Jyotirao phule biography caste discrimination freedom fighter

jyotirao phule biography, jyotirao phule life history, jyotirao phule story, jyotirao phule wikipedia, jyotirao phule wikipedia in telugu, jyotirao phule caste discrimination, freedom fighters, indian freedom fighters, savitri phule, jyotirao phule savitri phule

jyotirao phule biography Caste discrimination freedom fighter

‘కులవివక్ష’కు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ తత్తవేత్త

Posted: 11/28/2014 12:16 PM IST
Jyotirao phule biography caste discrimination freedom fighter

ప్రస్తుత భారతదేశంలో కులవివక్ష ప్రభావం అంతగా లేదుగానీ.. 19,20వ శతాబ్దకాలాల్లో చాలా ఎక్కువగానే వుండేది. ఆనాడు కాలాల్లో కులంపేరుతో ఎంతోమంది బడుగు - బలహీనవర్గాలు ప్రజలు ఎన్నోరకాలుగా అణిచివేతకు గురయ్యేవారు. సమజాంలో ఇతరుల్లాగా వారికి సమానహక్కులు వుండేవికావు. ఇటువంటి కులవివక్ష సంస్కృతీ భారతదేశంలో మరింతగా పెరిగిపోతున్న సందర్భంలో కొందరు మహనీయులు అందుకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించారు. సమాజంలో ప్రతిఒక్కరికీ సమానహక్కులు వుండాల్సిందేనంటూ ఎంతోమంది గళం విప్పారు. కులపేరుతో తరతరాలుగా అణిచివేయబడుతున్న బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి కృషి చేశారు. అటువంటివారిలో ‘జ్యోతిరావ్ ఫులే’ ఒకరు.

సామాజిక తత్వవేత్త, ఉద్యమకా రుడు, సంఘసేవకుడైన ఫూలే.. దేశంలో కులవివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడాడు. స్త్రీలకు విద్య నిషేధమని ప్రవచించిన ‘‘మనుస్మృతి’’ని తిరస్కరించి, మహిళలకు అండగా నిలిచాడు. వారిక్కూడా సమాజంలో పురుషుల్లాగే స్వేచ్ఛగా జీవించే హక్కువుందని పేర్కొన్న ఆయన.. స్త్రీల విద్యకోసం ఎంతగానో పాటుపడ్డాడు. అలాగే ఆనాడు వున్న బానిసత్వపు సంస్కృతీని పూర్తిగా తరిమికొట్టాలనే ఉద్దేశంతో తనవంతు కృషి చేశాడు. మానసిక బానిసత్వం నుండి శూద్రులను కాపాడాలని త్రితీయ రత్న అనే నాటకాన్ని రచించాడు. సమాజంలో పాతుకుపోయిన ఆచారాలను, మూఢ నమ్మకాలను ఖండించాడు.

జీవిత చరిత్ర :

1827 ఏప్రిల్‌ 11న మహారాష్టల్రోని పూణే జిల్లాలో ఖానవలి ప్రాంతంలో యాదవ కులానికి చెందిన కుటుంబంలో జోతిరావ్‌ ఫూలే జన్మించాడు. తల్లి ఇతనికి 9 నెలల పసిప్రాయంలోనే చనిపోయింది. ఆయన తండ్రి గోవిందరావు మొదట్లో కూరగాయలు అమ్మేవాడు కానీ.. కాలక్రమేణా పూలవ్యాపారం చేయడంవల్ల వారి ఇంటిపేరు ‘ఫూలే’గా మార్పు చెందింది. 7 ఏళ్ల వయస్సున్నప్పుడు ఫూలే ఒక మరాఠీ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించాడు. అయితే కుటుంబ పరిస్థితులు సరిగ్గాలేనందుకు వెంటనే చదువు మానేసి తన తండ్రికి వ్యవసాయ పనుల్లో సహాయపడాల్సి వచ్చింది. ఈయనకు 13 ఏళ్ల వయసులోనే సావిత్రి ఫులేతో వివాహం జరిగింది. అతి తక్కువ కాలం పాఠశాలకు వెళ్ళినప్పటికీ ఫూలేకి పుస్తక పఠనం పట్ల ఆసక్తి ఎక్కువగా వుండేది. అయితే ఆయనకు చదువుపట్ల వున్న ఆసక్తిని గమనించిన ఒక ముస్లిం టీచర్.. ఇంటి ప్రక్కనే వుండే ఒక క్రైస్తవ పెద్దమనిషి జ్యోతిరావ్‌ తండ్రిని ఒప్పించి ఆయన విద్యాభ్యాసం కొనసాగేలా చేశారు.

చిన్నప్పుడునుంచే మానవ హక్కుల ప్రాథమిక సూత్రాలపై జ్ఞానాన్ని సంపాదించుకున్న ఫూలేకు శివాజీ అంటే అభిమానం ఎక్కువ. శివాజి, జార్జ్‌ వాషింగ్టన్‌ల జీవితచరిత్రలు ప్రభావితం చేయడంవల్ల దేశభక్తి, నాయకత్వ గుణాలు ఆయనకు అలవాటయ్యాయి. 1848లో జరిగిన తన బ్రాహ్మణ స్నేహితుడి వివాహంలో ఫూలే.. బిసి ‘మాలి’ కులానికి చెందిన వాడవడం వల్ల కులవివక్షకు గురయ్యాడు. ఇక ఆ క్షణంనుండి కులవివక్షపై పోరాడాలని ఆయన నిశ్చయించుకున్నాడు. కుల విధానంలో ఆయన బ్రాహ్మణులను విమర్శించడమే కాకుండా సమాజంలో వారి ఆధిపత్యాన్ని వ్యతిరేకించాడు. బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకించవలసినదిగా సామాన్యుల్ని ప్రోత్సహించాడు. అలాగే స్ర్తీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని భావించిన ఆయన.. స్ర్తీలు విద్యావంతులు కావాలని నమ్మాడు. అలా ఆలోచించిన మరుక్షణమే ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ముందుగా తన భార్య సావిత్రిని పాఠశాలకు పంపాడు.

తరువాత ఆయన ఒక పాఠశాలను స్థాపించి.. అందులో అన్ని కులాలకు చెందినవారిని, అంటరానివాళ్లకు ప్రవేశం కల్పించాడు. అయితే కులవివక్ష కారణంగా ఆనాడు ఎవరూ బోధించడానికి ముందుకురాకపోవడంతో తన భార్య సహాయంతో పిల్లలకు పాఠాలు బోధించేలా చేశాడు. అయితే పాఠశాల నిర్వహణలో అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం వల్ల కొంతకాలంపాటు పాఠశాలను మూసివేశాడు. అయినా పట్టు వదలక తన మిత్రుల సహాయంతో పాఠశాలను పునఃప్రారంభించాడు. 1851-52లో మరో రెండు పాఠశాలలు స్థాపించాడు. బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రాథమిక విద్యను నిర్లక్ష్యం చేయడాన్ని ఫూలే విమర్శించేవాడు. ఇలా ఈవిధంగా మహిళలకు విద్యను అందించడంలో ఆయన తనవంతు కృషి అందించారు.

ఇక ఆనాడు బాల్యవివాహాలు చాలానే జరిగేవి. ఆనాడు ముసలివారికిచ్చి పెళ్ళి చేయడంవల్ల చిన్నతనంలోనే మహిళలు వితంతువులయ్యేవారు. అయితే వీరు మళ్ళీ వివాహం చేసుకోవడానికి సమాజం అంగీకరించేదికాదు. అటువంటి సంస్కృతికి భిన్నంగా ఆయన గళం విప్పాడు. వితంతు పునర్వివాహాలను గురించి ఫూలే ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి... స్వయంగా వితంతువులకు వివాహాలు జరిపించేవాడు. అలాగే 1864లో గర్భస్రావ వ్యతిరేక కేంద్రాన్ని స్థాపించి, వితంతువులైన గర్భిణీ స్ర్తీలకు అండగా నిలిచాడు. అలాగే శూద్రులను బ్రాహ్మణ చెర నుండి కాపాడాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ఆయన 1873 సెప్టెంబర్‌ 24న సత్య శోధక సమాజాన్ని స్థాపించాడు. దేశంలోనే ఇది మొట్టమొదటిసంస్కరణోద్యమం. కుల, మత వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి సభ్యత్వం కల్పించేవారు.

విగ్రహారాధనను ఖండించాడు... స్ర్తీ, పురుషుల మధ్య లింగవివక్షను ఫూలే విమర్శించాడు... సమానత్వం, స్వేచ్ఛ, ఐకమత్యంతో కూడిన సమసమాజాన్ని కాంక్షించాడు.  1853లో వితంతు మహిళల అనాథ శిశువుల కోసం సేవాసదనం ప్రారంభించాడు. 1869లో ‘పౌరోహిత్యం యొక్క బండారం’ పుస్తక రచన చేశాడు. 1871 సత్యశోధక సమాజం తరపున ‘దీనబంధు’ వార పత్రిక ప్రారంభించాడు. 1880లో భారత ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమ పితామహుడు లొఖాండేతో కలసి రెైతులను, కార్మికులను సంఘటితం చేసేందుకు ప్రయత్నించాడు. 1873లో ‘గులాంగిరి’ (బానిసత్వం) పుస్తకం ప్రచురించాడు. 1883 కల్టివేటర్స్‌ విప్‌కార్డ్‌ (సేద్యగాడిపెై చెర్నకోల) పుస్తక రచన పూర్తిచేశాడు. 1888లో మున్సిపాలిటీ అధ్యక్షునికి మధ్యం షాపులను మూసి వేయవలసిందిగా ఉత్తరం వ్రాశాడు. ఆయన వ్రాసిన 33 ఆర్టికల్స్‌ గల ‘‘సార్వజనిక్‌ సత్యధర్మ’’ పుస్తకంలో కుటుంబ సృష్టి నియమాల గురించి వివరిస్తూ ప్రపంచం మొత్తాన్ని ఒక కుటుంబంగా వ్యక్తీకరించాడు.

ఇలా ఈ విధంగా సమాజంలో వెనుకబడిన ప్రజలు, మహిళల అభ్యున్నతికోసం చేసినకృషికి ఆయనకు ‘మహాత్మ’ బిరుదు ఇచ్చారు. అయితే దీర్ఘకాల జబ్బుతో బాధపడుతూ నిరంతరం సమసమాజ స్థాపన కోసం పరితపించిన మహాత్మ ఫూలే 1890 నవంబరు 28న కన్నుమూశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles