Krishnam raju birthday celebration

Krishnam Raju Birthday Celebration, Rebel Star Krishnam Raju birthday, Krishnam Raju Birthday Party, Uppalapati Venkata Krishnam Raju, Krishnam Raju Birthday Press Meet

Krishnam Raju Brithday Celebrations

రౌద్ర రసానికి చిరునామా క్రిష్ణంరాజు

Posted: 01/20/2014 03:03 PM IST
Krishnam raju birthday celebration

(Image source from: రౌద్ర రసానికి చిరునామా క్రిష్ణంరాజు)

పేరొందిన క్రిష్ణంరాజు తెలుగు తెరకు ఒక కొత్త ఒరవడిని తీసుకువచ్చారు. రౌద్ర స్వరూపాన్ని ప్రత్యేకంగా ఆవిష్కరింపజేయడంలో క్రిష్ణంరాజు అందెవేసిన చేయి. 1940 జనవరి20 న జన్మించిన క్రిష్ణంరాజు 1966 నుండి ఈనాటి వరకూ సుమారు 183కు పైగా తెలుగు సినిమాల్లో నటించారు.

1966లో తొలిసారిగా చిలక గోరింక అనే తెలుగు సినిమాతో తెలుగ పరిశ్రమలో కాలు పెట్టారు. దీనికి ప్రముఖ దర్శకుడు ప్రత్యేగాత్మ రూపొందిచారు. ఇప్పటి వరకూ క్రిష్ణంరాజు 5 ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు ఫిల్మఫేర్ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డు, రెండుసార్లు నంది అవార్డులను అందుకున్నారు. రాజకీయాల్లోనూ రాణించిన క్రిష్ణంరాజు 1990లో భారతీయ జనతా పార్టీలో చేరారు. అనంతరం నర్సాపురం నుంచి పోటీచేసి విజయం సాధించారు. వాజ్ పాయి బిజెపి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగానూ పనచేశారు.

ఈ పదవిలో క్రిష్ణంరాజు 1999నుంచి 2004 వరకూ ఉన్నారు. తరువాత 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఈనేపధ్యంలోనే రాజమండ్రి నుంచి ఎంపి స్థానానికి పోటీ చేయగా , టిడిపి నుంచి మురళీ మోహన్ బరిలోకి దిగారు. అయితే వీరిద్దరూ కాంగ్రెస్ నుంచి పోటీచేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇక క్రిష్ణంరాజు అందుకున్న అవార్డుల విషయానికొస్తే 1977లో అమరదీపం చిత్రం, 1984లో బొబ్బిలి బ్రహ్మన్న, 1986లో తాండ్రపాపా రాయుడు, 1988లో అంతిమ తీర్పు చత్రాలకు గాను ఫిల్మ్ ఫేర్ అవార్డులలో ఉత్తమ నటునిగా ఎంపికయ్యారు. ఇక నంది అవార్డుల విషయానికొస్తే 1977లో అమరదీపం, 1984లో బొబ్బిలి బ్రహ్మన్న చిత్రాలకు అవార్డులు దక్కించుకున్నారు. కాగ క్రిష్ణంరాజు సోదరుని కుమారుడు ప్రభాస్ తెలుగు సినిమాల్లో రాణిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles