Mallemala sundara rami reddy vardhanthi

Mallemaala Sundara Rami Reddy, Telugu producer Mallemaala, M.S.Reddy, Mallemaala Vardhanthi, M.S.Reddy Vardhanthi

Mallemaala Sundara Rami Reddy, popularly known as M.S. Reddy, who produced several star-studded movi-es and penned numerous hit songs, passed away on Sunday at his Filmnagar residence here after a prolonged illness. He was 87.

mallemala sundara rami reddy Vardhanthi.png

Posted: 12/11/2012 06:29 PM IST
Mallemala sundara rami reddy vardhanthi

mallemala-sundara-rami-reddతెలుగు సినిమా పరిశ్రమకు ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలు, పాటలు, పద్యాలు అందించి తెలుగు వారి గుండెల్లో చిరస్మరణీయంగా మిగిలిపోయిన మల్లెమాల సుందర రామిరెడ్డి డిసెంబర్ 11, 2011న మరణించాడు. ఈయన మొదటి వర్థంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహానుభావుడి గురించి కొన్ని విషయాలు నెమరు వేసుకుందాం.

మల్లెమాల సుందరరామిరెడ్డి నెల్లూరు జిల్లా వెంకటగిరి తాలూకాలోని అలిమిలి అనే మారుమూల గ్రామంలో 1924 ఆగస్టు 15న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు రంగమ్మ, రామస్వామిరెడ్డి. ఆయనకు నలుగురు తమ్ముళ్లు, ఒక చెల్లెలు. ఎమ్మెస్ రెడ్డి ఇంటిపేరు.. 'మన్నెమాల'. అయితే అందులో అర్థం కనిపించక 'మల్లెమాల'గా మార్చుకున్నారు. మాస్టారు చెప్పిన పద్యాల్ని ఒకసారి విని వెంటనే వాటిని ఒక్క తప్పు పోకుండా పఠించి చిన్నతనంలోనే ఏక సంథాగ్రాహిగా  పేరొందారు.  కొన్ని ఆర్థిక కారణాల వల్ల ఆయన చదువు ఆగిపోవడంతో నాగలిపట్టి దుక్కి దున్నారు. ఆ తర్వాత వ్యవసాయం అర్ధంతరంగా ఆగిపోవడంతో ఉన్న ఊళ్లో నెలకు ఎనిమిది రూపాయల జీతం మీద మైకా డిపోలో ఉద్యోగిగా చేరాడు. కొన్ని రోజులకు జీతం వద్ద యజమానితో విభేదం తలెత్తి ఇంకెవరి వద్దా పనిచేయకూడదని నిర్ణయించుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేశారు. అలా సంపాదించిన డబ్బుతో ఎగ్జిబిటర్‌గా సినీ రంగంలోకి అడుగుపెట్టి గూడూరులో సుందరమహల్ అనే థియేటర్‌ను నిర్మించి, 1963 డిసెంబర్‌లో ప్రారంభించారు.

1964లో వ్యాపార నిమిత్తం మద్రాసు వెళ్లినప్పుడు అనుకోకుండా 'కుమరిప్పెణ్ ' అనే తమిళ సినిమా చూశారు. ఆ సినిమా నచ్చి, రూ.60 వేలకు డబ్బింగ్ హక్కులు కొన్నారు. కౌముది ఆర్ట్ పిక్చర్స్‌ను స్థాపించి, 'కుమరిప్పెణ్'ను 'కన్నెపిల్ల'గా డబ్‌చేసి, 1966 డిసెంబర్ 26న తన బ్యానర్‌పై విడుదల చేశారు. ఆ తర్వాత 'కొంటెపిల్ల', 'కాలచక్రం' అనే డబ్బింగ్ చిత్రాలు విడుదల చేసిన ఆయన 1968లో శోభన్‌బాబు, వాణిశ్రీ జంటగా 'భార్య' చిత్రాన్ని నిర్మించి, స్ట్రయిట్ సినిమాల నిర్మాతగా మారారు. ఆ సినిమా బాగా ఆడింది. ఆ తర్వాత లాభనష్టాలకు అతీతంగా ఎమ్మెస్ రెడ్డి అనేక చిత్రాల్ని నిర్మించారు. వాటిలో.. 'శ్రీకృష్ణ విజయం', 'ఊరికి ఉపకారి', 'కోడెనాగు', 'ఏకలవ్య', 'పల్నాటి సింహం', తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, అమ్మోరు, జూనియర్ ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేస్తూ తీసిన 'రామాయణం' చిత్రాలు ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టాయి. 'అంకుశం'లో ముఖ్యమంత్రిగా నటించి, నటుడిగానూ తన సత్తా చాటారు. చిత్రసీమకు చెందిన అనేక సంఘాలకు ఎమ్మెస్‌రెడ్డి తన సేవల్ని అందించారు. తెలుగు సినిమాకు చేసిన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు.

రచయితగా ఎమ్మెస్‌రెడ్డి తెలుగు భాషకు చేసిన సేవ అపారం. 'మల్లెమాల రామాయణం', 'వృషభ పురాణం', 'నిత్య సత్యాలు', 'తేనెటీగలు', 'మంచు ముత్యాలు', 'అక్షర శిల్పాలు', 'ఎందరో మహానుభావులు', 'వాడని మల్లెలు' వంటి పద్య, గద్య పుస్తకాలు వెలువరించారు. నాగభైరవ కోటేశ్వరరావు ఆయనకు 'అభినవ వేమన' బిరుదును ప్రదానం చేశారు. ఎమ్మెస్‌రెడ్డి రాసిన 'మల్లెమాల రామాయణం' చదివిన గుంటూరు శేషేంద్ర శర్మ 'మళ్లీ పుట్టాడు వాల్మీకి మల్లెమాలగా' అని ప్రశంసించారంటే కవిగా ఆయనది ఎంతటి ఉన్నత స్థాయో అర్థమవుతుంది. ఇటీవల ఆయన రాసిన స్వీయ చరిత్ర 'ఇదీ నా కథ' సినీ రంగంలో ఎంతగా కలకలం సృష్టించిందీ తెలిసిందే. ఐదువేలకు పైగా పాటలు, పద్యాలతో తుది శ్వాస వరకూ సాహితీ సేద్యం చేసిన చలన చిత్ర శ్రామికుడు ఈయన. తెలుగు చిత్రసీమకు ఆణిముత్యాల్లాంటి సినిమాల్నీ, పాటల్నీ అందించిన మేటి నిర్మాత.  సాహితీ లోకానికీ, తెలుగు భాషకూ అపార సేవ చేసిన సుందరరామిరెడ్డి తెలుగు వారి హ్రుదయాల్లో చిరస్మరణీయంగా ఉంటారనడంలో సందేహం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Legendary musician ravi shankar
Ghantasala jayanti  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles