Banda kanaka lingeswara rao biography

banda kanaka lingeswara rao history, banda kanaka lingeswara rao wiki, banda kanaka lingeswara rao biography, banda kanaka lingeswara rao life story, banda kanaka lingeswara rao story, banda kanaka lingeswara rao photos

banda kanaka lingeswara rao biography : he is a great actor who leaves his law post for acting. he never give up in his life untill he got best position in industry.

నాట్యకళా పోషకుడిగా పేరొందిన న్యాయవాది..

Posted: 01/22/2015 08:02 PM IST
Banda kanaka lingeswara rao biography

నచ్చిన పని చేయడంలో ఎంతో సంతోషం దొరుకుతుందని ప్రతిఒక్కరూ అంటుంటారు. జీవితంలో ఎన్ని కష్టాలు వున్నాసరే.. వాటిని ఎదుర్కొంటూ నచ్చిన గమ్యస్థానానికి చేరుకోవడంలో ఎంతో తృప్తి లభిస్తుంది. అయితే.. పరిస్థితులకు అనుగుణంగా చాలామంది తమ కోరికలను చంపుకుని చాలా కష్టంగా బతుకుతుంటారు. ఏదో కోల్పోయామన్న ధ్యాసతోనే జీవితాన్ని గడిపేస్తారు గానీ.. తమ సంతోషాన్ని పూర్తి చేసుకోవడంలో చాలామంది వెనుకుండిపోతారు. ఎందుకంటే.. భయం వారిని అలా ఓడించేస్తుంది. తమ సంతోషం నేరవేర్చుకోవడంలో ఎక్కడ విఫలమవుతామోనన్న భయంతో ముందడుగు వేయరు.

కానీ.. మరికొందరు మాత్రం తమ జీవితాన్ని పనంగా పెట్టిమరీ తమ సంతోషాన్ని వెదుకుతూ ముందుకు సాగుతారు. అలాంటి వ్యక్తుల్లో బందా కనకలింగేశ్వరరావు ఒకరు. జీవితంలో అన్ని లభించినప్పటికీ తన నచ్చిన పనిని వెతుక్కుంటూ తన గమ్యంవైపు అడుగులు వేసిన ఈయన.. ఎన్నో కష్టనష్టాలను అనుభవించి అందనంత ఎత్తుకు ఎదిగారు. జీవితాంతం సుఖంగా బ్రతికడానికి కావలసిన వృత్తిని తనకు లభించినప్పటకీ.. అందులో సంతోషం లభించకపోవడంతో దానిని వదిలేసి అతను ప్రేమించిన కళనే ఎన్నుకొన్నారు. మొదట్లో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా.. తన గమ్యస్థానం చేరేవరకు పట్టుదలను వదలలేదు. అదే ఆయనను సుప్రసిద్ధ వ్యక్తిగా తీర్చిదిద్దింది.

బందా కనకలింగేశ్వరరావు జీవిత చరిత్ర :

ఈయన సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, నాటక ప్రయోక్త, నాట్యకళా పోషకుడు. అప్పట్లో ఈయనకు నాటకాల మీద ఎంత మక్కువ వుండేదంటే.. తనకు ఎంతో ఇష్టమైన న్యాయవాది వృత్తిని వదులుకునిమరీ ఆ రంగంలో ప్రవేశించారు. మొదట్లో ఎన్నో పరాభావాలు ఎదురైనా.. వెనుదిరిగి చూడకుండా తన గమ్యస్థానాన్ని చేరాలనే పట్టుదలతో ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ కష్టఫలితమే ఆయనను ఒక గొప్ప స్థానంలో నిల్చోబెట్టాయి.

బాల్యం - విద్యాభ్యాసం : 1907 జనవరి 20వ తేదీన కృష్ణా జిల్లాలోని ఆటపాక గ్రామంలో జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన అనంతరం బందరు నోబుల్ కళాశాల చదివారు. ఆ తర్వాత  మద్రాసు లా కళాశాల నుండి 1932 లో బి.ఎల్. పట్టా పుచ్చుకున్నారు. ఇలా పట్టాపొందని తరువాత 1934లో న్యాయవాదిగా వృత్తిలో చేరారు. అయితే.. అప్పటికే ఆయనకు నాటకరంగంలో రాణించాలనే ఆసక్తి వుండేది. దాంతో కేవలం కొన్నాళ్ల తరువాత న్యాయవాది వృత్తిని వదిలేసి.. నాటక ప్రదర్శనమే వృత్తిగా ఎంచుకున్నారు.

నాటకరంగంలో ప్రవేశం : నాటకరంగంలో ప్రవేశించిన అనంతరం మొదట్లో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే అందివచ్చిన ప్రతిఒక్క పాత్రలో ఒదిగిపోతూ తన ప్రతిభను నిరూపించుకుంటూ దూసుకెళ్లారు. దర్శకులు ఏ పాత్ర ఇచ్చినా కాదనకుండా అందులో పూర్తి లీనమైపోయి తన ప్రతిభతో ముగ్ధుల్ని చేసేవారు. ఈయన చేసిన నాటకాల్లో బాహుకుడు, బిల్వమంగళుడు స్వయంగా ఆయనకు ఇష్టమైనవి. ఇలా తనను తాను అద్భుత కళాకారుడిగా నిరూపించుకున్న ఈయన.. రంగస్థలం నుంచి సినిమాల్లో అడుగు వేశారు. బాల నాగమ్మ, ద్రౌపదీ మానసంరక్షణం, పాదుకా పట్టాభిషేకం, సారంగధర తదితర చిత్రాల్లో నటించారు.

సేవా కార్యక్రమాలు : ఈయన కేవలం నాట్యకళా పోషకుడు మాత్రమే కాదు.. మంచి సేవకుడు కూడా! ముఖ్యంగా ఈయన కూచిపూడి నాట్యకళకు ఎనలేని సేవచేశారు. ప్రభుత్వ సాయంతో కూచిపూడి గ్రామంలో సిద్ధేంద్ర కళాక్షేత్రం నెలకొల్పి నిర్వహించారు. దీని గురించి అప్పట్లో ప్రముఖ పత్రికలలో వ్యాసాలు రాసి దాని ప్రాధాన్యాన్ని అందరికీ తెలియజేశారు. 1956లో ఆకాశవాణిలో నాటక ప్రయోక్తగా పనిచేసి మంచి నాటకాలను, నాటికలను ప్రసారం చేశారు. ఇక తన స్వగ్రామంలో ఒక శివాలయాన్ని, ఒక చెరువును తవ్వించడంతోబాటు ఒక వేద పాఠశాలను స్థాపించారు.

చివరగా... ఇలా ఈ విధంగా నాట్యరంగంలో నాట్యకళా పోషకుడిగా నిరూపించుకోవడంతోపాటు సేవాకార్యక్రమాలను చేపట్టినందుకు.. 1964లో  కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును గెలుపొందారు. దీంతోపాటు ఉత్తమ నటనకు రాష్ట్రపతి అవార్డు కూడా లభించింది. అయితే ఆరోగ్య కారణాల రీత్యా ఈయన 1968 డిసెంబర్ 3న తుదిశ్వాస విడిచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : banda kanaka lingeswara rao  great telugu actors  tollywood news  

Other Articles

Today on Telugu Wishesh