్న లైబ్రేరియన్ కి పుస్తకాన్ని ఇస్తూ.. ఇలా అంటాడు. 

హీరో : ఈ బుక్ లో కేవలం క్యారెక్టర్స్, వాళ్ల ఫోన్ నెంబర్లు తప్ప స్టోరీ ఏమీ లేదు. ఏ వెధవ రాశాడో!

అక్కడున్న లైబ్రేరియన్ ఒక్క సెకను కూడా ఆలోచించకుండా హీరో చెంప మీద ఛెళ్లుమని వాయిస్తాడు. తరువాత ఇలా అంటాడు. 

లైబ్రేరియన్ : ఓరీ నీచుడా, నికృష్టుడా, తెలివిలేని వెధవ... టెలిఫోన్ డైరెక్టరీలో నీకు స్టోరీ ఎక్కడి నుంచి వస్తుందిరా దద్దమ్మ. నువ్వు ఈ జన్మలో మారవురా బాబు.

నేను వెయిట్ తగ్గాలనుకుంటున్నా...!

ఒకరోజు బాలకృష్ణ తన బరువును తగ్గించుకోవడానికి డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. 

బాలకృష్ణ : ‘‘డాక్టర్ గారూ.. నేను బరువు తగ్గాలనుకుంటున్నా.. ఏం చేయాలో చెబుతారా?’’

డాక్టర్ : ‘‘అలా అయితే మీరు రోజూ 8 కిలోమీటర్ల వరకు పరుగెత్తాలి. అలా 300 రోజులు పరుగెత్తితే 34 కిలోగ్రాముల బరువును తగ్గించుకోవచ్చు’’ అని చెబుతాడు. 

దాంతో బాలయ్య తన పరుగును మొదలుపెడతాడు. 

మొత్తం 300 రోజుల తరువాత బాలకృష్ణ తన బరువును తగ్గించుకొని.. డాక్టర్ ను పిలుస్తాడు. 

బాలకృష్ణ : ‘‘డాక్టర్ గారు నేను నా బరువును తగ్గించుకున్నా.. మీరు ఒకసారి వచ్చి నన్ను చెకప్ చేయండి.. కానీ ఒక చిన్న ప్రాబ్లమ్!’’

డాక్టర్ : ‘‘ఏంటి ఆ ప్రాబ్లమ్?’’

బాలకృష్ణ : ‘‘నేను ఇప్పుడు ఇంటి నుంచి 2400 కిలోమీటర్ల దూరంలో వున్నా’’

‘‘రిన్’’ ఇస్తుంది తెల్లగా నిగారించే చర్మం!

కట్రినా (katina), కరీనా (karina), జరీన్ (zarine)....

వీళ్లు ముగ్గురు ఇంత తెల్లగా వుంటారో మీకు తెలుసా.....

.....

.....

.....

ఆలోచించండి.. ఆలోచించండి....

.....

.....

.....

ఎందుకంటే.. వీరి ముగ్గురు పేర్లలో రిన్ (RIN) పౌడర్ వుంది కాబట్టి.. 

(kaRINa, katRINa, zaRINe)...

‘‘రిన్’’ ఇస్తుంది తెల్లగా నిగారించే చర్మం!

ఇంకో పెళ్లికి పిలుస్తాను

డైరెక్టర్ : ‘‘మీరు మీ పెళ్లికి నాకు కనీసం ఫోన్ లో అయినా ఆహ్వానం పంపలేదు.. ఎంత బాధపడ్డానో తెలుసా..’’

సినీ తార : ‘’అయ్యో సారీ అండి... ఏమి అనుకోవద్దు.. మళ్లీ పెళ్లి చేసుకున్నప్పుడు తప్పకుండా పిలుస్తా.. ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోను’’ అంటోంది. 

నేను చెప్పింది చేశావా..?

స్వామీ : ‘‘తాగుడు మానుకోవడానికి నేను నీకు కొన్ని యోగాసనాలు నేర్పించాను కదా..! అవేమైనా ఉపయోగపడ్డాయా’’ అన్నాడు స్వామి. 

మందుబాబు : ‘‘ఆహా.. చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడ్డాయి స్వామి.. నేనిప్పుడు తలక్రిందులుగా వుండికూడా తాగగలుగుతున్నాను’’ అని ఉత్సాహంగా చెప్పాడు.