the biography of kodavatiganti kutumbarao who named as famous telugu writer in literary sector | telugu famous writer

Biography of kodavatiganti kutumbarao who is telugu famous wirter

kodavatiganti kutumbarao, kodavatiganti kutumbarao life history, kodavatiganti kutumbarao biography, kodavatiganti kutumbarao life story, telugu famous writers, telugu writers history, telugu literatures, telugu literary sector

biography of kodavatiganti kutumbarao who is telugu famous wirter : the biography of kodavatiganti kutumbarao who named as famous telugu writer in literary sector.

‘కొకు’గా సుపరిచితుడైన ప్రసిద్ధ తెలుగు రచయిత

Posted: 11/02/2015 07:03 PM IST
Biography of kodavatiganti kutumbarao who is telugu famous wirter

తెలుగు రచయితల్లో సుప్రసిద్ధ చెందినవారిలో కొడవటిగంటి కుటుంబరావు ఒకరు. సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శించి, విమర్శించి, సుసంపన్నం చేసేదే సరైన సాహిత్యంగా భావించిన ఆయన.. ఆ తరహాలోనే ఎన్నో రచనలు చేశారు. తన యాభై ఏళ్ళ రచనా జీవితంలో పన్నెండువేల పేజీలకు మించిన రచనలు చేసిన ఆయన.. ‘చందమామ పత్రిక’ను చందమామగా తీర్చిదిద్దిన అగ్రగణ్యుడు. ఈయన తన పేరుకంటే ‘‘కొకు’’ అనే పొడి అక్షరాల ద్వారా పేరుగాంచారు.

జీవిత చరిత్ర :

1909 అక్టోబర్ 28వ తేదీన గుంటూరు జిల్లా తెనాలిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఈయన తన చిన్నవయస్సులోనే తల్లిదండ్రుల్ని కోల్పోవడంతో మేమమామ వద్దే పెరిగాడు. పాఠశాల చదువును 1925 వరకు కొనసాగించారు. ఉన్నత విద్య పూర్తికాకముందే 11 ఏళ్ల పద్మావతితో ఆయన పెళ్లి జరిగింది. గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో ఇంటర్మీడియేట్ పూర్తిచేసిన అనంతరం.. 1927-29 కాలంలో మహారాజా కళాశాల, విజయనగరంలో బి.ఏ. ఫిజిక్సు చదివారు. ఈ కాలంలోనే రచనా వ్యాసంగాన్ని మొదలుపెట్టాడు. కవి - రచయిత అయిన అన్నయ్య వెంకటసుబ్బయ్య ద్వారా ఈయన సాహితీ రంగప్రవేశం జరిగింది.

బి.ఏ. చదువుకుంటున్న సమయంలో 1930లో కొకు తొలిరచన ‘‘సినిమా’’ ఓరియంటల్ వీక్లీలో ప్రచురితమైంది. తర్వాత ఆయన మొదటికథ ‘‘ప్రాణాధికం’’ గృహలక్ష్మి మాసపత్రికలో అగ్రస్థానంలో పేరుగాంచింది. బతుకుదెరువు ఆయన 1931లో కొంతకాలంపాటు వరంగల్లులో పిల్లలకు ప్రైవేట్లు చెప్పారు. తర్వాత ఆయన చక్రపాణి, పిల్లలమర్రి బాలకృష్ణశాస్త్రి, పిల్లలమర్రి సాంబశివరావులతో కలిసి యువ ప్రెస్‌ను స్థాపించి ‘‘యువపత్రిక’’ను ప్రారంభించారు. అంతా సాఫీగానే సాగుతున్న తరుణంలో కొన్ని ఆరోగ్య కారణాల వల్ల ఆయన భార్య పద్మావతి 1939లో మరణించింది. ఆ బాధతో కొంతకాలం కుంగిపోయిన ఆయన.. తిరిగి 1940-42 మధ్య కాలంలో ఆంధ్ర పత్రికలో పనిచేశారు. 1942లో నాలుగు నెలలపాటు ఒక మెటలు కర్మాగారంలోనూ, 1942 జూలై నుండి 1943 జనవరి మధ్య సిమ్లాలో జాతీయ యుద్ధ ప్రచారక సమితిలో కాపీరైటరుగా పనిచేసాడు.

1944లో ఒరిస్సా జయపూరులో ఇన్స్పెక్టరేట్ ఆఫ్ మెటల్ అండ్ స్టీల్‌లో ఆర్నెల్ల పాటు ఫోర్మనుగా పనిచేసాడు. ఈ కాలంలోనే ఆయన రెండవ పెళ్ళి చేసుకొన్నాడు. కానీ ఆమె కూడా రెండు నెలలకే అనారోగ్యంతో మరణించడంతో 1945లో మూడవ పెళ్ళి చేసుకున్నాడు. 1948లో మూణ్ణెల్లపాటు బొంబాయి ఎయిర్ ఇండియా కార్యాలయంలో ఎకౌంట్సు క్లర్కుగా పనిచేసాడు. 1948లో ఆంధ్రపత్రిక దినపత్రికలో చేరి 1950-51లో వారపత్రిక సంపాదకత్వం నిర్వహించాడు. అదే సంవత్సరం సినిమా వారపత్రిక సంపాదకత్వం కూడా నిర్వహించాడు. తర్వాత 1952 నుండి చనిపోయే వరకూ చందమామలో పనిచేసి.. ఆ పత్రిక అత్యున్నత స్థితికి రావటానికి ఎంతో సహాయసహకారాలు అందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kodavatiganti kutumbarao  telugu literary sector  telugu famous literatures  

Other Articles