The Biography Of Bezawada Gopala Reddy Who Worked As Second CM Of Andhra Pradesh | Indian Politicians

Bezawada gopala reddy biography indian politician famous writer

Bezawada Gopala Reddy, gopala reddy history, gopala reddy life story, gopala reddy news, gopala reddy life history, indian politicians, andhra pradesh cm list, ap cm lists, andhra pradesh state history, telugu famous writers

Bezawada Gopala Reddy Biography Indian Politician Famous Writer : The Biography Of Bezawada Gopala Reddy Who was an Indian politician. He was Chief Minister of the erstwhile Andhra State and Governor of Uttar Pradesh.

ఆంధ్రరాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన గోపాల

Posted: 08/07/2015 06:28 PM IST
Bezawada gopala reddy biography indian politician famous writer

డా.బెజవాడ గోపాలరెడ్డి.. ఆంధ్రరాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. స్వాతంత్ర్య ఉద్యమ పోరాటాల్లో వీరోచిత వీరుడిగా పోరాడిన ఈయన.. బహుభాషావేత్త కూడా. పదకొండు భాషల్లో పండితుడైన ఈయన.. ఎన్నో రచనలు రాశారు. అంతేకాదు.. పరిపాలనాదక్షుడుగా, కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రిపదవులు, ఉత్తర ప్రదేశ్ కు గవర్నర్ గా, రాజ్యసభ సభ్యుడుగా పనిచేశారు. సాహితీ, రాజకీయ రంగాలలో తనదైన విశిష్ట స్థానాన్ని స్థాపించుకుని, 90 సంవత్సరాల నిండు జీవితాన్ని గడిపిన పూర్ణపురుషుడు.

జీవిత విశేషాలు :

1907 ఆగష్టు 7వ తేదీన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో పట్టాభిరామిరెడ్డి, సీతమ్మ దంపతులకు గోపాలరెడ్డి జన్మించారు. తన సొంత ఊరిలోనే కళాశాల చదువు పూర్తి చేసిన ఈయన.. ఆ తర్వాత బందరు జాతీయ కళాశాలలో చేరారు. 1927లో శాంతినికేతన్ లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో స్నాతకోత్తర విద్యను పూర్తి చేశారు. ఒక వైపు జాతీయోద్యమం మరోవైపు సాహిత్యపిపాస రెండూ ఈయన జీవనంలో పెనవేసుకున్నాయి. రవీంద్రుని గీతాంజలిని తెనిగించిన సాహితీవేత్త. తిక్కవరపు రామిరెడ్డిగారి కుమార్తె లక్ష్మీకాంతమ్మను వివాహమాడారు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మొత్తం 186 నెలలకాలంలో ఈయన వివిధ రాజకీయ పదవులను సమర్థవంతంగా నిర్వహించారు.

రాజకీయ జీవితం :

బ్రిటీష్ ఇండియాలో వారికి వ్యతిరేకంగా జరిపిన స్వాతంత్ర్య పోరాటాల్లో గోపాలరెడ్డి పాల్గొన్నారు. జాతీయోద్యమంలో పాల్గొని చెరసాలల్లో సంవత్సరాల తరబడి గడిపారు. 30 సంవత్సరాలు నిండకముందే రాజాజీ మంత్రివర్గంలో అవిభక్త మదరాసు రాష్ట్రంలో మంత్రి అయ్యారు. మంత్రి అయిన తర్వాతే ఈయన తిక్కవరపు రామిరెడ్డిగారి కుమార్తె లక్ష్మీకాంతమ్మను వివాహమాడారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పడినపుడు 1955లో ముఖ్యమంత్రి అయ్యారు. 1956లో విశాలాంధ్ర ఏర్పడినపుడు హైదరాబాదు రాజధానిగా ఉపముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ కేంద్రంలో మంత్రిగా ఆహ్వానించి రెవిన్యూ మంత్రిని చేశారు. అనంతరం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను అప్పగించారు. ఐదేళ్ళపాటు ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా వ్యవహరించారు. ఈ విధంగా ఆయన మొత్తం 186 నెలలకాలంలో వివిధ రాజకీయ పదవులు నిర్వహించారు.

సాహితీ రంగంలో గోపాలరెడ్డి పాత్ర :

1946 నుండి తెలుగుభాషా సమితి అధ్యక్షులుగా వ్యవహరించిన ఆయన.. ఆ తర్వాత 1957-82 అంటే 25 సంవత్సరాలపాటు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షులుగా పనిచేశారు. 1978 నుండి కేంద్ర సాహిత్య అకాడమీ కార్యనిర్వాహక సభ్యులు. 1963 నుండి ఎనిమిదేళ్ళు జ్నానపీఠ అధ్యక్షులు. అనేక భాషలలో సన్నిహిత పరిచయం గల గోపాలరెడ్డి రవీంద్రుని గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. తొలుత అనువాదాలతో ప్రారంభమై డెబ్బయివ ఏట స్వతంత్ర రచనలు మొదలుపెట్టారు. 1978లో తొలి స్వీయ కవితాసంపుటి వెలువరించారు. గోపాలరెడ్డి నోబెల్ బహుమతి గ్రహీతయైన రవీంద్రనాథ్ ఠాగూర్ వ్రాసిన ఊర్వశి, గీతాంజలి వంటి పలు రచనలను తెలుగులోకి అనువదించారు. ఈయన 1997 మార్చి 9వ తేదీన తుదిశ్వాస విడిచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bezawada Gopala Reddy  Indian Politicians  Famous Telugu Writers  

Other Articles