The Biography Of Ramineni Ayyanna Chowdary Who Is A Famous Social Worker | Indian Famous Social Worker

The biography of ramineni ayyanna chowdary who is a famous social worker

Ramineni Ayyanna Chowdary, Ramineni Ayyanna Chowdary life story, Ramineni Ayyanna Chowdary biography, Ramineni Ayyanna Chowdary history, indian social workers, social workers, indian farmers

The Biography Of Ramineni Ayyanna Chowdary Who Is A Famous Social Worker : The Biography Of Ramineni Ayyanna Chowdary Who Is A Famous Social Worker. He Educate Modern Technology To Farmers

వ్యవసాయదారులకు ఆధునిక పద్దతులపై అవగాహన కల్పించిన ‘దాత’

Posted: 10/14/2015 06:13 PM IST
The biography of ramineni ayyanna chowdary who is a famous social worker

రైతుల పరిస్థితులు ఏ విధంగా వుంటాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పంటలు చేతికందనప్పుడు వారు అనుభవించే కష్టాలు చూడలేనివి, చెప్పలేనివి. తాను పస్తులుంటూ ఇతరులకు భోజనం పెట్టే రైతన్నకు ఎటువంటి ప్రాధాన్యత లేదు. ఇటువంటి సమాజంలో రైతన్నలకు తోడుగా నేనున్నానంటూ ముందుకొచ్చిన సంఘసేవకుల్లో రామినేని అయ్యన్న చౌదరి ఒకరు. ప్రముఖ విద్యావేత్త అయిన ఈయన.. రైతుల సంక్షేమం కోసం సాధ్యమైనంతవరకు కృషి చేశారు. అంతేకాదు.. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.

జీవిత విశేషాలు :

1929 అక్టోబర్ 12న గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరు గ్రామములో వీరయ్య చౌదరి, కన్యాకుమారి దంపతులకు రామినేని అయ్యన్న చౌదరి జన్మించారు. గుంటూరులోని విద్యాభ్యాసం పూర్తిచేసిన తర్వాత కాశీ హిందూ విశ్వవిద్యాలయం నుంచి గణితశాస్త్రంలో పట్టాపొందారు. అనంతరం తిరిగి గుంటూరుజిల్లా పాలపర్రు గ్రామంలో అధ్యాపకునిగా పనిచేశారు. విద్యమీద మమకారం ఎక్కువగా వున్న నేపథ్యంలో ఆయన 1955లో అమెరికా వెళ్లి విత్తశాస్త్రములో ఎం.ఎస్సీ, మిన్నసోటా విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. 1963 - 1973ల మధ్య నార్త్ లాండ్ కళాశాలలో, జేవియర్ విశ్వవిద్యాలయములో అచార్య పదవి నిర్వహించి మంచి అధ్యాపకునిగా పేరు తెచ్చుకున్నారు.

సాంఘిక సేవలు :

సమాజంలో జరుగుతున్న  అన్యాయాలను అరికట్టే భాగంలో ఆయన 1973లో పదవీ విరమణ చేసి సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనాలని చివరి నిర్ణయానికి వచ్చారు. జన్మభూమిపై వున్న మమకారంతో ఆయన బ్రాహ్మణకోడూరు గ్రామములో ‘‘సంగీత సాహిత్య, సంస్కృతీ హిందూ ధర్మనిలయం’’ స్థాపించారు. గ్రామంలోని వ్యవసాయదారులకు ఆధునిక పద్ధతుల గురించి అవగాహన, శిక్షణ మొదలగు సేవాకార్యక్రమాలు చేశారు. హైదరాబాదులో హిందూస్తాన్ థెరప్యూటిక్స్ అను సంస్థను ప్రారంభించి రైతులకు పశువుల మందులు, మేత తయారు చేయించారు. మిన్నసోటా హిందూ సంఘము స్థాపించి హిందూ సంస్కృతి, కళలు, పండుగలు, సాంఘిక సేవా కార్యక్రమాలు జరిపారు. సమాజంకోసం తనవంతు సహాయాన్ని అందించి, ఇతరులకు ఆదర్శంగా నిలిచిన అయ్యన్న.. 2000 ఏప్రిల్ 24వ తేదీన మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramineni Ayyanna Chowdary  Social Workers  Indian Farmers  

Other Articles