Tollywood legend comedian ramana reddy special

comedian ramana reddy, old famous telugu comedy star ramana reddy, padmanabham ramana reddy, nelluru ramana reddy, comedy kings–ramana reddy

Tollywood legend comedian Ramana Reddy special

'నవ్వుల మాంత్రికుడు ' రమణా రెడ్డి !

Posted: 05/22/2013 04:24 PM IST
Tollywood legend comedian ramana reddy special

ఆరడుగుల పొడవు , అరంగుళం మందం , ఇవి రామణా రెడ్డి చుట్టు కొలతలు . అందరూ సన్నివేశాలలో హాస్యాన్ని పండిస్తే , ఆయన ఆయన చేసిన అన్ని పాత్రలకే హాస్యపు పూత పూసారు . కామెడీ విలన్ గా , తన మాట తీరు తో , చతురోక్తులతో , సందర్భోచితమైన నటన తో , డైలాగ్ ని ఏదో అప్పచెప్పినట్టు కాక , మన ముందే చాలా సహజంగా మాట్లాడుతున్నారా అన్న తీరు గా , హాస్యం పండించడానికి ప్రత్యేకించి ఏ హావ భావాలూ కాక , తన పాత్ర లోనే హాస్యాన్ని సహజంగా ఒలకబోసి , గొప్ప హాస్య నటుడిగా ఎప్పటికీ గుర్తుండిపోతారు , రమణా రెడ్డి .

శరీరాన్ని ఎటు పడితే అటు , రబ్బర్ లా తిప్పే మ్యానరిసం , నెల్లూరు యాసలో వినగానే నవ్వు ఒచ్చే విధంగా మాట్లాడటం , రమణా రెడ్డి గారి ప్రత్యేకత . ఈయన శరీర తీరుకి తగ్గట్టు , సూర్యాకాంతం వంటి భారీ పెర్సెన్యాలిటీ , తెరపై గయ్యాళి గా పేరుమోసిన నటీమణులకు , భయం తో వణికి పోయే పీల భర్త పాత్రల్లో రమణా రెడ్డి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో చేసిన నటన , అందరినీ అమితంగా ఆకట్టుకుంది .

రమణా రెడ్డి గారి ముఖం లోనే , కళ్ళల్లోనే హాస్యం కనిపిస్తుంది . 'మాలపిల్ల' తో వెండితెరకు పరిచయం అయ్యారు ఈ నటులు . కాని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది మాత్రం , 'మిస్సమ్మ' వంటి చిత్రాల తోనే . నెల్లూరు లో స్యానిటరీ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగ బాధ్యతలని నిర్వహిస్తోన్న రమణా రెడ్డి గారికి , సినిమాల పైనా , నటన పైనా మోజు పెరిగింది , చేస్తున్న ఉద్యోగం మానేసి మదరాసు చేరారు . ఎన్ని కష్టాలు , ఎదురు దెబ్బలు చుట్టుముట్టినా , తాను అనుకున్నది సాధించారు , నటుడిగా రంగ ప్రవేశం చేసారు , హాస్య నటుడిగా ఎదిగారు , హాస్య రసాన్ని పాత్రకు తగ్గట్టు పండించే విలక్షణ నటుడిగా వెలిగిపోయారు , తెలుగు చిత్ర సీమ ఉన్నంత కాలం ప్రేక్షకులకు గుర్తుండిపోతారు . ఎదుట ఎలాంటి నటులు ఉన్నా , తనదైన శైలిలో హాస్యాన్ని ఒలకబోయటం రమణా రెడ్డి గారి ప్రత్యేకత . ఈయన నటన 'గుండమ్మ కధ ' వంటి సినిమాల్లో తారాస్థాయిలో ఎలివేట్ అవుతుంది . తోటి హాస్య నటులు 'రేలంగి' వంటి వారితో ఆరోగ్యమైన పోటీ మధ్యలో నటించి తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు .

రమణా రెడ్డి గారి పాత్రల తీరు తెన్నులు కూడా ఎంతో గమ్మత్తుగా ఉంటాయి . ప్రపంచంలో లేని సమస్యలను సృష్టించుకుని , ఆ సమస్యలతో కొట్టుమిట్టాడుతూ , ఇటువంటి తరహా సంఘటనలతో హాస్యాన్ని పండించడం , రమణా రెడ్డి గారి పాత్రల ప్రత్యేకత . మరి ఇలాంటి పాత్రలని పోషించగలిగింది , నటన శైలి నుండి హావ భావ తీరు వరకు , ఈ పాత్రలకు సరిగ్గా సరిపోయేటట్టు ఉండే రమణా రెడ్డి గారు . అందుకే ఈ నటుడికి నవ్వుల మాంత్రికుడు అన్న బిరుదు కూడా ఉంది , తెలుగు చిత్ర పరిశ్రమలో .

కామెడీ విలన్గా కూడా ఎన్నో సినిమాల్లో హాస్యం పండించారు రమణా రెడ్డి గారు . విలన్ కు పక్కనే ఉంటూ , గుంటనక్కలా సలహాలు అందించే పాత్రలు రమణా రెడ్డి గారి కరియర్ లో ఎన్నో . ఈయన నటుడిగా చేసిన తరువాతి తరం సినిమాల్లో కూడా , ఈయన పాత్రలను ప్రేరణగా తీసుకుని ఎన్నో కమీడీ విలన్ పాత్రలు రాయబడ్డాయి , రాయబడుతున్నాయి , ఎందరో నటులు , కామెడీ విలన్లుగా చిత్ర పరిశ్రమలో గుర్తింపు పొందారు , పొందుతున్నారు కూడా .

ఏదో చాన్స్ వచ్చింది కదా అని నటించడం కాక , ఒచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని , తన కంటూ ప్రత్యెక పాత్రాలు , వాటి ద్వారా యెనలేని ప్రేక్షక అభిమానం , గుర్తింపు సంపాదించుకున్న నటుడు చిత్ర సీమకో 'ఆణిముత్యం' రమణా రెడ్డి గారు .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles