Father of white revolution verghese kurien

Verghese Kurien, Amul, Milk, Gujarat, Kerala, India, Father of White Revolution

mpressed by the success of Amul, former Prime Minister Lal Bahadur Shastri established National Dairy Development Board (NDDB) to replicate the Amul model across the country and Kurien was made its chairman.

Father of White Revolution Verghese Kurien.png

Posted: 09/11/2012 01:42 PM IST
Father of white revolution verghese kurien

Father_of_White_Revolution_Verghese_Kurien

kurien_1వ్యవసాయంలో సమూల మార్పులు తీసుకురావడానికి ఎం.ఎస్. స్వామినాథన్ ఎలా క్రుషి చేశాడో, పాల ఉత్పత్తిలో కూడా అలాంటి మార్పులే తీసుకు వచ్చి, దేశ పాల విప్లవ పితామహుడు పేరు పొందాడు వర్గీస్‌ కురియన్‌. గుజరాత్‌ పాల సహకార సంఘం మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ను స్థాపించి పాల ఉత్పత్తి రంగంలో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టారు. అమూల్‌ పాల ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు.  పాడి పరిశ్రమ సమగ్రాభివృద్ధికి దోహదం చేసిన వర్గీస్ కురియన్ ఆదివారం కన్నుమూశారు. 90 సంవత్సరాల కురియన్ దీర్ఘకాలంగా అస్వస్థతో బాధపడుతున్నారు. ఆనంద్ జిల్లా పొరుగున ఉన్న నాదియాద్‌లోని ముల్జ్భీయ్ పటేల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

భారత దేశం పాడి పరిశ్రమలో ప్రపంచంలో అగ్రస్థానంలో నిలవడానికి ఈయన విశేష క్రుషి చేశారు. ఆయన 1921 నవంబర్ 26వ తేదీన కేరళలోని కోజికోడ్‌లో జన్మించారు. చెన్నైలోని లయోలా కాలేజీలో సైన్స్‌లో డిగ్రీ చదివారు. ఆ తర్వాత ప్రభుత్వ ఉపకారవేతనంతో డైరీ ఇంజనీరింగ్ చేశారు. బెంగళూర్‌లోని పశు సంవర్ధన, పాడి పారిశ్రమ సంస్థలో శిక్షణ తీసుకున్నారు.మిషిగాన్ విశ్వవిద్యాలయంలో 1948లో మెకానికల్ ఇంజనీరింగులో మాస్టర్స్ డిగ్రీ చేశారు. డైరీ ఇంజనీరింగ్ ప్రత్యేకాంశంగా ఈ మాస్టర్స్ డిగ్రీ చేశారు. కురియన్‌ శ్వేత విప్లవ పితామహుడు. దేశంలో ఎక్కడైనా అందరికీ పాలు అందుతున్నాయంటే ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలే. గ్రామ గ్రామానా పాల ఉత్ప త్తి సంఘాలను ఏర్పాటు చేసి పాల నిల్వలతో ప్రపంచానికి ఆదర్శ ప్రాయుడయ్యారు. అందుకే ఆయన గాడ్‌ఫాదర్‌. పాలు ఉత్పత్తి చేసే వారందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చిన కురియన్‌ మన దక్షిణాది నుంచే అక్కడకు వెళ్ళారు. 1949లో గుజరాత్‌లోని కైరా జిల్లా కో ఆపరే టివ్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ యూనియన్‌లో ఉద్యోగిగా చేరారు. ఇక్కడ చేరడానికి యూనివర్శిటీలో అతని స్నేహితుడు త్రిభవనదాస్‌ పటేల్‌ అమూల్‌ కారణం.

kurienఅమూల్‌గా పిలుచుకునే త్రిభువన్‌దాస్‌ కైరా జిల్లా కో ఆపరేటివ్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ యూనియన్‌కు చైర్మన్‌ గా ఉండేవారు. అతని కోరిక మేరకు పాల పరికరాలు ఏర్పాటు చేయడానికి ఆ సంస్థలో జాయిన్‌ అయ్యారు అక్కడి నుండి కురియన్‌ పాల విప్లవం మొదలయ్యింది. జిల్లాలోని పాల ఉత్పత్తి సంఘాలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చారు. అమూల్‌ పేరున అన్ని సంఘాలను విలీనం చేశారు. పాల ఉత్పత్తి పెంచడానికి రైతుల వద్దకు వెళ్ళి సూచనలిచ్చారు. మిగిలిన పాలను పాలపొడిగా మార్చి ప్రపంచ వ్యాప్తంగా మార్కెటింగ్‌ చేశారు. దీంతో అమూల్‌ పాలకు డిమాండ్ పెరిగింది. దీనికి సంబంధించి గుజరాత్‌ రాష్ర్టమంతటా పాల ప్రాసెసింగ్‌ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. విజయాలకు అందలమెక్కారు కురియన్‌ 1979 నుంచి 2006 వరకూ అమూల్‌ సంస్థకు చైర్మన్‌గా ఉన్నారు.అమూల్‌ విజయానికి ముగ్ధుడైన అప్పటి ప్రధాన మంత్రి లాల్‌బహదూర్‌ శాస్త్రి దేశవ్యాప్తంగా అమూల్‌ మోడల్‌ను ప్రతిబింబించేందుకు నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేసి దానికి కురియన్‌ను చైర్మన్‌గా నియమించారు. నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు ప్రపంచంలో అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ. పాల సేకరణకు 1970లో ఆపరేషన్‌ ఫ్లడ్గను ప్రారంభించారు. 1965 నుండి 33 సంవత్స రాల పాటు నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు అధ్యక్షుడిగా కురియన్‌ పనిచేశారు. ఒక జాతీయ పాల గ్రిడ్‌ సృష్టించారు. ఈ సంస్థ కింద 10 లక్షల మంది రైతులు 20 మిలియన్‌ లీటర్లు దేశ వ్యాప్తంగా 200 పాడి పరిశ్రమ సహకార సంఘాలు అందిస్తున్నాయి.

అవార్డులు : పాడి పరిశ్రమకు ఆయన చేసిన కృషికి డాక్టర్‌ కురియన్‌ భారత, విదేశీ పురస్కారాలు అందుకుతన్నారు. కమ్యూనిటీ లీడర్‌షిప్‌ కోసం 1963లో రామన్‌ మెగసేసే అవార్డు. 1966లో డాక్టర్‌ సర్వేపల్లి రాధా కృష్ణన్‌ నుంచి పద్మభూషణ్‌, 1986లో కృషిరత్న అవార్డు, 1986లో వాల్టెర్‌ శాంతి అవార్డును, 1989లో వరల్డ్‌ ఫుడ్ ప్రైజ్‌ అవార్డును, 1993లో ప్రపంచ డెయిరీ ఎక్సో నుండి మ్యాన్‌ ఆఫ్‌ది ఇయర్‌ అవార్డును, 1999లో పద్మ విభూషణ్‌ అవార్డును అందుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles