Yuri gagarin biography russian soviet pilot cosmonaut

yuri gagarin news, yuri gagarin biography, yuri gagarin history, yuri gagarin wikipedia, yuri gagarin life story, yuri gagarin photos, yuri gagarin medals, yuri gagarin death, yuri gagarin

yuri gagarin biography Russian Soviet pilot cosmonaut : The biography of yuri gagarin who create the history by travel in the space as first person.

అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడు

Posted: 03/10/2015 05:55 PM IST
Yuri gagarin biography russian soviet pilot cosmonaut

ప్రపంచంలో ఇంకా విజ్ఞానపరిజ్ఞానం అంతగా లేని సమయంలో విమానప్రయాణం చేయడం అంటేనే ఒక పెద్ద సాహసం చేసినట్లుగా కొందరు భావించేవారు. గాలిలో ప్రయాణం కాబట్టి.. ఏమవుతుందోనన్న భయాందోళనతో చాలామంది అసలా ప్రయాణం చేసేవారు కాదు. అటువంటి రోజుల్లో ఏకంగా అంతరిక్షంలోకి వెళ్లి మొట్టమొదటి మానవుడిగా చరిత్రపుటలకెక్కాడు యూరీ గగారిన్!

1961 ఏప్రిల్ 12వ తేదీన అంతరిక్షంలోకి వెళ్ళి చరిత్ర సృష్టించిన ఈ వ్యోమగామి.. భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించినవాడుగానూ రికార్డులకెక్కాడు. అంతేకాదు.. ఇతను మొదటి సోవియట్ కూడా! ఇలా అంతరిక్షంలోకి ప్రయాణించినందుకు ఇతనికి ప్రపంచంలోని అనేక దేశాలు రకరకాల పతకాలు, బహుమానాలు ఇచ్చి గౌరవించాయి. రష్యన్లు ఇతడిని సోవియట్ హీరోగా పరిగణిస్తారు.

జీవిత చరిత్ర :

1934 మార్చి 9వ తేదీన రష్యా దేశంలోని క్లుషినో ప్రాంతంలో జన్మించాడు. బాల్యం నుంచే చాలా చురుకుగా వుండే గగారిన్.. చదువులో మంచి ప్రతిభ కనబరిచాడు. పాఠశాల, కళాశాలలో అందరి స్టూడెంట్స్ కంటే ఇతను అన్ని రంగాల్లోనూ ముందుండేవాడు.

అంతరిక్ష యాత్ర :

1961 ఏప్రిల్ 12వ తేదీన గగారిన్ అంతరిక్షంలో ప్రవేశించిన మొట్టమొదటి మానవుడిగా చరిత్రకెక్కాడు. ఇతడు ప్రయాణించిన అంతరిక్ష నౌక వోస్టోక్ 3KA-2 (వోస్టోక్ 1). అంతరిక్షంలో ఇతడి మొదటి మాట సంకేతం 'కెడ్ర్'. తన ప్రయాణంలో ప్రసిద్ధ గీతం "ద మదర్ ల్యాండ్ హీయర్స్, ద మదర్ ల్యాండ్ నోస్" అంతరిక్షంలో పాడాడు.

ఆ కాలంలో మీడియాలో గగారిన్ వ్యాఖ్య గురించి ఓ వార్త సంచలనాన్ని సృష్టించింది. "నేను యే దేవుడినీ ఇక్కడ చూడడం లేదు" అని గగారిన్ అంతరిక్షంలో అన్నట్టు కథనం. కానీ, అంతరిక్ష నౌకలో 'వెర్బాటిమ్ రికార్డర్' లో అలాంటి వ్యాఖ్యలు గాని శబ్దాలు గాని లేవు.

మరణం :

గగారిన్ వ్యోమగాముల శిక్షణా స్థలి స్టార్ సిటీ లో ఉప-శిక్షణాధికారిగా నియమితుడయ్యాడు. అదే సమయంలో ఇతను ఫైటర్ పైలట్ గా తిరిగీ అర్హతపొందేందుకు ప్రయత్నించసాగాడు. మార్చి 27 1968, చకలోవ్‌స్కీ ఎయిర్ బేస్ నుండి శిక్షణా విమానంలో ఎగురుతూ వుండగా.. ఇతను, ఇతని శిక్షకుడు వ్లాదిమీర్ సెరిఓజిన్ మిగ్ -15UTI విమానం కిర్జాచ్ పట్టణం వద్ద కూలిపోయి మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yuri gagarin biography  famous cosmonaut in world  

Other Articles