The Biography Of Vadapalli Venkateswara Rao Who Was First Civilian-military | keerthi chakra awards

Vadapalli venkateswara rao biography keerthi chakra award winner

vadapalli venkateswara rao, keerthi chakra award, telugu famous persons, indian army jawans, indian famous persons, civilian military people, civilian military members

vadapalli venkateswara rao biography keerthi chakra award winner : The Biography Of Vadapalli Venkateswara Rao Who Was First Civilian-military To Got Keerthi Chakra Award.

‘కీర్తిచక్ర’ పురస్కారం పొందిన మొదటి సైనికేతర పౌరుడు

Posted: 08/27/2015 05:39 PM IST
Vadapalli venkateswara rao biography keerthi chakra award winner

భారతదేశంలో వున్న అత్యున్నత పురస్కారాలలో ‘కీర్తిచక్ర’ రెండవది. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికాధికారులకు మాత్రమే ఈ విధమైన పురస్కారాన్ని అందజేస్తారు. కానీ.. ఓ సైనికేతర పౌరుడైన వాడిపల్లి వెంకటేశ్వరరావు మొట్టమొదటిసారిగా ఆ పురస్కారాన్ని పొందారంటే.. ఆయన ఏ విధమైన పదవీ బాధ్యతలు చేపట్టారో, ఎంత సమర్థవంతంగా తమ విధి నిర్వహించారో తెలుసుకోవాల్సిందే..!

వి.వి.రావు కీర్తిచక్ర పురస్కారం సాధించిన వైనం :

ఉన్నత విద్యను అభ్యసించిన ఈయనకు ప్రపంచదేశాలలో నిత్య ప్రయాణీకుడిగా ఉండాలనే కోరిక వుండేది. ఆ కోరిక మేరకే ఈయన ఇండియన్ ఫారిన్ సర్వీస్ ను ఎంపిక చేసుకున్నారు. తొలుత ఈయన జర్మనీలోని భారత రాయభార కార్యాలయంలో ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత శ్రీలంక, నేపాల్, భూటాన్, ఇండియా, అమెరికా వంటి దేశాలలో 1990 నుండి 2005 వరకు పనిచేశారు. ఆఫ్ఘనిస్తాన్ లోని రాయబార కార్యాలయంలో పనిచేయడానికి ఎందరో విముఖత చూపిన సమయంలో భారత ప్రభుత్వం ఆ పదవికి వి.వి.రావును నిర్ణయించింది. విధి నిర్వహణలో మంచి పట్టుదల, సమర్ధత కలిగిన అధికారిగా గుర్తింపు పొందిన ఆయన.. ప్రభుత్వం తన భుజస్కందాలపై వుంచిన బాధ్యతలను ఒక సవాలుగా తీసుకొని అక్కడ చేరారు.

అక్కడి కాబూల్ లోని భారత రాయబార కార్యాలయంలో కన్సులేట్ గా 3 సంవత్సరాలు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. 2008 జూలై 7వ తేదీన కాబూల్ లోని భారత రాయబార కార్యాలయం ముందు జరిగిన తీవ్రవాదుల ఆత్మాహుతి దాడిలో మొత్తం 41 మంది మృతి చెందగా.. అందులో భారత్ రక్షణ విభాగానికి చెందిన బ్రిగేడియర్ మెహతాతో పాటు మరో ముగ్గురు కార్యాలయ సిబ్బంది మరణించారు. వారితోపాటు మరణించిన వారిలో భారతీయ దౌత్యవేత్త అయిన 44 యేళ్ళ వాడపల్లి వెంకటేశ్వరరావు వున్నారు. ఆ విధంగా అమరులైన ఈయనకు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికాధికారులకు ఇచ్చే కీర్తిచక్ర పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఆ విధంగా కీర్తిచక్రతో గౌరవించబడిన మొట్టమొదటి సైనికేతర భారతీయుడిగా గుర్తింపు పొందారు.

వి.వి.రావు జీవిత విశేషాలు :

1963 ఆగష్టు 26వ తేదీన తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం నర్సిపూడి గ్రామంలో వాడపల్లి అప్పలాచార్యులు, సుభద్ర దంపతులకు వి.వి.రావు జన్మించారు. జన్మస్థలంలోనే ఎస్.ఎస్.సి. వరకు చదివిన ఆయన.. ఎ.పి.ఆర్.జె.సి. నాగార్జున సాగర్ లో ఇంటర్మీడియట్ పూర్తిచేశారు. చిన్నప్పటి నుంచే చదువులో చురుకుగా ఉండే ఈయన.. ఎంట్రన్స్ ద్వారా కర్నూలులో వుండే సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.ఎ.గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు.

1983 నుండి 1985 సం.లో హైదరాబాదులోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఆ తర్వాత ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి ఎం.పిల్ పూర్తిచేశారు. ఆ తర్వాత అదే విశ్వవిద్యాలయం నుండి ఆసియా దేశాలతో భారతీయ సంబంధాలు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ సంపాదించాడు. చివరికి ఇండియన్ ఫారిన్ సర్వీస్ ను ఎంపిక చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : vadapalli venkateswara rao  civilian military  Indian Famous people  

Other Articles