The Biography Of Gummadi Venkateswara Rao | Famous Actors | Telugu Film Industry

Gummadi venkateswara rao biography famous actor telugu film industry

Gummadi Venkateswara Rao, Gummadi Venkateswara Rao biography, Gummadi Venkateswara Rao history, Gummadi Venkateswara Rao life story, Gummadi Venkateswara Rao wikipedia, Gummadi Venkateswara Rao photos, gummadi life story, telugu actors, telugu famous actors, tollywood old actors

Gummadi Venkateswara Rao Biography Famous Actor Telugu Film Industry : The Biography Of Gummadi Venkateswara Rao widely known as Gummadi, was an Indian film actor and producer, known for his works predominantly in Telugu cinema and a few Tamil films. Known as a character actor.

తెలుగు చిత్రపరిశ్రమలో ‘గుమ్మడి’గా పేరొందిన వెంకటేశ్వరరావు

Posted: 07/09/2015 12:20 PM IST
Gummadi venkateswara rao biography famous actor telugu film industry

తెలుగు సినిమారంగంలో చెరగని ముద్ర వేసుకున్న నటీనటుల్లో గుమ్మడి వెంకటేశ్వరరావు ఒకరు. ఐదు దశాబ్దాలపాటు 500 సినిమాల్లో విభిన్న తరహా పాత్రలు పోషించిన ఈయన.. ఎన్నో అవార్డులు, రివార్డులు పొందారు. తన నటనాప్రతిభతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన.. యువతర నటులకు నిదర్శనంగా నిలిచారు. చలనచిత్ర రంగానికి ఈయన చేసిన సేవలకుగాను ‘కళాప్రపూర్ణ’ బిరుదును పొందారు.

జీవిత విశేషాలు :

1927 జూలై 9వ తేదీన గుంటూరు జిల్లా తెనాలి సమీపములోని రావికంపాడు గ్రామంలో జన్మించారు.  ఈయన తండ్రి బసవయ్య, తల్లి బుచ్చమ్మ. వీరిది ఒక సామాన్య రైతు కుటుంబం. తన స్వగ్రామంలోనే గుమ్మడి విద్యాభ్యాసం ప్రారంభవిద్య నుండి స్కూల్ ఫైనల్ వరకు కొల్లూరు ఉన్నత పాఠశాలలో జరిగింది. అక్కడ ఆయన ఎస్.ఎస్.ఎల్.సి దాకా చదివాడు. ఈయన ఉన్నత విద్యను అభ్యసించాలని ఎంతగానో పట్టుబడినా.. కుటుంబసభ్యులు అందుకు నిరాకరించి ఆయన 17వ ఏటలో 1944లో లక్ష్మీ సరస్వతితో వివాహం జరిపించారు. ఆ తర్వాత అత్త సహకారంతో ఈయన గుంటూరు హిందూకాలేజ్‌లో ఇంటర్ (1944-1946) చదువారు. అయితే.. ఇంటర్ పరీక్షల్లో ఫెయిలవ్వడంతో విద్యాభ్యాసం జీవితం నుంచి తప్పుకుని.. వ్యవసాయపు పనుల్లో మునిగిపోయారు.

సినీ జీవితం :

రంగస్థల నాటకాల్లో గుమ్మడికి ఎంతో అనుభవం వుంది. సినిమాల్లోకి రావాలన్న ఆశతోనే ఆయన రంగస్థలం నాటకాల్లో నటించేవారు. ఇండస్ట్రీలో తనకు ఓ అవకాశం రాదా..? అన్న భావనతో ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశారు. చివరికి ఆ అవకాశం రానే వచ్చింది. ఈయన సినీప్రవేశం ‘అదృష్ట దీపుడు’ (1950) సినిమాతో జరిగింది. ఈ సినిమా తర్వాత ఆయన నటించిన ఐదారు సినిమాల తర్వాత చిన్నపాత్రలే లభించాయి. తనకు గుర్తింపునిచ్చే పాత్రలు లభించకపోవడంతో తిరిగి వెళ్లాలని భావించిన సమయంలో ఈయనకు ఎన్టీరామారావుతో పరిచయం కలిగింది. ఆయన తన చిత్రంలో మంచి పాత్ర ఇస్తానని వాగ్దానం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీ రామారావు ఆయనకు ‘పిచ్చిపుల్లయ్య’ చిత్రంలో ప్రతినాయక పాత్ర ఇప్పించారు.

గుమ్మడి చిన్నచిన్న వేషాలతో కాలం వెళ్లదీస్తున్న సమయంలో ఆయన సినీజీవితాన్ని మలుపు తిప్పే పాత్ర లభించింది. ‘అర్ధాంగి’ చిత్రంలో ఈయనకు జమీందారు వేషం లభించింది. ఆచిత్ర ఘన విజయం కారణంగా చలచిత్ర రంగానికి గంభీరమైన తండిపాత్రల నటుడు లభించాడని అంతా భావించారు. నిజానికి.. ఆ చిత్రంలో శాంతకుమారి కంటే గుమ్మడి 8 ఏళ్ల చిన్నవాడు. అయినప్పటికీ తన ప్రతిభతో ఆ పాత్రకు తాను తప్పే మరెవ్వరు సరిపోరన్నంత అద్భుతంగా నటించారు. ఆ తరువాత ఆయన వెనుచూడకుండా నటజీవితంలో ముందుకు సాగారు. పౌరాణిక, జానపద, చారిత్రిక, సాంఘిక చిత్రాలన్నిటిలోనూ పాత్రలు పోషించారు. దశరధునిగా, భీష్మునిగా, ధర్మరాజుగా, కర్ణునిగా, సత్రాజిత్, బలరాముడు, భృగుమహర్షి, మొదలైన పౌరాణిక పాత్రలు ధరించారు.

ఇలా ఈ విధంగా ఆయన ఐదుదశాబ్దాలపాటు చిత్రపరిశ్రమలో కొనసాగి.. 500కు పైగా సినిమాల్లో నటించారు. గుమ్మడి చివరిసారిగా 2008 సంవత్సరంలో విడుదలైన ‘జగద్గురు శ్రీ కాశీనాయని చరిత్ర’ సినిమాలో కాశీనాయన పాత్ర పోషించారు. ఆ తర్వాత ఈయనకు ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ.. ఆధునిక చిత్రసీమ పోకడ నచ్చక నటనకు దూరంగా ఉన్నారు. ఈయన అద్వితీయ నటనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘రఘుపతి వెంకయ్య’ అవార్డునిచ్చి సత్కరించింది. అలాగే.. చలనచిత్ర రంగానికి ఈయన చేసిన సేవలను గుర్తిస్తూ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. ఈయన 2010లో తన 82వ ఏటలో తుదిశ్వాస విడిచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gummadi Venkateswara Rao  Telugu film industry  telugu old famous actors  

Other Articles

Today on Telugu Wishesh