Watermelon facepacks and beauty benefits

watermelon facepacks, watermelon beauty tips, watermelon beauty care, beauty care, beauty tips, beauty care tips, watermelon beauty, beauty tips, facepacks, face masks

watermelon facepacks and beauty benefits

పుచ్చకాయతో ఫేస్ ప్రయోజనాలు..

Posted: 11/04/2014 06:48 PM IST
Watermelon facepacks and beauty benefits

సౌందర్యాన్ని మెరుగుపర్చుకోవడానికి కావల్సిన పోషక విలువలు, ఇతర ఔషధాలు చాలావరకు ప్రకృతిలో లభించే కొన్ని ఆహారపధార్థాల్లో లభ్యమవుతాయని ఇదివరకే చాలాసార్లు తెలుసుకున్నాం. అందులోకూడా ఒక్కొక్క పదార్థంలో సౌందర్యానికి కావాల్సిన ఒక్కొక్క పోషకం అందుబాటులో వుంటాయి. అటువంటివాటిల్లో పుచ్చకాయ ఎంతో అమోఘంగా పనిచేస్తుంది. ఇది కేవలం అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో నేచురల్ గానే బ్యూటీ కంటెంట్స్ చాలా వుంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ అధిక మోతాదులో వుంటాయి. అలాగే ఇందులో వాటర్ కంటెంట్ 95 శాతంకంటే ఎక్కువగా వుంటుంది. ఇటువంటి పుచ్చకాయతో కొన్ని ఫేస్ ప్యాక్ లను తయారుచేసుకుని, ప్రతిరోజూ అమలు చేస్తే.. అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.

1. వాటర్ మెలోన్ ఫేస్ మాస్క్ : పుచ్చకాలోని విత్తనాలను పూర్తిగా తీసేసి, మెత్తగా చేయాలి. దీన్ని ఫేస్ ప్యాక్ గా వేసుకొనే ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి తర్వాత అప్లై చేయాలి. 15నిముషాలు అలాగే ఉంచిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

2. పుచ్చకాయ-తేనె : పుచ్చకాలోని గింజలు తీసేసి, మెత్తగా చేసుకోవాలి. అందులో తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 15నిముషాలు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడంవల్ల డ్రైగా వుండే స్కిన్ తేమగా మారుతుంది.

3. పుచ్చకాయ-పెరుగు : పెరుగును బాగా బీట్ చేసి తర్వాత అందులో పుచ్చకాయ జ్యూస్ ను వేసి మిక్స్ చేయాలి. అప్పుడు ఈ మిశ్రమం మరింత రెడ్ గా తయారవుతుంది ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు అప్లై చేసి 10 నిముషాలు అలాగే ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి . ఇందులోని ల్యాక్టిక్ యాసిడ్, ఎంజైమ్స్  చర్మాన్ని ఎక్స్ ఫ్లోయేట్, శుద్ది చేస్తుంది.

4. వాటర్ మెలోన్-షుగర్ : పుచ్చకాయను బాగా చిదిమి అందులో షుగర్ వేసి ముఖాన్ని అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి. 5 నిముషాలు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ చర్మ రంధ్రాలను తెరచుకొనేలా చేసి ప్రకాశవంతంగా మార్చుతుంది.

5. పుచ్చకాయ-పాలు : ముందుగా కొద్దిగాపాలు తీసుకుని అందులో పుచ్చకాయ జూస్ ను కలపాలి. అనంతరం ముఖానికి అప్లై చేసుకుని 10 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మాన్ని క్లీన్ చేసి, చర్మరంధ్రాలను ఓపెన్ చేస్తుంది.

6. పుచ్చకాయ-కీరదోసకాయ : పుచ్చకాయ, కీరదోసకాయ రసాన్ని పెరుగు, పాలపౌడర్ మిక్స్ చేసి, ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. 10నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

7. పుచ్చకాయ-అరటి పండు : వాటర్ మెలోన్ వుండే ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్, మరో ప్రక్క అరటిపండులో విటమిన్ బి2, బి6 మరియు బి12 అధికంగా ఉండి ఇది స్కిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఇది చర్మం కాంతివంతంగా తేమగా, సాఫ్ట్ గా మొటిమలు లేని చర్మాన్ని అందిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : watermelon facepacks  beauty tips  health tips  telugu news  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more