Veteran comedian sutti velu dies

Kuru Maddali Lakshmi Narasimha Rao,Comedian Sutti Velu

Veteran comedy and character actor Kurrumadali Lakshmi Narasimha, popularly known as Suttivellu, passed away in Chennai on Sunday morning after a brief illness. Suttivellu made his debut in Mudda Manda-ram but his ticket to fame was Nalugu Stambhalata. His association with ace comedy filmmaker Jandh-yala made him a much sought-after comedian in the ‘80s and ‘90s.

9.1.png

Posted: 09/17/2012 04:45 PM IST
Veteran comedian sutti velu dies

Veteran_Comedian_Sutti_Velu

Comedian-Sutti-Veluహాన్య నటునిగా రెండు దశాబ్దాల పాటు ప్రేక్షకుల్ని తన 'సుత్తి'తో తెగ నవ్వించిన సుత్తి వేలు అనంతరం కాలంలో కరుణ రసాత్మక, విషాద పాత్రలతో ఏడిపించినట్లే ఇప్పుడు తనను ప్రేమించే ఎంతోమందిని ఏడిపిస్తూ భౌతికంగా దూరమైపోయారు. ఎనభైలలో తెలుగు ప్రేక్షకుల్ని తమదైన హాస్యంతో నవ్వుల జడివానల్లో ముంచెత్తిన 'సుత్తి జంట'లో రెండో వారైన సుత్తి వేలు (65) మరణంతో ఆ జంట శకం పూర్తిగా ముగిసింది. తెలుగు సినిమా ఓ చక్కని కళాకారుణ్ణి కోల్పోయింది. తెరమీద హాస్యంతో అందర్నీ నవ్వించిన సుత్తి వేలు ఇప్పుడు వారందన్నీ విషాదంలో ముంచేస్తూ కానరాని లోకాలకు తరలిపోయారు. సుత్తి జంటలో మొదటివారైన సుత్తి వీరభద్రరావు ఎన్నడో 1988లోనే మృతి చెందిన సంగతి చాలామందికి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం తెల్లవారు ఝామున నిద్రలోనే గుండెపోటుకు గురై ఇహలోకాలకు తరలిపోయిన సుత్తివేలు అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీనరసింహారావు.

సుత్తి వేలు స్వస్థలం కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం. 1947 ఆగస్టు 7న జన్మించిన ఆయనకు చిన్నతనంలో చదువు అబ్బలేదు. సెవన్త్ ఫామ్ రెండోసారి కానీ గట్టెక్కలేకపోయారు. ఆయన దృష్టి ఎక్కువగా రంగస్థలం మీదే. సుమారు ఓ దశాబ్దం పాటు నాటకాల్లో నటించిన ఆయన జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన 'ముద్దమందారం' (1981) చిత్రంతో సినిమాల్లో కాలుపెట్టారు. జంధ్యాలతో వేలు అనుబంధం ఎంతటిదంటే ఆ తర్వాత ఆయన తీసిన దాదాపు అన్ని చిత్రాల్లోనూ వేలు నటించారు. ఇక వీరభద్రరావుతో అనుబంధం అయితే మరింత గట్టిది. కమెడియన్‌గా వేలు మంచి పరిణతి సాధించడంలో వీరభద్రరావు సూచనలు ఎంతో ఉపకరించాయి.

Comedian-Sutti-Velu3సుత్తి బ్రదర్స్‌గా అందరికీ పరిచయం ఉన్న నటులు సుత్తి వీర భద్రరావు, సుత్తివేలు, సుత్తి వీరభద్రరావు చాలాకాలం కిందట దివికేగితే.... ఆ జంటలో ఒక్కరైన సుత్తివేలు తనదైన చక్కని హాస్యంతో, టైమింగ్‌ పంచ్‌ డైలాగ్‌లతో ఈ తరం ప్రేక్షకులను కూడా అలరించారు. ఏడేళ్ల వయసులోనే రంగస్థలంపై ఎంట్రీ ఇచ్చిన సుత్తివేలు అనందోబ్రహ్మతో బుల్లితెరపై కనిపించి కడుపుబ్బా నవ్వించారు. టైమింగ్‌తో ఆకట్టుకునే సుత్తివేలుకు 1985లో వచ్చిన వందేమాతరం సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయనటుడిగా నంది అవార్డు అందుకున్నారు.

ఎప్పుడూ హాస్యప్రధానంగా కనబడే క్యారెక్టర్‌లో కాకుండా వందేమాతరం, ప్రతిఘటన ఇలాంటివి ఎన్నో  సీరియస్‌నెస్‌ ప్త్రాల్లోనూ పరకాయప్రవేశం చేసి తానేంటో తెలుగు ప్రేక్షకులకు చూపించారు. ఆ అభిమానమే నంది అవార్డు వరకూ తీసుకెళ్ళింది. సుత్తివేలుకు అవసరానికి తగిన, సాదాసీదాగా జీవించడానికి అవసరమైన డబ్బును భగవంతుడు తనకు ఇచ్చాడని మురిసిపోయేవారు. హాస్య నటునిగా ఆయనకు పేరు తెచ్చిన చిత్రాల్లో రెండు జెళ్ల సీత, శ్రీవారికి ప్రేమలేఖ, బాబాయ్ అబ్బాయ్, రెండు రెళ్లు ఆరు, చంటబ్బాయ్, దొంగమొగుడు, యముడికి మొగుడు, అప్పుల అప్పారావు, గీతాంజలి వంటి సినిమాలున్నాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరలని యావత్తు సినీ ప్రేక్షకుడు కోరుకుంటున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles