The Biography Of Milkha Singh Who Is Known As Flying Sikh | Indian Runners | Indian Famous Players

Milkha singh biography the flying sikh indian army

Milkha Singh biography, Milkha Singh history, Milkha Singh life story, Milkha Singh updates, Milkha Singh wikipedia in telugu, Milkha Singh flying sikh, indian flying sikh, Milkha Singh life biography, indian famous players, indian runners

Milkha Singh Biography The Flying Sikh Indian Army : The Biography Of Milkha Singh also known as The Flying Sikh, is a former Indian track and field sprinter who was introduced to the sport while serving in the Indian Army. He was the only Indian male athlete to win an individual athletics gold medal at a Commonwealth Games until Vikas Gowda won the discus gold medal.

పరాభావం నుంచి విజయతీరాల వరకు..

Posted: 10/08/2015 06:32 PM IST
Milkha singh biography the flying sikh indian army

మిల్ఖా సింగ్.. అత్యంత ప్రతిభావంతుడైన క్రీడాకారుడు. ఒక సిక్కు రాథోడ్ రాజపుత్రుల కుటుంబంలో జన్మించిన ఈయనకు బాల్యం నుంచే ఎన్నో పరాభావాల్ని ఎదుర్కోవల్సి వచ్చింది. దేశ విభజన సమయంలో తన కుటుంబసభ్యుల మరణాన్ని ప్రత్యక్షంగా చూసిన ఈయన ఎన్నో కష్టనష్టాలు, అవమానాలు భరించాల్సి వచ్చింది. అంతెందుకు.. ఈయన జీవితం ఎంత దుర్భరంగా సాగిందంటే.. ఒకానొక దశలో దొంగగా మారాలని నిర్ణయించుకున్నాడు కూడా! అటువంటి పరిస్థితుల్లో వున్న ఈయనను అన్నయ్య సహకారంతో భారత సైన్యంలో చేరి.. అక్కడ తన ప్రతిభా చాటుకున్నాడు. అప్పటివరకు పరుగేంటో కూడా తెలియని ఈయన.. ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఫ్లయింగ్ సిఖ్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు గడించాడు. దేశ విభజన సమయంలో అనాథగా మారిన మిల్ఖా సింగ్, తరువాత కాలంలో భారతదేశపు ప్రసిద్ధ క్రీడా చిహ్నంగా అవతరించాడు. ఎన్నో మెడల్స్ సాధించి భారతదేశం ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పాడు.

జీవిత విశేషాలు :

1935వ సంవత్సరంలో మిల్ఖాసింగ్ 15 సంతానం కలిగిన ఒక సిక్కు రాథోడ్ రాజపుత్రల కుటుంబంలో జన్మించాడు. అందులో 8 మంది సంతానం దేశ విభజనకు ముందు చనిపోగా.. విభజన సమయంలో జరిగిన హింసకాండలో తన తల్లిదండ్రులతోపాటు ఒక సోదరుడిని, ఇద్దరు సహోదరీమణులను పోగొట్టుకున్నాడు. కొంతకాలం తర్వాత పాకిస్తాన్ నుండి భారత్ కు రైలులో వచ్చాడు. 1947లో పంజాబ్ రాష్ట్రంలో హిందువులు, సిక్కుల ఊచకోత తీవ్రంగా జరుగుతున్నప్పుడు ఈయన ఢిల్లీకు వలస వెల్లిపోయాడు. ఆ తరువాత తన సోదరి ఇష్వర్ వద్ద నివసించాడు. ఓ సందర్భంలో మిల్ఖా సింగ్ టిక్కెట్టు లేకుండా రైలులో ప్రయాణం చేసినందుకు పోలీసులు ఆయన్ను తీహార్ జైలులో బంధించారు. అప్పుడు ఇష్వర్ తన తమ్ముడిని విడిపించుకోవడానికి తన దగ్గర వున్న కొంత నగదును అమ్మి విడుదల చేయించింది. అంతేకాదు.. ఇంకా ఎన్నో దుర్భర పరిస్థితుల్ని మిల్ఖా సింగ్ ఎదుర్కొన్నాడు.

అలాంటి దుర్భరమైన జీవితంతో విసిగిపోయిన మిల్ఖాసింగ్.. దోపిడి దొంగగా మారాలని నిశ్చయించుకున్నాడు. కానీ.. తన సోదరుడు మల్ఖన్ ఆయన్ను ఒప్పించి భారత సైన్యంలో చేర్పించాడు. 1951లో ఆయనకు తన 4వ ప్రయత్నంలో సికింద్రాబాద్ లోని ఎలెక్ట్రికల్ - మెకానికల్ ఇంజినీరింగు కేంద్రంలో ప్రవేశం లభించింది. కాలక్రమేణా తను క్రీడలకు పరిచయమయ్యాడు. కొత్తగా నియమితులైన సైనికులందరికీ తప్పనిసరైన ఒక జాతీయ స్థాయి పరుగుల పోటీని భారత సైన్యం నిర్వహించగా, ఆ పోటీల్లో మిల్ఖా సింగ్ 6వ స్థానంలో ముగించాడు. దాంతో భారత సైన్యం అతనికి వ్యాయామ క్రీడలలో ప్రత్యేక శిక్షణ కల్పించింది. తనను క్రీడలకు పరిచయం చేసిన భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఇంకొక విషయం ఏమిటంటే.. బాలుడి వున్నప్పుడు ఈయన తన పాఠశాలకు రాను, పోను 10 కిలోమీటర్ల దూరం పరుగెత్తేవాడు. ఆ అలవాటే ఆయన్ను పరుగు పోటీల్లో విశ్వవిజేతగా నిలిచిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

క్రీడా జీవితం :

పరుగు క్రీడల్లోకి ఎంట్రీ ఇచ్చిన మిల్ఖాసింగ్.. 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్ లో జరిగిన 200, 400 మీటర్ల పరుగుల పోటీలకు భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించాడు. అయితే.. ప్రధాన పోటీకి అర్హత సాధించలేకపొయాడు. 1958లో దేశంలోని కటక్ లో నిర్వహించిన జాతీయ క్రీడల్లో మిల్ఖా సింగ్ 200, 400 మీటర్ల పరుగుల పోటీల్లో స్వర్ణపతకం సాధించాడు. అదే సంవత్సరంలో జరిగిన ఆసియా క్రీడల్లో కూడా స్వర్ణపతకాన్ని గెలుపొందాడు. అలాగే.. 1958 బ్రిటిష్ సామ్రాజ్యం, కామన్వెల్త్ సమాఖ్య సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ క్రీడల్లో 46.6 సెకన్ల సమయంలో పరుగుల పోటీని పూర్తిచేసి స్వర్ణపతకాన్ని సాధించిన ఈయన.. స్వతంత్ర భారతదేశం తరపున బంగారు పతకం సాధించిన మొట్టమొదటి క్రీడాకారుడిగా కీర్తి గడించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Milkha Singh  indian flying sikh  indian famous players  

Other Articles